మధుమేహం లక్షణాలు ఇవీ
1. అధిక ఆకలి
2. అధిక దాహం
3. అధిక మూత్రవిసర్జన
4. బరువు కోల్పోవటం
5. పుండ్లు తగ్గకపోవటం
6. అరచేతులు, అరికాళ్లకు తిమ్మిర్లు
7. తరచూ చర్మవ్యాధులు
8. కోరికలు తగ్గటం
9. సంతానలేమి
వీటిలో ఏ మూడు లక్షణాలయినా మధుమేహ కుటుంబ చరిత్ర ూన్నవారిలో కన్పిస్తే పరీక్షలు చేయించుకోవాలి. అయితే మధుమేహం తీవ్రదశకు చేరేవరకూ లక్షణాలు కనపడకపోవచ్చు. ఈ కారణంగా కుటుంబంలో మధుమేహం ూండి, 25 సంవత్సరాలు దాటినవారంతా రక్త పరీక్ష చేయించుకోవటం ూత్తమం.