కేర్‌కేర్ … కెరీర్‌కెరీర్
ఁన్న
బిడ్డ నేలమీద పడి
కేర్…కేర్
నేటి
బుజ్జాయి
అమ్మ బొజ్జ నుంచే
కెరీర్ … కెరీర్
(అ)భాగ్యనగరం బస్సెక్కి చూడు
దేవుడు లేనేలేడు
ఇది పరిశోధన పత్రం
స్వర్గం లేనేలేదు
ఇది అనుభవసారం
అయితే….
నరకం మాత్రం ఉందంటాను
అదెక్కడో చూపమంటే
మన (అ)భాగ్యనగరం బస్సెక్కి చూడమంటాను