Archive for జూన్ 23rd, 2010

జానెడు గుడ్డ ముక్క … కూసింత సబ్బుముక్క … రానేరాదు స్వైన్‌ఫ్లూ మీకిక!

స్వైన్‌ఫ్లూ … గతేడాది ప్రపంచాన్ని వణికించిన అమెరికా మహమ్మారి ఇది. దక్షిణాది రాష్ట్రాలలో మళ్లీ ఇప్పుడు నెమ్మదిగా పాగా వేస్తోంది. అప్రమత్తత లేకుంటే సోకటం ఎంత సులభమో, ూసురుతీయటమూ అంతే. స్వైన్‌ఫ్లూ వ్యాధిపట్ల్ల పలు అనుమానాలు, మూఢనమ్మకాలు, అసత్యాలు రాజ్యమేలుతోన్నందున వాటిని పటాపంచలు చేయాల్సిన అవసరముంది. తెలుగిల్లు గతేడాదే దీనిపై ఎనమిది పేజీల చిరుపొత్త్తాన్ని ప్రచురించి ప్రకాశం జిల్లాలో ూచితంగా పంపిణీచేసింది కూడా. ఇటీవలే ప్రారంభమయిన తెలుగిల్లు బ్లాగుద్వారా ూపయుక్తమయిన ఓ ప్రయోగం చేసేందుకు ఇప్పుడు సమాయత్తమయ్యామని తెలిపేందుకు సంతసిస్తున్నాను. స్వైన్‌ఫ్లూపై తలెత్తే అనుమానాలను తీర్చేందుకు తెలుగిల్లు ఏర్పాట్లు చేసింది. దీనికితోడు దీనికి సంబంధించి ఎక్కడ సంప్రదించాల్సిందీ వివరిస్తుంది. ఈ కార్యక్రమాన్ని అమెరికాలో మూడు వారాలపాటు భారత ప్రతినిధిగా శిక్షణ పొందిన వైద్య నిపుణులు, ఆరోగ్యశాఖ సహ సంచాలకుడు బి. మధుసూదనరావు నిర్వహిస్తారు. ఇక మీ అనుమానాలనూ, అవసరాలనూ తెలుపుతూ తెలుగిల్లును అంతర్జాలంలో సంప్రదించండి. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పొందండి.
మీ వెంకట సుబ్బారావు కావూరి, జర్నలిస్ట్టు.

మధువొలకబోస్తే మధుమేహమే – 2 అదుపుచేస్తే పిల్లి … అదుపు తప్పితే పులి

మధుమేహం లక్షణాలు ఇవీ

1. అధిక ఆకలి
2. అధిక దాహం
3. అధిక మూత్రవిసర్జన
4. బరువు కోల్పోవటం
5. పుండ్లు తగ్గకపోవటం
6. అరచేతులు, అరికాళ్లకు తిమ్మిర్లు
7. తరచూ చర్మవ్యాధులు
8. కోరికలు తగ్గటం
9. సంతానలేమి
వీటిలో ఏ మూడు లక్షణాలయినా మధుమేహ కుటుంబ చరిత్ర ూన్నవారిలో కన్పిస్తే పరీక్షలు చేయించుకోవాలి. అయితే మధుమేహం తీవ్రదశకు చేరేవరకూ లక్షణాలు కనపడకపోవచ్చు. ఈ కారణంగా కుటుంబంలో మధుమేహం ూండి, 25 సంవత్సరాలు దాటినవారంతా రక్త పరీక్ష చేయించుకోవటం ూత్తమం.