అవును. మొన్నటి సోమరిపోతు ఎంకటేసుల్లు నేడు రామదూతగా వెలుగొందుతున్నాడు. వీధులెంట అడుక్కుతిన్న ఎంకటేసుల్లు బాబాగా ఎదిగి 110 ఎకరాల సాగునీటి చెరువును ఆక్రమించాడు. మరోపక్కనున్న అటవీభూమిని కబ్జాచేసి కట్టడాలు నిర్మించాడు. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కేంద్రమంత్రి బాలు, రాష్ట్ర డిజిపి గిరీష్‌కుమార్, సీనియర్ ఐఎఎస్ అధికారి సునీల్‌శర్మ సహా ఎందరో రాజకీయ ప్రముఖులు, మరెందరో ఉన్నతాధికారులు ఇప్పుడు ఆయన శిష్యులు. వీళ్లంతా తరచూ రామదూత ఆశ్రమాన్ని సందర్శిస్తుండటం బహిరంగ రహస్యం. గిరీష్‌కుమార్ అయితే ఎంకటేసుల్లు ఉరఫ్ రామదూత ఉరఫ్ కబ్జాదారు కాళ్లమీద బహిరంగంగా బోర్లాపడటం వ్యక్తిగా ఆయనిష్టమేగానీ, ఓ ఉన్నతాధికారిగా చేయకూడని నేరం, ఘోరం.
శాస్త్రీయతపట్ల మక్కువగల పౌరుడిగా, పాత్రికేయుడిగా నేను ఈ ఎంకటేసులుపై 2002లోనే అందరికన్నా ముందు కలంతో పోరాటానికి తెరలేపాను. అన్నట్లు ఈ ఎంకటేసుల్లు ఆశ్రమం ప్రకాశం జిల్లా చాగల్లు గ్రామం చెంత ఓ వైపు కొల్‌కతా – చెన్నయ్ రైలు మార్గానికీ ఐదో నంబరు జాతీయ రహదారికి నడుమన విస్తరిస్తోంది. తిరుపతి, చెన్నయ్‌కు రైల్లోనో, బస్సులోనే వెళ్లే ప్రయాణికులు సింగరాయకొండ దాటిన తర్వాత కావలికి చేరబోతున్నామనగా ఈ ఆశ్రమాన్ని చూడవచ్చు. ఐదో నంబరు రహదారి వెంట 60 – 70 అడుగుల ఎత్తున దేవతా విగ్రహాలు ఉన్నదే రామదూత ఆశ్రమం.
అప్పుడప్పుడే ఆశ్రమం మొగ్గతొడుగుతున్న సమయంలో నేనూ, నా సహచర పాత్రికేయుడు ఎస్‌వీ బ్రహ్మంతో కలిసి రామదూతను 2002 ప్రథమార్ధంలోనే ఓ ఆటాడించాను. ఓ చక్కటి ఉదయాన రామదూతను ఆశ్రమంలో కలిసి పేరుసహా అన్నీ అబద్ధాలే చెప్పి నా సమస్యలకు పరిష్కారం కోరాను. ఎవ్వరి భవిష్యత్తునయినా తాను ముందే రంగరించి చెబుతానని చెప్పుకునే ఎంకటేసుల్లు ఒక్కటంటే ఒక్క అబద్ధాన్నీ పట్టుకోలేకపోవటంలో ఆశ్ఛర్యం ఏముంది. ఆశ్రమానికి పది వేలు సమర్పించుకుంటే చాలు డిఎస్‌సీలో నాకు ఉపాధ్యాయ ఉద్యోగం రాకుండా అడ్డగిస్తోన్న శని బలహీన పడుతుందని నాతో రామదూత బేరం పెట్టాడు. అంత ఇచ్చుకోలేని పేదవాడినని వేడుకోగా, కనీసం ఐదు వేలన్నా ఇచ్చి, ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంత ఎక్కువ ఇచ్చు కుంటే నా భవిష్యత్తు అంత బాగుంటుందని భరోసా ఇచ్చాడు. ఉపాధ్యాయ ఉద్యోగం రావటం మాట అంటుంచండి, నాకు డిఎస్సీ రాసేందుకు అవసరమయిన డీఎడ్‌గానీ, బీఎడ్‌గానీ లేదు. నిరుద్యోగిలాగా నటించి, డిఎస్సీలో ఉద్యోగం వస్తుందో? రాదో? రాకుంటే ఏమి చేయాలో? చెప్పమనగానే ఓ తమలపాకుపై పిచ్చిగీతలు గీసి పదివేలకు ఎర వేశాడు. నేను చెప్పిన అబద్ధాలన్నీ ఇక్కడ రాయాలంటే చాట భారతమే అవుతుందని నమ్మండి. చెరువు భూమిని కాపాడుకోవటానికి రాజకీయనాయకుల్ని బుట్టలో వేసుకున్న ఎంకటేసుల్లు, అటవీ భూమి అక్రమణ కేసుల్నుంచి తప్పించుకోవటానికి ఆ శాఖాధికారి భార్యనే బుట్టలో వేసుకున్న ఘనుడు. ఆమె కూడా ఈ ఆశ్రమంలోనే శాంభవీమాతగా పూజలందుకుంటోంది. ఆమెగారి భర్తగారికి ప్రభుత్వం ఇచ్చిన వాహనం నిత్యం ఆశ్రమంలోనే కొలువుదీరి ఉంటుంది. అయ్యగారితో ముఖాముఖి పూర్తయిన తర్వాత రోజునుంచీ వరుసగా ఆరు రోజులపాటు ప్రజాశక్తి దినపత్రికలో ప్రత్యేక కథనాలు రాశాను. దీంతో ఎంకటేసుల్లు, ఆయన పరివారమూ భయపడిపోయి పెద్దల్ని రోజూ రాయబారం పంపేవాడు. అన్ని రకాలుగా సహకరిస్తానని మొదలు పెట్టి చివరకు బెదిరింపులకూ దిగాడు. అంతకు మునుపే అదే ప్రాంతంలో తిష్టవేసిన బండ్లమాంబతో పోరాటం చేసిన నేను రామదూత శాపనార్ధాలకు లొంగటం అసంభం కదా?. ఆసక్తిదాయకమయిన బండ్లమాంబపై పోరాటం మరోసారి చెబుతానూ! కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో కృష్ణస్వామిపై నేను చేసిన కలం యుద్ధంలో డాక్టర్ సమరం కూడా నేరుగా పాలుపంచుకోవటం ఎన్నడూ మరచిపోలేనిది.
సరే చివరిగా చెప్పొచ్చేదేమిటంటే…. మొక్కై వంగనిది మానయి వంగదని పెద్దలన్నట్లుగా ఈ బాబాలు, అమ్మలు పుట్టేందుకు మన సమాజంలో బోలెడు, బోలెడు అవకాశాలున్నాయి. ప్రశ్నకు తావులేని సమాజంలో ఎంకటేసుల్లు, బండ్లమాంబలూ పుట్టగొడుగుల్లా పుడతారంతే. కనీసం ఎవడయినా ప్రశ్నించినప్పుడయినా ఆరా తీసి మద్దతిస్తే, శిక్షిస్తే…. అప్పుడు చాగల్లు సాగునీటి చెరువులు కబ్జా కావు. అటవీ భూములు ఈ తీరున ఆక్రమణలకు గురికావు. అమ్మాయిల జీవితాలు బండ్లమాంబ ఆశ్రమంలో అర్ధాంతరంగా ముగిసిపోవు. కృష్ణస్వామి అక్రమ శృంగారానికి యువకులు బలయిపోరు. సర్వే జన సుఖినోభవంతు అంటూ దీవిస్తే సుఖాలు వళ్లో వాలవు. సర్వ జనులకూ ప్రశ్నించటం నేర్పితే ఈ సమాజం అభివృద్ధి పథం పడుతుంది. ఆసక్తి ఉన్న మిత్రులను చర్చకు ఆహ్వానిస్తున్నాను.
28 జూలై
Posted by Anon on జూలై 28, 2010 at 5:48 సా.
చర్చ ఏముంది? మీలాంటి జర్నలిస్టులు వీళ్లను పేపర్ కూ, టీవీకీ ఎక్కించడం చేస్తూనే ఉండాలి!
Posted by ramana maharshi on జూలై 28, 2010 at 5:59 సా.
nuvvu yentha jilani gaadivo ardhamavthondhi. sasthreeyatha meedha makkuvaaa thokka, neeku asalu avagahana ledhani thelusthondhi.. okadni mosam cheyyachu vandhamandhini mosam cheyyachu, 10,000 mandhini mosam cheyyachu.. dgp lani, cm lani mosam chesthunnadani chepthunnavante neekunna vishaya parignanam thelusthondhi.. chethilo pen undhi kadha ani nuvvu, camera undhi kadha ani aa worst electronic media verrri koothalu koosthunte alaage saaar ani yevadu yekibhavinchadu.. first aayana dhaggariki yendhuku anthamandhi vasthunnaro thelsuko. chadhuvuleni vaallani mosam chesthunnadante anukovachu. chadhuvukunna vaallu yendhuku velthunnaru aayana dhaggariki anedhi konchem burra vaadithe thelusthundhi, dhayachesi dhevudichina burra ni vaadavalsindhi ga prardhana.. aayanaki dhasa maha vidhyallo ye vidhyalocho, aayana dhanni yendhuku upayogisthunnaro, yemi aasinchi upayogisthunnaro akkada janalni adigi kulamkushamga research chesi thelsukuni next blog post ga raayi.. ne notikochina kaarukoothulu keyboard undhi kadha ani kotti janala minds ni kalushitham cheyyaddhu.. aayana nerchukunna vidhyala gurinchi aayana valla janalaki yemi upayogam kaligindhi ane dhani gurinchi kuda raayi.. siggumaalina one-sided journalism vaddhu.. nee lanti vaalla valla journalism brashtupattipoyindhi..
Posted by kiran on జూలై 28, 2010 at 6:16 సా.
its good to read your valuable experiences. we tend to read the news in media with out knowing how much efforts the journalists have taken to gather that valuable information.keep it going.
Posted by vijayabhanukote on జూలై 29, 2010 at 4:29 సా.
this is really a nice blog. thought provoking. i appreciate ur endeavour:-)
Posted by కృష్ణశ్రీ on జూలై 30, 2010 at 7:16 ఉద.
ఈ రామదూత విషయం చాలా రోజుల క్రితమే బయటికి వచ్చింది కదా? పేపర్లలో డీజీపీ ఫోటోలూ, బ్లాగుల్లో వ్యాఖ్యలూ కూడా వచ్చాయి.
ఇక నగ్నదేవత మంగమ్మవ్వ దగ్గరనించీ, మీడియా లో మీలాంటివాళ్ళూ, మీకన్నా ముందు పబ్లిక్ లో సమరం లాంటివాళ్ళూ, ఏ టీ కోవూర్ లూ వీళ్ళ నాటకాలని బయటపెడుతూనే వున్నారు.
అయినా, మూర్ఖత్వం కొన్ని వందల శాతం పెరిగింది గానీ, తగ్గడం లేదు.
దీనికి పరిష్కారం?
Posted by చదువరి on జూలై 31, 2010 at 4:38 ఉద.
డీజీపీ పోయి అతగాడి కాళ్ళమీద పడితే, పేపర్లలో ప్రముఖంగా వచ్చింది, అలాంటి దొంగ సన్నాసి దగ్గరికి ఈయనెందుకెళ్ళాడని. అప్పుడేగా ఈ డీజీపీ అన్నది – నా నమ్మకం నా యిష్టం అని! ఈ డీజీపీ బాపతు జనం చేతి;లో అధికారాలున్నన్నాళ్ళూ ఈ బాబాల్లాంటి వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు. ప్రచారం కోసం పేపర్లలో ప్రకటనిలిచ్చుకుంటూ కూడా ఉంటారు.
మీరీ బాపతు బాబాలు, వాళ్ళ సత్రకాయలైనవారి వాగుళ్ళకు తగ్గేవాళ్ళు కాదని నా ఉద్దేశం. కానీండి.
Posted by వెన్నెలరాజ్యం on ఆగస్ట్ 3, 2010 at 7:09 సా.
ప్రశ్నకు తావులేని సమాజంలో ఎంకటేసుల్లు, బండ్లమాంబలూ పుట్టగొడుగుల్లా పుడతారంతే
బాగా రాశారు సార్