బ్లాక్‌బెర్రీకి ప్రత్యామ్నాయం భారత్‌బెర్రీ
బ్లాక్‌బెర్రీ సేవలను వినియోగించినప్పుడు అది పంపే సమాచారాన్ని ప్రభుత్వం నిరోధించేందుకు అవకాశాలు కల్పించకపోవడంతో దేశంలో బ్లాక్‌బెర్రీ సేవలు నిలిచిపోయాయి. ఈ వివాదానికి తెరపడకపో వడంతో భారతీయ సంస్థ ఒకటి బ్లాక్‌బెర్రీకి ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టింది. అదే ‘భారత్‌బెర్రీ’. గత కొద్ది రోజులుగా పరిశీలనలో ఉన్న యీ కొత్త బెర్రీని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ లాంఛనంగా ప్రవేశ పెట్టారు. దాతా ఇన్ఫోసిస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సిఇఒ అజరు దాత మాట్లాడుతూ బ్లాక్‌బెర్రీ ఫోన్ల ఆన్‌లైన్ వినియోగాన్ని ప్రభుత్వం పర్యవేక్షించలేకపోవడమనే సమస్యను దేశీయంగా రూపొందించిన ‘భారత్ బెర్రీ సేవలతో పూర్తిగా పరిష్కరించవచ్చని తెలిపారు. ఈ దేశీయ ఉత్పత్తిని అన్ని భారతీయ చట్టాలకు లోబడి అన్ని బ్లాక్‌బెర్రీ, యితర ఫోన్లతో పనిచేసేలా రూపొందించామని అజరు తెలిపారు. ఇ-మెయిల్స్ సహా సేవలు పొందడానికి వినియోగదారులు నెలకు రూ.100 రుసుము చెల్లించాలవి వివరించారు. క్యాలెండర్ సింక్రోనైజెషన్, కాంటాక్టుల కోసం నెలకురూ.50 చెల్లించాలవి తెలిపారు. భారత్‌బెర్రీ సాఫ్ట్‌వేర్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ టెక్నాలజీలు, ఎక్స్‌జెన్‌ప్లస్‌గా ప్రసిద్ధి చెందిన అత్యంత ఆధునిక ఇ-మెయిల్ సర్వర్ ద్వారా భారత్ బెర్రీ పనిచేస్తుంది. బ్లాక్‌బెర్రీ సర్వర్లు దేశానికి వెలుపల ఉండటం వలన అవరోధించడానికి (ఇంటర్‌సెప్ట్ చేయడానికి) ప్రభుత్వానికి వీలుపడదు. అయితే భారత్ బెర్రీ సర్వర్లు దేశంలో ఉండటం వలన భధ్రతాపరమైన చర్యలు తీసుకునేందుకు అందుబాటులో ఉంటుంది.
Posted by gopal on ఫిబ్రవరి 28, 2011 at 1:30 సా.
spl item
Posted by అమ్మపల్లి.పార్థసారథి on ఏప్రిల్ 21, 2013 at 7:05 ఉద.
చాలా బాగుంది