ఎవడబ్బ సొమ్మాని కులికేరురా!

చట్టసభల ప్రతినిధులు మన మొలతాడుతో మనల్నే ఉరితీసే ఘనాపాఠీలు. ఆరుగాలం చమటోడ్చే రైతన్న ఫలసాయాన్ని మెక్కే ఈ బేరగాళ్లు వాళ్లకు ఆత్మహత్య బహూమతిని తరచూ ప్రదానం చేస్తుంటారు. కోట్లుంటేనేమి? కొట్టోడు పెట్టే కొసరు ఎంత బాగుంటదో! అంటూ చిన్న బెల్లం ముక్కను లొట్టలేసుకుంటూ తినేవాడు నా మిత్రుడొకడు. ఈ ఘనాపాఠీలు మామూలోళ్లు కాదు సుమా… వందల కోట్ల విలువయిన ఆస్తిపాస్తులున్న కుబేరులు – ఆపై ప్రపంచంలోనే అత్యధిక జీతాలు పుచ్చుకుంటున్న పెద్దమనుషులు. నాబోటోడి ఆదాయంతో పోలిస్తే (పోనీ సగటు భారతీయుడందాము) కనీసం 104 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నట్లు లెక్కలు విదితం చేస్తున్నాయి. అన్నట్లు ఇప్పుడు మళ్లీ 300 శాతం పెంచుకున్నారు. పెంచాల్సిన పనేలేదని వెర్రోళ్లు ఎర్రోళ్లు ఎదురు తిరిగితే ఈ పెద్ద మనుషులు అలిగి మంచమెక్కారు. వాళ్లేమన్నా విద్యుత్తు ధర పెంచొద్దంటూ బషీర్‌బాగ్‌లో నిరసన తెలిపే సామాన్యులా?- గుర్రాలతో తొక్కించి, గొట్టాలతో నీళ్లు చిమ్మించి, చివరకు తుపాకి తూటాలతో పొట్టనబెట్టుకోవటానికి. అందుకనే రాజా సింగ్‌ వెంటనే ఒప్పేసుకున్నారు మరి. ఎంపీ ఒక్కొక్కడు ఏడాదికి జీతభత్యాల రూపాన రూ. 57 లక్షలు అక్షరాలా యాభై ఏడు లక్షల రూపాయలు మేసేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జీతభత్యాల విషయంలో దేశంలోనే ఆదర్శంగా ఉన్న పశ్చిమబెంగాలు లెక్కల్ని చూద్దాం. ఆ రాష్ట్ర శాసనసభ్యులు అసోం కన్నా ఆరు రెట్లు తక్కువ జీతాలు తీసుకుంటున్నారు. అన్నీ కలుపుకుని ఆ రాష్ట్ర శాసనసభ్యులకు రూ. 12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. అది కూడా ఏడాది నుంచే అమలు చేస్తున్నారు. పెంచిన తర్వాత కూడా జార్ఘండ్‌ కన్నా నాలుగు రెట్లు తక్కువ జీతాన్ని బెంగాలు ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు. జీతభత్యాలు పెంచాలని ఆ రాష్ట్ర కాంగ్రెసు, తృణమూల్‌ శాసనసభ్యులు ఒత్తిడి చేయగా … ”సామాన్యుడికి సరైన జీవన ప్రమాణం సమకూరక సతమతమవుతుంటే, శాసనసభ్యులు తమ జీతాలు పెంచమనటం సక్రమమైన ఆలోచన కాదని శాసనసభాపతి హషీం నమ్రతగా కొట్టిపారేశారనుకోండి. ఈశాన్యంలో ఉన్న త్రిపుర కూడా శాసనసభ్యుల జీతభత్యాల విషయంలో ఆదర్శం పాటిస్తోందని లెక్కలు పట్టిచూపుతున్నాయి. ఆ రాష్ట్ర శాసనసభ్యుడి జీతం రూ. 12 వేలు కాగా, మంత్రుల జీతం రూ. 12300, ముఖ్యమంత్రి కేమో రూ. 12500. అందుకనే కదా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్యసర్కార్‌కు ఒక చొక్కా ఒంటి మీద ఉంటే మరొకటి తీగ మీద ఆరుతూ ఉంటుంది. ఇది ఎవరో చెప్పగా నేను చెబుతున్నది కాదు సుమా! నేను విజయవాడలో పని చేస్తున్న సమయంలో ఓసారి ఆయన అక్కడకు వచ్చారు. మేము వెళ్లే సరికి అతిథి గృహం ముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రక్షకభటులు కునుకు తీస్తుండగా, ఆయనేమో స్నానాల గదిలో చేరి తన రెండో చొక్కాను ఉతికిపారేస్త్తోన్న దృశ్యం మా కంటబడి కన్నీరుబికిందంటే నమ్మండి. గత తొమ్మిదేళ్లలో జార్ఘండ్‌ శాసనభ్యుల జీతాలు ఐదు దఫాలు పెరిగాయి. ఇప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ్యులు రూ. 49,333 పుచ్చేసుకుంటున్నారు. అదే అసోం చట్ట ప్రతినిధులకు రూ. 72034 గిడుతోంది. ఇన్నింటిని ప్రస్తావించుకున్న మనం ఘనత వహించిన మన శాసనసభ్యుల జీతాల రహస్యం మాట్లాడుకోవద్దూ! ఎంత లెండి మనోళ్లు రూ. 37 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. అదండీ సంగటి.
శ్రీశ్రీ ప్రశ్నిస్తారూ…

సందులలో, గొందులలో
పందులవలె
మనదీ ఒక బ్రతుకేనా?

నీకన్నా, నాకన్నా, మనందరికన్నా
వందరెట్లు అధిక జీతంబుచ్చుకుంటూ
మన వేళ్లతో మనల్నే పొడిచేవాడెవ్వడనిన
వాడి పేరు పార్లమెంటు సభ్యుడు కాదా తెలుగుబాల!

ప్రకటనలు

11 వ్యాఖ్యలు

 1. మంచి వ్యాసం. పాటూరు రామయ్య గారు నాలుగు సార్లు ఎమ్మెల్యెగా పనిచెసారు.నెను విజయవాడలొ ప్రతిసారీ ఆయనను గమనించెవాడిని.నాలుగొసారి ఎమ్మెల్యెగా పొటీచెసినప్పుడు ఆయన అఫిడవిట్లొ పెర్కొన్న మొత్తం ఆస్థి విలువ 32 వెలు మాత్రమె. పదవీ కాలం ముగిసాక ఆయన చెంబు..తపెలా..గ్లాసు..ట్రంకుపెట్టేతొ విజయవాద తిరిగి వచారు.అలాంటి నెతలున్న మనకు ఈ దుర్గతి పట్టింది. మంచి వ్యాసం అందించినందుకు క్రుతగ్నతలు

  స్పందించండి

 2. కమ్యునిజం అంటె ఇలా అదికారం సంపాదిన్సి చిట్టి పొట్టి సంస్కరణలు చెయ్యడమెనా? అలాంటి సంస్కరణలు బూర్జువా పార్టిలు కూడా చెస్తాయి కదా? మరి కమ్యునిజానికి బూర్జువాలకు తెడాఏముంది? కమ్యునిజానికి మతకగుడ్డలు కట్టుకొవడమూ, చిన్నచిన్న ఆదర్శాలెనా కమ్యునజానికి కొలమానం .25ఏళ్ళు ఒక నియంతలాగ పరిపాలించాడు ఏంచెసారు? మార్క్స్ చెప్పిన కమ్యునిజం యిదెనా? ఒక్క మాటలొచెప్పాలంటె ఇండియాలొ వున్న సి పి ఐ ,సి పి యం గొర్రెతొలు కప్పుకున్న తొడెళ్ళు .,ప్రజలు ఎప్పుడూ అమాయకంగా వుంటారనుకొకండి .ఒట్లకొసం మీ జిమ్మిక్కులు అర్దం చెసుకుంటారు.

  స్పందించండి

 3. Posted by gollanapalli gopi on ఆగస్ట్ 24, 2010 at 10:41 ఉద.

  raama mohan gaaroo…
  oehoe idupulapaayaloo.. brahmaNee..bayyaaram..ToTal andhralo konDalu.. guTTalu..cheruvulu…aDavulu..sez la pera kaajeasindee…jalayagnam mobilaijeashan adwaansula peara kameeshanlu koTTesina charitra kamyunisTulaku ekkadaa ledamDee. boaforsu kumbhakoNaaloo leavanDee. chekkara kumbhakoanaakoo meeku aadarsamanna maaTa. veree gud.

  స్పందించండి

 4. రామ మొహన్ గారూ…
  ఓహో ఇదుపులపాయలూ.. బ్రహ్మణీ..బయ్యారం..టొటల్ అంధ్రలొ కొండలు.. గుట్టలు..చెరువులు…అడవులు..సెజ్ ల పెర కాజేసిందీ…జలయగ్నం మొబిలైజేషన్ అద్వాన్సుల పేర కమీషన్లు కొట్టెసిన చరిత్ర కమ్యునిస్టులకు ఎక్కదా లెదండీ. బోఫొర్సు కుంభకొణాలూ లేవండీ. చెక్కర కుంభకోనాకూ మీకు ఆదర్సమన్న మాట. వెరీ గుద్.

  స్పందించండి

 5. గొపీ గరూ నెను కమ్యునిస్టు పార్టిలను విమర్శిస్తూన్నానంటె బూర్జువాపార్టిలను సమర్దిసిచినట్టా ? ఆపార్టీలూ ఈ పార్టీలూ మొత్తం అన్ని పార్టీలూ ప్రజలను అనగతొక్కుతున్నాయి అన్నీ దొపిడీవర్గ పార్టీలె అన్నిపార్టిల ద్యెయం అధికారమె మిగతా పార్టీలు కమ్యునిస్టులమని చెప్పుకొరు ఈపార్టీలు చెప్పుకుంటాయి దానివల్ల కమ్యునిజం అంటె భెంగాల్ లాగ అదికారంలొకిరావడమెనని ప్రజలకి చాలాస్వస్టంగా అర్దమైంది మీకు మార్స్కిజం తెలిసుంటె ఇలామాట్లాడరు .

  స్పందించండి

 6. “మన వేళ్లతో మనల్నే పొడిచేవాడెవ్వడనిన
  వాడి పేరు పార్లమెంటు సభ్యుడు కాదా తెలుగుబాల”…అని మీరన్నారు గంద సామీ ,

  అబ్బో ! వాడొక్క డే నేంది ?ఏమ్మేల్లెలు లేరా? గేమ పంచాయితీకెళ్ళి, మండలానికెళ్ళి,జిల్లా పరిషత్తు కెళ్ళి, అసెంబ్లీ కెళ్ళి అబ్బోబ్బోబ్బో ! అనబ్బలాం టో ళ్ళుఇంగా సాన మంది తగలడ లె దంటా వెందప్పా ? మన వేళ్ళే బెట్టి మన కళ్ళే పొడిసే టోళ్ళు …..

  మీరు ఎన్నుకుంటున్నచర్చనీయాంశం
  వ్యక్తీకరణ ,బాగుంటున్నాయి అభినందనలు . కీప్ ఇట్ అప్…..నూతక్కి

  స్పందించండి

  • ప్రోత్సహిస్తూ, సూచనలిస్తూ, మద్దతునిస్తూన్న పెద్దలు రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు.
   అదేవిధంగా నా తప్పులను సరిజేసుకునేందుకు ఉపకరిస్తోన్న విమర్శకులకు క్రుతగ్నతలు.

   స్పందించండి

 7. రామమోహన్ గారూ
  మార్క్సిజం మీకు బాగా తెలుసు. మార్క్సిజమే తెలిసినప్పుడు మీకు మిగతా ఇజాలు కూడా తెలిసి ఉంటాయి. అన్నీ ఇజాలూ మీకు చీ..చీయే. మీ సరికొత్త ఇజమేదో తెలపండి. నచ్చితే స్వీకరిస్తాము. అదికూడా లేకుంటే చెప్పండి. పరవాలే.

  స్పందించండి

 8. నాకు తెలిసింది మార్స్కిజమె దాన్నె నెను ఆచరిచమంటున్నాను ఇలాగ ముసుగు వెసుకొని కాదు ..మళ్ళి చెప్పుతున్నాను సి పి ఐ గాని సి పి యం గాని ముసుగు వెసుకున్న క్రురమ్రుగాలు

  స్పందించండి

 9. మార్క్సిజం ముసుగులొ పాలక పక్షాలకు ఉపయోగపడే భావజాల వ్యాప్తి వల్ల ఉపయోగం లేదు. మీద్రుష్టిలొ సీపిఎం….సిపీఐ క్రూర మ్రుగాలు.. పాలకవర్గాలు సాధు కూనలు.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: