”ముదనష్టపోళ్లారా … ఎక్కడెక్కడదీ చాలకుందే మీకు!”

”ముదనష్టపోళ్లారా … ఎక్కడెక్కడదీ చాలకుందే మీకు!” అంటూ పాలబూత్‌ దగ్గర చేతిలో దినపత్రికతో కూర్చున్న ఓ పెద్దాయన తుపుక్కున ఉమ్మి పెద్దపెద్దగా కేకలు పెడుతుండటం నా కంటబడింది శనివారం ఉదయం. ఇంటికెళ్లి చూద్దునుగదా, పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు వార్త చదివిన ఆ పెద్దాయనకు కడుపు మండిందని అర్ధమయింది నాకు.
అవును మరి. ఎవరికయినా కడుపు మండదూ మరి?
ప్రస్తుత పార్లమెంటునే తీసుకుందాం. తాము కోటీశ్వరులమని లోక్‌సభలో 542 కిగాను ఓ 300 మంది, రాజ్యసభలో 215 మందికిగాను ఓ 95 మంది రాతపూర్వకంగా వాళ్లకు వాళ్లే చెప్పుకున్నారు. ఇప్పుడేమో, జీతాలు పెంచమంటూ అలకబూనితే కోపం నషాళానికి అంటకపోతే తప్పు. రక్తపోటు పెరిగి గబగబా నాలుగు బూతులు తిట్టి శాంత పడకపోతే మనిషేనా అని ఎవరినయినా అనుమానించక తప్పదేమో! అన్నట్లు కోటీశ్వరులు కోటీశ్వరుల గురించి చర్చిస్తారుగానీ, డొక్కలెండేవాడి గురించి చర్చిస్తారా? మన పిచ్చికాకపోతే. వాడికి ఓటేయనేల? ఇప్పుడు నోరుపారేసుకోనేల? అంటూ పేపరు పెద్దాయన పక్కనున్న చిన్నోడు వేసిన ప్రశ్నా ఆలోచించదగినదే. చేతులు కాలాక ఆకులు పట్టుకునేకన్నా ముందే జాగ్రత్త పడలేమా?
14వ లోక్‌సభలో (2004) 154 మంది కోటీశ్వరులు ఉండగా ఇప్పుడా సంఖ్య రెట్టింపయింది. కాంగ్రెసు పార్టీకి ప్రస్తుత లోక్‌సభలో 206 మంది సభ్యులుండగా అందులో 138 మంది కోటీశ్వరులే. లోక్‌సభ సభ్యులందరికీ రూ. 3075 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల సంఘానికి వాళ్లిచ్చిన ఆధారాలు పట్టిచూపుతున్నాయి. వాస్తవ విలువయితే దీనికి ఎన్ని రెట్లు అదనంగా ఉంటుందో వేరేగా లెక్కలు వేసి మరీ విడమరిచి చెప్పాల్సిన పనిలేదు. దీనికితోడు లెక్కకు రాని ఆస్తులు ఇంకెన్ని ఉంటాయో వెలికి తీసి చెబితే బహూశా కోట్లాది మందికి మూకుమ్మడిగా గుండెపోట్లు రావచ్చని నా ప్రగాఢ భయం. పారిశ్రామికవేత్తలు తమను తాము రక్షించుకోవటానికి శాసన వేదికల్లోకి చొచ్చుకొస్తున్న తీరుకు ఇది నిదర్శనం.
గత లోక్‌సభ ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం రూ. 1120 కోట్లు వెచ్చించగా, అభ్యర్థుల ఖర్చు రూ. 10 వేల కోట్లకు పైమాటేనని నిపుణులు అంచనా వేశారు. చట్టం ప్రకారమయితే కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే గత ఎన్నికల్లో పోటీబడిన మొత్తం అభ్యర్థులందరూ కలిపి ఖర్చుపెట్టుకోవచ్చు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ బొర్ర విరిచి చెప్పుకునే దేశంలో చట్టాలు చేయవలసిన నేతలే వాటిని ఛిద్రం చేసేస్తున్నారు. దోసకాయ దొంగతనం చేసిననాడే అన్నట్లుగా ఇక మేలుకోకపోతే … రేపటిని ఊహించటం కూడా కష్టమే. గత సర్పంచి ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఔటర్‌ రింగురోడ్డు సమీపంలోని ఓ గ్రామానికి సర్పంచిగా గెలిచిన పెద్దాయన తాను ఐదు కోట్లు ఖర్చుపెట్టానని చెప్పుకున్న విషయం మరుద్దామన్నా నాకయితే మరుపుకు రావటం లేదు. ఎకరం పది కోట్ల రూపాయలు పలికే 70 ఎకరాల పోరంబోకు భూమి ఉన్న పంచాయితీకి అంత ఖర్చుపెట్టక పోతే ఎలా గెలుస్తానని ఆయన ప్రశ్నించాడు. అందులో పదెకరాలు దక్కించుకున్నా కొన్ని తరాలు కాలుమీద కాలేసుకుని బతకొచ్చుగదా?! అని అసలు విషయం చల్లగా చెప్పాడా పెద్దమనిషి. పంచాయతి మొదలు లోక్‌సభ సభ్యుడిదాకా రహస్య నినాదం ఒక్కటే… అది ‘సొంతం’. అదీ సంగతి. తెలుసుకుని మసలుకోకపోతే తప్పు వాళ్లది కాదు. మనదే.
ఎంపీల జీతాల పెంపును గతంలో వలే ఈసారి కూడా వామపక్షాలు ప్రధానంగా సీపీఎం సభ్యులు వ్యతిరేకించటం ప్రశంసనీయం. రాష్ట్ర శాసనసభ్యులు ఇప్పటికి నాకు తెలిసి కనీసం మూడుసార్లు కోట్ల రూపాయల విలువయిన ఇళ్ల స్థలాల్ని కొట్టేయగా, సీపీఎం సభ్యులు మాత్రమే తీసుకోకపోవటం విశేషమేకదా మరి.! అన్నట్లు లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ కోటీశ్వరుల జాబితాలో వామపక్ష సభ్యులు లేరు. ప్రతిపక్ష బీజేపీకి లోక్‌సభలో 58 మంది కోటీశ్వరులున్నారు. అదే రాజ్యసభలో కాంగ్రెసుకు 33 మంది కోటీశ్వరులుండగా, బీజేపీకి 21 మంది ఆ జాబితాలో ఉన్నారు. తెర వెనుక ఉంటే కుదరని పరిస్థితుల్లో కోటీశ్వరులు తెర ముందుకు వస్తోన్న స్ధితిని ఇదంతా పట్టి చూపుతోంది. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి చవాన్‌ ఎన్నికల సమయంలో రూ. 75 కోట్ల విలువయిన వార్తల్ని వివిధ పత్రికల్లో రాయించుకున్నట్లు ప్రముఖ పాత్రికేయుడు పి సాయినాథ్‌ హిందూ దినపత్రికలో లెక్కలు వేశారు. అయితే చవాన్‌ లెక్కల్లో మాత్రం పత్రికా ప్రకటనల ఖర్చు కేవలం రూ. 5379 మాత్రమే. ఇదీ మన ప్రజాస్వామ్యం. పత్తికట్టెలు.
మన ప్రజాకవి వేమన అంటారూ….
”మేడి పండు చూడ మేలిమైవుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు”.

10 వ్యాఖ్యలు

 1. Chaala bagunnadi mee post.

  స్పందించండి

 2. baagaa raasaaru.. asalu veellaki jeetaalenduko? siggule ilanti vedhavalundabatte parlamentunu panduladoddi annaru tarimela naagireddy gaaru..

  స్పందించండి

 3. వారు అవినీతికి పాల్పడకుండా కట్టుదిట్టమైన నిబంధనలు విధించి, అవినీతి రుజువైతే కఠినమైన శిక్షలు విధించ గలిగితే వారి జీతాలు పదిరెట్లు పెంచినా నష్టం లేదేమో.

  స్పందించండి

 4. hi,

  Mps salaries are peanuts in Ocean, 5th pay commission hikes are 50 000 crore/yr and 6th pay will be much more. Even after that govt employees stopped taking bribe?

  I am not supporting Mps but this hike is a tip of ice berg. We need to pay a lot of taxes for our White elephant govt/employees for their service to Common man(we the people).

  Look at our govt hospitals they are like pig factories… For the price of common wealth games we can build AIIMS like hospitals 100.

  Dont worry about mps, observe carefully about the remaining things.

  స్పందించండి

 5. mee vyaakhyaanam chaala baagundi. lokamanta dummettipostonna.. navvipodurugaaka naaketi siggu ane vyvaharam lo unnavallani marchagaligedi evaru?

  స్పందించండి

 6. అవినీతిపరులని తెలిసి ఎన్నుకున్నాక ఇప్పుడు ఏమి అనుకున్న ప్రయోజనం లేదు కదా, కనీసం మీ విశ్లేషణ చదివి కొందరైన ఆలోచించడం మొదలు పెడితే మీ ప్రయత్నం ఫలించినట్టే. అలా ఫలించాలనే కోరుకుంటున్నా.

  స్పందించండి

 7. ప్రజాస్వామ్యమనెడి మేడిపండు,
  పొట్ట విప్పి చూడ రాజకీయనాయకులుండు.

  స్పందించండి

 8. యు. రామ క్రుష్న
  వ్యాసం బాగుంది. ప్రజాసెవకుదు ఎప్పుదూ ప్రతిఫలం ఆసించదు. ఇంత తెగబలిసిన వారు కూదా జీతాలు పెంచమంతున్నారంతె వారు ప్రజాసెవకులు కానె కాదు. మొసగాల్లు. సిపిఎం సభ్యులు నిజమైన ప్రజాసెవకులు కనుకనె వారు జీతాలు పెంచవద్దంతున్నారు. ఇల్ల స్థలాలూ తీసుకొవదం లెదు. ఈ విషయాలు మీదియా రాయదం లెదు. కనీసం మీరయినా రాసారు. థాంక్స్.
  ఎంపీల్లారా.. ఇకనైనా సిగ్గుపదంది. మీరు పొగెసుకున్నది చాలు. సిపిఎం ఎంపీలను చూసి నెర్చుకొంది. జాతికి సెవ చెయంది.

  స్పందించండి

 9. అయ్యా అంతగా ఆక్రోశా లేల ? ఓ చిన్న గ్రామపంచాయతీ ఎన్నికల్లోనే వార్డు మెంబరు పదవికే అభ్యర్ధులు లక్షలు( ఇప్పుడిప్పుడే కోటికీ చేరుతోందను కోండి) ఖర్చు పెడితేనే గొప్ప ప్రజా సేవకులుగా కీర్తించి ప్రజలు ఘనంగా చెప్పుకోవడం కొనసాగినంత కాలం, ఖర్చు పెట్టిన వాడు ప్రజా సేవ చేసే టందు కే నని మనసును మభ్యపెట్టుకున్నంతకాలం , ప్రజలకడ దోచిందే ఖర్చు పెట్టి తిరిగి దండుకు తినడని భ్రమించడం… యీక్షుద్ర ఓటు రాజకీయ ప్రజాస్వామ్య దుర్బలతలో సర్వ సామాన్యమయిపోయింది.

  ఎన్నికలప్పుడు వీడికన్నా వాడు నయమంటారు.ఎన్నుకుంటారు. ఎన్నికయిన తరువాత వాడు దండుకున్తున్నాడని ఆక్రోస పడతారు. డబ్బుతో ఎన్నికయన ప్రతి వాడూ దండుకుంటాడు.అంతే.మనమే స్థిరీకరించిన రూల్. మేరా దేస్ మహాన్.స్మశానాలానే మింగుతున్నా వారే ఘనం. మన వ్యవస్తను మనమే మార్చుకొనే స్థాయికి మనం, మారనంత కాలం.మన బ్రతుకుల దోపిడీని మనమే స్వాగతించక తప్పదు.

  అభినందనలు. మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు.చర్చను సరైన రీతిలోపెడ త్రోవ పట్టకుండా పరిష్కార మార్గం వైపు తీసుకు వెళ్ల గలరని ఆశిస్తూ అభినందిస్తూ……మరో రెండు విషయాలు.
  ఆశ అత్యాశగా మారి పేరాశ గా రూపొంది పట్టెడన్నం పొట్టకు సరి పోయినా పుట్టలుగా బంగారం కుప్పల కొఱకు …..ఆరడుగుల జాగాకన్న జీవితంలో ఏనాడూ అవసరంలేంక పోయినా వేలాది ఎకరాల భూమి కొఱకు వెర్రిగా ఎగబడుతున్న మానవుల పేరాశ ,.ప్రతి మనిషి దౌర్భాల్యం. అధికార వారసత్వం మనం స్వాగతిస్తున్నాం. అది మన దౌర్బల్యం. తరతరాల వారసులకోసం వేల కోట్లు కూడబెట్టినా మన ప్రజాస్వామ్యం ఒప్పుకుంటోంది. దానితో రాజకీయ దుర్మార్గాలను, వారి పేరాశను అడ్డుకోలేకపోతున్నాము.వారూ మనలోనుంచి వెళ్ళిన వారే కదా మరి. వ్రేళ్ళల్లో చీడ వదలి చివల్లకు మందు కొట్టినట్ట్లున్తుంది మన ఆక్రోశం. అర్ధం చేసుకోండి. …శ్రేయోభిలాషి …నూతక్కి.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: