కులాల కుంపట్లు రేపే పనికి టీవీ9 పూనుకుంది.
‘కులం సంకెళ్లను తెంచేద్దాం’ అంటూ నిమిషానికోసారి నినాదాన్ని చూపించే టీవీ9 బుధవారంనాడు తనకు తానే కులం సంకెళ్లను తగిలించుకోవటం ఎగతాళిమారిపని. హైదరాబాదుకు చెందిన విష్ణుప్రియను ఆమె మామే లైంగిక వేధింపులకు గురిచేయటం బయటపడటంతో టీవీ9 స్పందించటం ప్రస్తుతించదగినదే. విష్ణుప్రియకు ప్రజల అండదండల్ని సమకూర్చే పనిని టీవీ9 చేపట్టింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ప్రజలందరి మద్దతునూ ఆమెకు సమకూర్చిపెట్టే పనికి టీవీ9 గండికొట్టిందని ఆరోపించక తప్పదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భద్రి అతివాగుడు వలన విష్ణుప్రియకు నష్టం జరిగుంటుందన్న ఆందోళన తెలుగిల్లును వెంటాడింది. విష్ణుప్రియ సామాజిక వర్గానికి చెందిన ఓ పెద్దమనిషి టీవీ9కు ఫోను చేసి తాను ఆమెకు అండగా ఉంటానని చెబుతుండగానే, భద్రి ఆవేశపడిపోయారు. మీ కులానికే చెందిన విష్ణుప్రియకు మీరంతా మద్దతుగా నిలవాలిగదా? అంటూ అనవసరమయిన వాగుడు వాగారు భద్రి. ఆ పెద్దాయన విష్ణుప్రియను తప్పుపట్టి మాట్లాడితే అప్పుడు భద్రి ఆవేశపడితే అర్ధం ఉంటుందేమో?
ఆయన ఒకపక్కన తాను, తన మిత్రులు విష్ణుప్రియకు అన్ని విధాలా అండగా ఉంటామని, భయపడవద్దనీ చెబుతున్నా … భద్రి అడ్డం పడటం ఎందుకో? అర్ధం కాలేదు. మన బిడ్డలాంటి బిడ్డ విష్ణుప్రియ పడరాని పాట్లు పడుతోంది, మనమంతా మనుషులంగా మద్దతు ఇద్దామని నచ్చచెప్పాలి. అంతేగానీ మీ కులం కాబట్టి మద్దతు ఇవ్వాలని కోరటం తెలిసి చేసినా, తెలియక చేసినా విష్ణుప్రియ మామకు పరోక్షంగా ఉపకరిస్తుందేమో? ఫలానా కులస్తులారా! మీ కులానికి చెందిన విష్ణుప్రియ బాధల్లో ఉంది. ఆమె కులానికి చెందినవాళ్లంతా మద్దతు ఇవ్వాలని కోరితే ఏమవుతుందో? మాజీ కమ్యూనిస్టు? రవిప్రకాష్ కార్యనిర్వాహకుడిగా నడుస్తోన్న టీవీ9కు చెప్పాల్సిన పని ఉందనుకోను. ఒక కులం వాళ్ల మద్దతు కోరితే ఈ దేశంలో ఇతర కులాల వాళ్లంతా … ”ఓహో ఇది మనకు సంబంధమే లేని వ్యవహారం” అనుకునే ప్రమాదం లేదా? అయినదానికీ, కానిదానికీ నిత్యం కులాల కుంపటి రగిలే ప్రాంతంలో ఇలాంటి పిలుపులు విశాల మద్దతుకు గండికొడతాయన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? కులాల కుంపట్లు మంచిది కాదనేగదా? మీరు రోజంతా చూపుతోంది. మరి ఆ కంపునే మీరు ఎందుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం . విష్ణుప్రియకు మంచి ఆశించేనా? పరోక్షంగా విష్ణుప్రియ మామను రక్షించాలనుకున్నారా? ఏమయినా ప్రత్యేకించి ఇలాంటి విషయాల్లో మనం మద్దతు తెలపాల్సిన వాళ్లకు కులం తోకలు ఉంటే వాటికి కత్తెరేసి మాట్లాడితే వాళ్లకు మేలు జరుగుతుంది. విశాల ప్రాతిపదికన, మానవత్వం ప్రాతిపదికన మద్దతు సమీకరించవచ్చు. సరే, తెలిసో – తెలియకో జరగరానిది జరిగిపోయింది. ఇక ముందయినా ఇలాంటి తప్పిదాలు జరక్కుండా ఉంటే మంచిది కదా!
26 ఆగ
Posted by m bindumadhavi on ఆగస్ట్ 26, 2010 at 9:51 ఉద.
మత ప్రస్తావన ఉండకూడని లౌకిక రాజ్యం మనది.
కులాల గురించి మాట్లాడకూడదని పదే పదే మాట్లాడే నాగరికులం మనం.
కానీ సామాజికం గా ఏ సంఘటన జరిగినా కులపు కోణాలు, మాతం మూలాలు వెతకటానికి బాగా అలవాటు పడ్డాం అని చెప్పటానికి ఎంత మాత్రం సందేహించక్కర లేదు.
మనిషి తప్పు చెయ్యటానికి కానీ చెయ్యకుండా ఉండటానికి కానీ కుటుంబ నేపధ్యం, విలువల తో పాటు మానసిక స్థితి ముఖ్యం. మనం అవి వదిలేసి, సమస్యని ఎలా తప్పు దొవ పట్టించాలో కుహన రాజకీయ వాదుల నించి బాగా నేర్చుకుంటున్నాము.
“పదుగురాడు మాట పాడియై ధర చెల్లు” అన్నట్లు,వార్తా పత్రికల్లో, మీడియా లో ఒక సమస్య ని చర్చించేటప్పుడు ఏ విధానం పాటిస్తున్నారో, ఆ విధమే పాటించటం నేర్చుకుని మనని మనము దిగజార్చుకోవటానికి వెనకాడటం లేదు.
ఒక సగటు మనిషి కూడా స్వవిలువలూ (అవి అంటూ ఉంటే), మానవత్వమూ మర్చిపోయి, ఏదో తామూ కూడా ఆ విషయానికి వెంటనే స్పందించామని చాటుకోవటమే లక్ష్యం గా ప్రవర్తిస్తున్నారే కానీ చిత్తశుద్ధి ని వదిలేస్తున్నారు.
అంతా పటాటోప మయం గా ప్రపంచం మారిపోయింది.
మనము ఎంత సంకుచితం గా అలోచించగలమంటే, ఒకప్పుడు క్రికెట్ ఆటగాడు “అజారుద్దీన్” మ్యాచ్ ఫిక్సింగ్ కేస్ లో నిందించభడినప్పుడు అసలు విషయం వదిలేసి, గౌరవనీయమైన మన రాజకీయ నాయకులు కొందరు, అతను ముస్లిం కాబట్టి అతన్ని అన్యాయం గా ఇందులో ఇరికించారు అంటూ అక్కర లేని వకాల్తా పుచ్చుకుని విషయాన్ని నీరు కార్చే ప్రయత్నం చేశారు. అతను నిందితుడు అని వక్కాణించటం కాదు నా ఉద్దేశ్యం, కానీ అనవసర ప్రస్తావనలు చేసి, విషయాన్ని తప్పు దోవ పట్టించటం ఎంత వరకు సబబు అనేదే నేను చెప్పదల్చుకున్నది
మనం మనుషులు గా ఎప్పుటికి మారగలమో?
Posted by కె.మహేష్ కుమార్ on ఆగస్ట్ 26, 2010 at 10:42 ఉద.
🙂 🙂
Posted by saamaanyudu on ఆగస్ట్ 26, 2010 at 12:25 సా.
pade pade kulam chilumnu vadiliddamani chooputunnaarante daani patla vaarike ekkuva makkuvani artham kaabolu. ee madhya veellaki erpadda congress high command praapakam baagaa antukundi. jagan vyatireka kathanaalu koodaa ilaage prachaaram chestunnaaru. meediyaa koodaa saruke ayina kaalamidi. anduke ee madhya rajaneekaanth ku best anchor award ichchinatlundi. kullutu koolutunna naalugo stambham..
Posted by rama krishna on ఆగస్ట్ 26, 2010 at 12:34 సా.
మీరెంత ఆలొచనాపరులో…రచనా ప్రియులో…చైతన్య ప్రేరకులో…
Posted by Rayaprolu mallikarjua sharma on ఆగస్ట్ 26, 2010 at 2:18 సా.
super comments on tv9 and bhadri
thnQ
Posted by pramida on ఆగస్ట్ 26, 2010 at 4:03 సా.
baagaa chepparu….
Posted by gajula on ఆగస్ట్ 26, 2010 at 8:36 సా.
vishnupriya all the best.