సరిగ్గా వైఎస్‌ హెలికాప్టర్ కూలిన సమయంలోనే …

2009 సెప్టెంబరు 2 ఉదయం 6 గంటలు :

హైదరాబాదు నుంచి డాక్టర్‌ బి. మధుసూదనరావుతో కలిసి ఒంగోలులో దిగాను. జన్మభూమిలో కాలిడినవేళ ఆనందమానందమాయె.

ఉదయం 8 గంటలు :

ఒంగోలు నుంచి కనిగిరికి వెళ్లేందుకు మిత్రులు మారెళ్ల సుబ్బారావు, టిబిఎస్‌ రాజు తదితరులతో కలిసి కారులో బయలుదేరాము.

ఉదయం 9.30 :

పొదిలి సమీపంలో ప్రయాణిస్తుండగా దూరంగా కనిపించిన కొండ
పాత జ్ఞాపకాల అలలను తట్టి లేపింది  పొదిలమ్మ కొండను పూర్వం పృథ్వి పర్వతమని  పిలిచేవారిని మిత్రులకు చెప్పాను. పొదిలిని ఆ కొండ పేరిటే పృథ్విపురం అని పిలిచేవారని గుర్తుచేసుకున్నాము. అలా అలా ప్రకాశం జిల్లాలో గతంలో  విమానాలు, హెలికాప్టర్ల కూలిపోయిన చరిత్రలను తడిమాను. సంబంధిత ఘటనల సమయంలో పాత్రికేయుడిగా నా అనుభవాలను మిత్రులకు కథలుగా విన్పించాను. అలా మాట్లాడుకుంటూ కనిగిరికి చేరి మా పనిలో మునిగిపోయాము.

మధ్యాహ్నం 1.30 గంటలు

భోజనం చేసేందుకని మిత్రులమంతా కలిసి మా మేనల్లుడు, స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కరణం చెంచుబాబు ఇంటికి వెళ్లాము. మేము వెళ్లేసరికి మా మేనల్లుడి కుటుంబం అంతా టీవీ ముందు చేరి ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రయాణస్తున్న హెలీకాప్టర్‌ జాడ తెలియకుండా పోయిందన్న వార్త విని మేమంతా నిశ్ఛేష్టులమయ్యాము. ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధి నల్లమల అడవుల్లో హెలీకాప్టర్‌ తప్పిపోయి ఉంటుందని ఊహిస్తున్నట్లు అన్ని టీవీల్లోనూ సమీక్షల్ని చూసి ఆ రోజు ఉదయం మేము పొదిలికి సమీపంలో కూలిపోయిన విమానాల విషయాన్ని మాట్లాడుకోవటాన్ని గుర్తుచేసుకున్నాము. మేము కూలిపోయిన విమానాల చరిత్రను మాట్లాడుకున్న అదే సమయంలోనే వైఎస్‌ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్‌ కర్నూలు జిల్లాలో కూలిపోయిన వైనం మరుసటి రోజున వెల్లడయింది.

ప్రకటనలు

One response to this post.

 1. మనలాంటి పిచ్చివాళ్ళు ఉన్నంతకాలం ఆ కాంగ్రెస్ కుహానా రాజకీయాలు మారవు…
  నెహ్రూ కుటుంభమే గొప్పదంటూ మన మనసుల్లోకి జొప్పించి
  ఇక వేరే ఎవరూ పేరు తెచ్చుకోకుండా చేస్తున్న ఆ నకలు”గాంధీ” వంశీయుల మాటలు మనం ఎందుకు నమ్మాలి..
  ఒక పీవీ, ఒకNTR , ఒక YSR మనవారు కాదా..

  వాళ్ళ మీద బురద చల్లే పని చేయొద్దని నా మనవి..
  అర్ధం చేసుకోండి..

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: