!
వైఎస్ జగన్ : ఏవోయ్, పెద్ద కాంట్రాక్టరూ, మా నాన్న విగ్రహం పనుల్లోనూ నొక్కుడేనా?
పె.కాం : నేను మొదటిసారిగా కట్టిన మనూరు వంతెన మూడోనాటికల్లా కూలిపోయింది చిన్నయ్యా. అప్పుడు మీ తాత నన్ను పిలిచి అడిగాడు. ఏమి చేసేదయ్యా? పొరబాటు జరిగిందని చెప్పాను.
వైఎస్ జగన్ : తర్వాత?
పె.కాం : రెండో పని స్కూలు బిల్డింగు కట్టాను చిన్నయ్యా. అది వారంరోజులుండీ మరీ కూలిపోయింది. ఆనాడు మీ నాన్న రాజశేఖరరెడ్డి పిలిచి అడిగితే గ్రహపాటని చెప్పి తప్పుకున్నా.
వైఎస్ జగన్ : ఈ విగ్రహం సంగతేంటి?
పె. కాం : సంగతేముందయ్యా! అక్రమాలు చేసిచేసి అలవాటయ్యిందయ్యా, చిన్నయ్యా!
వైఎస్ జగన్ : అంతేనంటావా?
పె. కాం : ఏమి సేతురా లింగా, ఏమీ సేతు !
పొరబాటు, గ్రహపాటు దశలు దాటెరా లింగా !!
అవినీతి అలవాటయ్యెరా లింగా !!!
(కడప పట్టణం తిరుపతి రోడ్డులో జులై ఎనిమిదో తేదీన ప్రారంభించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం 15 రోజులకే కుప్పకూలిపోయిన సందర్భంగా ఈ వ్యంగ్యం)
24 జూలై
Posted by jayadev on జూలై 25, 2010 at 2:05 ఉద.
funny but fact sir