తేనీటి సమయం

కేర్‌కేర్‌ … కెరీర్‌కెరీర్‌
నిన్న
బిడ్డ నేలమీద పడి
కేర్‌…కేర్‌
నేటి
బుజ్జాయి
అమ్మ బొజ్జ నుంచే
కెరీర్‌ … కెరీర్‌

(అ)భాగ్యనగరం బస్సెక్కి చూడు
దేవుడు లేనేలేడు
ఇది పరిశోధన పత్రం
స్వర్గం లేనేలేదు
ఇది అనుభవసారం
అయితే….
నరకం మాత్రం ఉందంటాను
అదెక్కడో చూపమంటే
మన (అ)భాగ్యనగరం బస్సెక్కి చూడమంటాను

15 వ్యాఖ్యలు

  1. ఎడిటర్ గారు
    మీ జొక్స్ చాలా బాగునాయి.

    స్పందించండి

  2. INTAKI MEERU EVI SONTAMGA VRASI POST CHESTUNNARA??????

    స్పందించండి

  3. చాలా సక్షిప్తంగా , చాలా సూటిగా వున్నాయి సార్! నాకు ఇలాంటివి తెగ నచ్చుతాయి . నా నోట్ బుక్ లో రాసుకుంటున్నా! సందర్భమోచ్చినప్పుడు ఉపయోగించుకుంటా! మీ ఈమెయిలు నాకు ఇవ్వటానికి అభ్యంతరమా!

    స్పందించండి

  4. మరిన్ని కవితలు కూడా కావాలి కావూరి గారూ !ఎదురుచూస్తున్నాము !

    స్పందించండి

  5. తెలుగులో ఎండ్లూరి సుధాకర్ “రుబాయీలు ” పేరుతో తరుచుగా శక్తి వంతమయిన కవితలు రాస్తున్నారు.దాని నియమాలు చాలా తేలిక .4 పాదాలుంటాయి .ప్రతి పదానికి చివర అంత్య ప్రాసలు …మూడో పాదం చివరలోతఖల్లుస్( నామముద్ర).కవిత ఒక statement లాగా వుంటుంది. పారశీక భాషలో చాలా ప్రసిద్ధమయిన ప్రక్రియ.ఉమర్ ఖయ్యాం రుబాయతులు లాగే.ఇటువంటివి రాజకియలమీద విసుర్లకి బాగా పనికి వస్తాయి.ఆరుద్ర గారి కూనలమ్మ వ్యవహారమే అనుకోండి!ఈ మధ్య నేను చదివిన కొన్ని సుధాకర్ రుబాయీలలో మచ్చుక్కి ఒకటి వినిపిస్తాను .వినివుంటే సరే..లేకపోతే ఆ రీతిలో ప్రయత్నం చేయచ్చు .
    మగ్గాల నడుములు విరిచేసారు
    సారె మీద మట్టి ముద్ద చేరిచేసారు
    ప్రపంచ మాయలు చూసావా రాదేయా!
    గల్లీ గల్లీకి సెల్లు దుకాణాలు తెరిచేసారు.

    ఇలా సాగుతుంది ధోరణి.
    నాకూ కూడా ఇవి చదివేటప్పుడు ఏవో కొన్ని బిట్స్ లాగా తోచినవి ..మీ దృష్టికి తెద్దామనే ఇంత పెద్ద వ్యాఖ్యానం రాసాను.
    నాకూ తోచినది :
    కనిపెంచిన నాయన కనుమరుగయి పోయ
    కనిపించే చిన్నాయన చెయిదాటి పోయ
    రాజకీయమంటే మరి అంతా మాయే జగనన్నా
    అయ్యో!చివరికి ఇడుపులపాయ ఏడుపులే నీకయిపాయ!
    వూరికే మీకు ఒక పరిచయం కోసం ఏదో రాసాను.ముందే తెలిసి వుంటే మంచిదే .ఇంతకన్నా మంచివి మీరు ప్రయత్నిస్తారేమోనని ఆశ!

    స్పందించండి

  6. Posted by srinu karasala on ఆగస్ట్ 28, 2011 at 4:08 సా.

    సుబ్బారావు బాగా రాశావు

    స్పందించండి

  7. aXaLic ntxmwnswcrsq, [url=http://mxnqulvkdbxp.com/]mxnqulvkdbxp[/url], [link=http://ekbfqafujxwf.com/]ekbfqafujxwf[/link], http://xxswxxqepjow.com/

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: