ప్రమాణాలకు మించి రక్తంలో చక్కెర చేరటమే మధుమేహం. మన శరీరంలోని క్లోమగ్రంధి (ప్యాంక్రియాస్) క్లోమరసాన్ని (ఇన్సులిన్) ఉత్పత్తి చేస్తుంది. ఈ క్లోమరసం రక్తంలో చక్కెర ప్రమా ణాలను నియంత్రిస్తుంది. అయితే క్లోమగ్రంధి రోగపూరితమయితే క్లోమరసం తయారీ మందగిస్తుంది. ఉత్పత్తి అయినా ప్రమాణాల మేర పనిచేయదు. ఈ కారణంగా రక్తంలో చక్కెర అధికంగా కలుస్తుంది. దానినే డయాబెటిస్, మధుమేహం, సుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు