మన చందమామ … మన మరణశాసనం – ఓ డజను పీహెచ్‌డీలు

  • పీ … హెచ్‌ … డీ – 1

ప్రపంచీకరణ – అదో అద్భుతమని పాలకవర్గాలు, మీడియా ప్రస్తుతిస్తో మనకు వాస్తవాలు తెలియనీయకుండా కళ్లకు గంతలు కడుతున్నాయి. అయితే వాస్తవానికి అది మహా మహమ్మారి. అది మనదన్న దేన్నీ బతకనీయదు.
అది కాలు పెట్టినచోట ఎక్కడ బతికనిచ్చింది కాబట్టి?
ఇక్కడా అంతే. మనదన్నదాన్ని దేన్నీ బతకనీయదు.
బతకనిస్తే అది బతకదు. అందుకని మనదన్నదాన్ని దేన్నీ బతకనీయదు.
మన ‘చందమామ’నూ బతకనీయదు.

చందమామ (పిల్లల మాస పత్రిక) పుట్టుక – పెరుగుదల – ఎదుగుదల – సామాజిక – సాహిత్య, స్థానిక భాషల, మానసికాభివృద్ధికి, రచయితల పుట్టుకకు చేసిన కృషి – కార్పొరేట్‌ విలీనం – మరణశాసనం … ఇత్యాది విషయాలను ఒకింత నిబద్ధతతో పరికిస్తే మనల్ని మనం తడిమి చూసుకోవటమే. ప్రత్యేకించి తెలుగు సమాజ ఉత్థాన  పతనాలకు ఈ వ్యవహారాలు పట్టిచూపుతాయి.
మనబోంట్లకు సంబంధం లేనిదే … అయినా
పార్లేని చంపేయలేదూ!
పార్లే ఉత్పత్తి గోల్డ్‌స్పాట్‌ని నిలువునా పాతేయలేదూ!!


ఇక మిగులున్న లింకా, థమ్స్‌అప్‌ గట్రా, గట్రాలను కూడా రేపో, మాపో నిట్ట నిలువునా పాతరేయకపోతే అప్పుడడగండి నన్ను.
రాజీవుడి జీవితాన్ని వాళ్లమ్మ ఇందిరమ్మ దేశానికి అంకితం చేసిన వేళా విశేషం వెనుక ప్రపంచ పెద్ద పోలీసు అమెరికా హస్తం లేదంటే నేను నమ్మనుగాక నమ్మను. ఇందిరమ్మ దేశానికి అంకితం చేసిన రాజీవుడు గద్దెనెక్కి మనందరి కొంపలు కూల్చేందుకు ప్రపంచానికి పెద్ద పెద్ద ద్వారాలు తెరిచాడు. ఆ పెద్ద ద్వారాల వద్దే ఎప్పటి నుంచో కాచుకు కూర్చున్న కోకోకోల, పెప్సీకోల కంపెనీలు దేశంలోకి జరబడే నాటికి దేశవాళీ శీతలపానీయాలు గోల్డ్‌స్పాట్‌, థమ్స్‌అప్‌, లింకాకు వినియోగదారుల ఆదరణ 50 శాతం పైగానే ఉంది. అలాంటి నేపథ్యంలో అమెరికా కోలాలు భారతదేశంలో బతికి బట్టకట్టాలంటే ఉన్న ఒకే ఒక మార్గం పార్లేను కొని అనంతరం దాన్ని నిలువునా పాతరేయటం.

రమేష్‌ సోదరుల నుంచి దానిని 1993లో రూ. 240 కోట్లకు  కోకోకోలా కొనుగోలు చేసింది. అప్పటి నుంచే పార్లే రంగు నీళ్లను నెమ్మదిగా వదిలించుకునే పనిని కోకోకోలా నిత్యకృత్యంగా సాగిస్తోంది. కోలా ఆశలు నెరవేరుతున్నాయి. ఒక్క కోకోకోలా యాజమాన్యమే ఏటా ఎనిమిది వేల కోట్ల రూపాయలను అమెరికాకు తరలించుకుపోతోంది. అంటే పార్లే కొనుగోలుకు వెచ్చించిన నిధులు మొదటి మాసం రోజుల్లోనే కోకోకోలా సొంతం చేసుకుంది. దీనికితోడు స్థానిక పోటీ లేకండా చేసుకుంది. తన 28 శాతం వాటా నుంచి ఇప్పుడు 50 శాతం నుంచి 60 శాతం దాకా మార్కెట్లును సొంతం చేసుకుంది. ఏటా ఏడెనిమిది శాతం ఎదుగుతోన్న శీతలపానీయాల మార్కెట్టును పూర్తిగా కబళించేందుకు కోకోకోలా ఎత్తులు వేస్తోంది. పాలకుల తీరు, ప్రజల ఓపిక ఇదే తీరున కొనసాగితే కోలా ఆశలు తీరే రోజు ఎంతో దూరం ఉండబోదు. అదే తీరున మన చందమామకూ మరణశాసన రాయబోతోంది ప్రపంచీకరణ. చందమామకు మరణశాసనం రాయటం అంటే అది పార్లే శీతలపానీయాలకు పాతరేయటంలాంటిది కాదు. అది స్థానిక భాషలమీద వేటు. అది దేశీయ – స్థానిక వేషాల మీద వేటు, అది భావాలమీద వేటు, స్వేచ్చమీద వేటు. అది సంస్కృతికి కీడు. అది చరిత్రపై వేటు, అది మన భవితవ్యానికి చావుగీతిక, శాశ్వత మరణ శాసనం.
పీ … హెచ్‌ … డీ – 2 … వెనువెంటనే

ప్రకటనలు

4 వ్యాఖ్యలు

  1. sir..its simply super post.pl try to write this kind of posts frequently.due to some soft ware problem ur cell no was erased from my cell.so pl kindly give it r msg to this no sir-jayadev./09884675329..

    స్పందించండి

  2. Posted by Hemanth on మే 2, 2011 at 3:20 ఉద.

    alochimpajesela undi.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: