ఎవరి వ్యక్తిగత బతుకులు వారిష్టం! బజార్లో నిలబడితే అక్కినేనినయినా అంటాం!!

ఎవరి వ్యక్తిగత బతుకులు వారిష్టం!
బజార్లో నిలబడితే అక్కినేనినయినా అంటాం!!

అంటే బజార్లో నిలబడిన ప్రతివాడినీ అనికాదులెండి. బజార్లో నిలబడి నోటికొచ్చిన కూతలు కూసేవారిని అని అర్ధం చేసుకుందురూ.
ఇంతకూ ఇప్పుడు అక్కినేని నోటికొచ్చిన కూతలు ఏమి కూశాడంటారా? చెబుతాను, చెబుతాను.
అన్నట్లు అ…ఆ ల పెద్దమనిషి అక్కినేని నాగేశ్వరరావు జోలికి వెళ్లటం పెద్ద సాహసమేననిపిస్తోంది. కొంత భయం కూడా ఉందనుకోండి. అయినా దిగాక చలి చలి అని గుంజుకునేవాడిని కాదులెండి.
సాయం చేయటం ఏమోగానీ హాని చేయనివాడు,
ఆచితూచి మాట్లాడేవాడు,
మాటల్లో హేతుబద్ధత చూపేవాడు,
స్వయంకృషితో ఎదిగినవాడు, ‘అ..ఆ’ పేరిట అక్కినేని ఆలోచనలను అందరికీ పంచినవాడు…
కొన్నాళ్లపాటు మంచి సినిమాలు తెలుగోళ్లకు చూపినవాడు, మంచి నటన ప్రదర్శించినవాడయిన అక్కినేనిలో నాకెక్కడో కూసింత స్వార్ధం కన్పిస్తుంటుంది. ఆ మాటంటున్నానంటే స్వార్ధం లేనివాడెవ్వడని పలువురు నామీదకు దూకే ప్రమాదం ఉంది. అందుకని మరికొంత వివరిస్తాను. మనం చేసింది, మనం వాగింది … ఎదుటివాడు తప్పన్నప్పుడు, ఒకపరి తడిమి చూసుకుని కాదని కచ్చితంగా తేలితే సరే. కాకుంటే బహిరంగంగా ఒప్పుకోకపోతేమానే, కనీసం అలాంటి విషయాల్లో మౌనం వహిస్తే మంచిదని నా భావన.
కానీ అక్కినేని ఆ జ్ఞానాన్ని ప్రదర్శించకపోవటం కనీసం ఆయన కుమారుడి శివ విడుదలయిన కాలం నుంచీ గమనిస్తున్నాను. అంతకు ముందు సంగతి నాకు తెలియదు.
అసలే మనది రెండు రెళ్లు నాలుగన్నందుకు గూండాలు గుండ్రాళ్లు విసిరే సీమ. అలాంటి సీమలో, అలాంటి వాతావరణంలో సైకిలు చైన్లను పరిచయం చేసిన ఘనత శివ సినిమాది. కనీసం ఇంట్లో పెద్దవాళ్లకో, సమాజానికో భయపడి హింసకు దూరంగా మసిలే కుర్రోళ్లను కూడా సైకిలు చైను పడితే బాగుండునని బాధించిన సినిమా అది. పట్టించిన సినిమా అది. అహింసతో ఏమీ కాదని, హింస, ధ్వంసరచనే మార్గమని నేర్పించిన సినిమా అది. అలాంటి సినీరాజాన్ని కొడుకు మీద ప్రేమతో అక్కినేనిలాంటి పెద్దమనిషి, నాగేశ్వరరావులాంటి వేలాది మంది విసనకర్రల్ని కలిగినవాడు పొగిడితే ఇంకేమన్నా ఉందా? ఔనని సమాజం తలూపే ప్రమాదం లేదూ?! గుడ్డిగా అనుసరించే ప్రమాదం లేదూ?!
పైగా తరచూ ఆయనో రహస్యం చెబుతుంటాడు. పరిమితంగా మద్యం సేవిస్తే అది ఆరోగ్యమట. దాన్లో నిజానిజాలమాట దేవుడెరుగు, పరిమితంగా తాగటం అసలు సాధ్యమేనా? (అక్కినేని లాంటి ఒకరిద్దరి విషయం కాదు.) తొలుత మద్యాన్ని మనిషి తాగితే, ఆ తర్వాతే మద్యమే వాడ్ని తాగుతుందన్న విషయం అక్కినేనికి తెలియదా? మద్యం స్వభావమే అది. అమృతం పేరిట దేవతలే (సురులు) (సురులు = సురాపానము చేయువారు, సుర = సారాయి) ఎన్నెన్ని మోసాలకు పాల్పడ్డారో పురాణాల్లో విన్నదే. అందువలన అక్కినేని లాంటి పెద్దమనిషి తాగంగాలేంది, పైగా తాగటం తప్పేకాదని చెప్పంగా లేంది మనమూ తాగేద్దామనుకుని తాగించేసిన పాపం అక్కినేనికి ఉంది. అంతెందుకు ఆయన కుమారుడు నాగార్జున, తాను చాటుమాటుగా మందు సీసాలను దుర్గం చెరువుకు ఎత్తుకు పోయి తాగొచ్చానని తరచూ చెప్పటం వినలేదూ?! ఈ తండ్రీకొడుకులు తాగితే తాగారు. నాది, నీది తాగలేదు కాబట్టి వదిలేద్దాం. అయితే మేము తాగుతాం, అది తప్పేమీ కాదు, పైగా ఆరోగ్యం కూడానూ అని చెప్పే హక్కు వీళ్లకెవరిచ్చారన్నదే తెలుగిల్లు ప్రశ్న. వీళ్లేమన్నా ఆహార నిపుణులా? లేదా వైద్య నిపుణులా? ‘దాదా’సాహెబ్‌పాల్కే పురస్కార గ్రహీతగారూ, గ్రహించారా? మా విన్నపం.
పైగా అక్కినేని ఇప్పుడంటారూ, సినిమాలను విమర్శించొద్దని.

అక్కినేని 87వ జన్మదినోత్సవం సందర్భంగా 28 సెప్టెంబరు 2010న తెలుగు విశ్వవిద్యాలయంలో శృతిలయ ఆర్స్ట్‌ అకాడమి నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని ఇలా వివాదస్పదంగా హెచ్చరిక చేశారు. ఆయన ఇంకా ఏమంటారంటే…”ప్రస్తుత సమాజంలో అన్ని రంగాలూ వ్యాపారంగా మారిపోయాయి. (అందరూ దొంగలే, నేనూ దొంగనే అని సమర్థించుకున్నట్లుగా) మరెందుకోగానీ కొందరు సినిమా రంగాన్ని విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? (కచ్చితంగా సమంజసమే. సినిమాయే సమాజం … సమాజమే సినిమా అన్నట్లుగా ఉన్న నేపథ్యంలో దానిని ప్రత్యేకంగా పరిగణించకపోతే ఎలా? తొలిరోజు తొలిఆట టిక్కెట్ల కోసం ప్రాణాలను సైతం లెక్కపెట్టని యువతరం ఎదిగి, నానాటికీ విస్తరిస్తోందని మీకు తెలియంది కాదుగా?!) పైగా సినిమాని సినిమాగా చూడాలట. మీరూ సినిమాని సినిమాగా తీస్తే అది కుదురుతుందేమో? అక్కినేని సార్‌. సినిమాలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలట. సినిమాల్లో మాధుర్యం ఉందా? ఉంటే, గింటే నటుల ఖాతాలకు చేరే కోట్లలో ఉందేమో? ప్రేక్షకుడికి మిగిలింది జుట్టుపీక్కోవటమే. అంతేగానీ, కళనూ, కళాకారుల్నీ విమర్శించొద్దట! గుడ్డలిప్పుకుని మీరు ఆడే తైతక్కలు ఒక కళ. మీ ముఖం కాదు, మీ మాట కాదు – మీకు మా భాష రాదు, మా భావాలు తెలియవు, మా సంస్కృతి తెలియదు, మా సంప్రదాయం అసలే తెలియదు, మా అలవాట్లు తెలియవు, మీ గొంతు కాదు, మీ పాట కాదు – మీ గళం కాదు, ఎగిరేది మీరు కాదు, చివర్లో శత్రువుని తన్నేది, తొలుత వాడితో తన్నించుకునేది మీరు కాదు … అయినా మిమ్మల్ని (మిమ్మల్ని అంటే అక్కినేని కాదు- ఈనాటి నటనాగ్రేసరులనూ, గ్రేసరమ్మలనూ) కళాకారులుగా మేము చూడాలంటారా? ఆనందించాలంటారా? అసలెట్లా కనపడుతున్నాం, మీకళ్లకు? గొర్రెల్లాగానా? బర్రెల్లాగానా?  అసలు బుర్రలేనోళ్లలాగానా? మట్టితో నిండిన బుర్రలు కలిగినోళ్లలాగానా?

ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను చెప్పండి…
ఇదిగో ఒకటో ప్రశ్న :
మీ కుమారుడు నాగార్జునకు 2008లో హఠాత్తుగా వైఎస్‌ పాలనపై ప్రేమ పుట్టుటకు కారణం ఏమిటి? దాని వెనుక ఏ మతలబూ లేనేలేదంటారా?
రెండో ప్రశ్న, పలు అనుబంధ ప్రశ్నలూను :
మీ కుమారుడు నాగార్జునకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర తెలుసా?
తెలిస్తే భూమి ఎవరి చేతుల్లో ఉండాలని ఆ వీరులు తేల్చిచెప్పారు?
మీ కుమారుడికి ఎంత భూమి ఉంది?
ఆ పోరాటంలో ఒకడని మీరు చెబుతోన్న రాజయ్య ఆశయాలకూ నాగార్జున ఆశయాలకూ ఎక్కడన్నా పొంతన ఉందని మీరు అనుకుంటున్నారా?
అసలు టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావుకూ సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటానికీ సంబంధం ఏముందని రాజన్న సినిమా విషయంలో నాగార్జున ఆయనని సంప్రదించాడు. దాని వెనుక ఏ మతలబూ దాగిలేదా?
అక్కినేనీ,  దీనిపై నోరు విప్పండి. అంతేగానీ అయినదానికీ, కానిదానికీ నోరు పారేసుకోకండి. తిరిగి తీసుకోలేనిది నరం లేని నాలుక విసిరే మాటలేనని మీ అ..ఆ..లో ఏదో ఒక రూపాన రాసి ఉంటారులే.

23 వ్యాఖ్యలు

 1. beautiful. mee saili adbhutam.

  స్పందించండి

 2. భోంగిర్ యాద్గిర్ గారూ,
  బూతుల పంచాంగంతో కూడిన మీ ఆశీర్వచనాలు అందుకున్నాను అందరి ముందూ ప్రదర్శించి మిమ్మలిని చిన్నబుచ్చటం ఇష్టంలేక వ్యాక్యలను దాచిపెట్టాను.

  స్పందించండి

 3. Excellent post. You are rare genius one in 10thousands. Let us drive Akkineni out of Telagana and throw stones at him.

  Jai Telangaana.

  స్పందించండి

 4. ఏమోమరి, పైన మీరు ఉదహరించిన అక్కినేని మాటల్లో అంత ఎండగట్టాల్సిందేమి నాకు కనిపించలేదు. అలాగని నేను అక్కినేనికిగానీ వారి నటవారసులకి గానీ పంకాని కాదు.

  స్పందించండి

 5. అక్కినేని తెలగానకు ఏం చేసిండు? మా యాసలో సినిమా చేసిండా? మరి గదే, కవితమ్మ వసూల్ వేరే, మనది వేరే. మళ్ళీ ఇయ్యాల్సిందే.

  స్పందించండి

 6. It looks like that you are targeting non-Telangana people one after another. Who is next?

  స్పందించండి

  • సాగర్ గారూ,
   మీరు తప్పుగా అర్ఢం చేసుకున్నట్లున్నారు. నేను సమైక్యవాదిని. పైగా ప్రకాశం వాసిని. తప్పు- ఒప్పుని బట్టి రాయటం తప్ప కులం, మతం, ప్రాంతాన్నిబట్టి వ్యవహరించనుకాక వ్యవహరించను.

   కేసీఆర్ పేరిట ఒక వ్యాఖ్యాతను హెచ్చరిస్తూ వచ్చిన వ్యాఖ్యానాన్ని కూడా తొలగించాను.

   స్పందించండి

 7. Koduku tingaritanaaniki tadrni….adi innallanunchi andarki manchi chestarne perunna ANR ni inni matalanadam samanjasam kaadu 🙂

  స్పందించండి

 8. సరిగ్గానే అన్నారు. ఆయన తాగేది పరిమితంగా విదేశాలనుండి దిగుమతి చేసుకొన్న రెడ్ వైన్. అది రోజుకో చిన్న గలాసు తాగితే మంచిది ముఖ్యం గా గుండె జబ్బుల వాళ్లకు అంటారు. కాకపోతే ఆయన చెప్పేది మందు తాగటం పరిమితం గానే మంచిది అనేది.
  రెడ్ వైన్ అదీ మంచి క్వాలిటీ ది ఎక్కడయినా మామూలు సారా కొట్టులలో/బ్రాందీ షాపులలో దొరుకుతుందా లేదా? దొరికినా పరిమితం గా తాగే అంత కంట్రొల్ వీళ్లను మెచ్చి ఆరాధించే సామాన్య జనతాకు ఉందా అన్న బుఱ్ఱ మాత్రం “అ ఆ ” ల ఆయనకు లేదు అన్నది మాత్రం నిజం.

  ఇక నాగార్జున KCR దగ్గర తెలంగాణా వీరచరిత గురించి పాఠాలకు వెళ్లటం మాత్రం మిలీనియం జోకు :))

  ఆ దొర గారు ఆయన కుటుంబం ఇప్పటికీ నిజాం ఆయన పెంచి పోషించిన దొరల సంస్కృతికి జిందాబాద్ అంటూ ఉంటే, ఆయన దగ్గర నేర్చుకొనేది ఏముంటుంది, కెవలం నా ఆస్తుల జోలికి రావద్దనో, లేక దందా ల గురించి రేటు ఫిక్సింగ్ కోసమో వెళ్లి ఉంటాడు :(( తండ్రికి తగ్గ కొడుకే కదా మరి :))

  స్పందించండి

 9. Posted by ఓబుల్ రెడ్డి on సెప్టెంబర్ 29, 2010 at 6:49 సా.

  రామాయణంలో పిడకల వేటలా ఈ అసందర్భపు తెలంగాణ లొల్లి ఏంది ఈ వ్యాఖ్యల్లో ? ఇక్కడ విషయం అది కాదు. అక్కినేనిలాంటివాళ్ళు ఇంత వయసొచ్చీ తమ బలహీనతలను స్వార్థ కుటుంబ ప్రయోజనాలను సమర్థించుకోవడం కోసం బహిరంగంగా ఎలాంటి కూతలు కూస్తున్నారన్నదే ఇక్కడ అసలు విషయం. అక్కినేని తన స్వస్థలమైన గుడివాడలో ఒక కళాశాల స్థాపన కోసం ఆ రోజుల్లో పదిలక్షల రూపాయలు విరాళమివ్వడం తప్ప సమాజానికి చేసిందేమీ లేదు. పైగా పిల్లికి బిచ్చం పెట్టని, కాకుల్ని ఎంగిలిచేత్తోనైనా తోలని పరమ పిసినిగొట్టు అని పేరుమోశాడు. ఒక వీరాభిమాని తన సినిమా కెరియర్ గురించి వ్రాసిన ఒక బృహత్ గ్రంథాన్ని చదివి చూస్తానని తీసుకొని ఇక మళ్ళీ ఇవ్వకుండా దాచేసుకున్నాడట.

  స్పందించండి

  • సారూ ,
   నిజంగా మీకు కొటి దండాలు పెట్టాల. నన్ను నన్నుగా సూటిగా అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు మిత్రమా

   స్పందించండి

  • Swardha kutumba prayojanaala…??visadeekaristara??
   telisi matladutunnara asalu ?? Koothala avi….okaru tana bhavalanu cheppadam koothala…

   narikiestam ….raktham paristam ani mana rajakeeya ganam chesvi koothalu….

   “cinima vallandaru -Daana darmaalu- chese prabhuvuliga undalni enduku korukuntaaro nakardam kaadu”

   ANR garu danam chese prati sari mediani pilichi hadavudi chestegani nammarannamata….chala mandi ala cheyyake ‘pisinari’ ani meechetha tag tagilinchukuntunnaru…..

   ika ee “ata” ani cheppinavi nammadam maanandi…

   స్పందించండి

 10. Kottapali garu annatlu….ANR anna vishayalni anthaga pattinchukovkkarledu…..
  Peeru botaddamlo choostunnaranipistundi…..

  Cinemani- cinemalagane choodali….
  Siva cinemalo kuda ye paristitullo chain pattukunnado gamaninchaali tappa….youth andarini chainlu pattukoni tiragamanaledu……okavela vallu ala tirigithe adi valla parents pempakam meeda maccha…(endukante meeeru nenu mana frds eppudu chains pattaledu kaaduuu),,,

  vallaki oka life undi…vallu tagutaaru ,,,,
  ANR open ga cheppadu…cheppakunda chesetollu chaslamande unnaru.ayina aayana taagi ye heroin ni kottalede…apudu manakenduku antha noppi….

  malli chebutunnanu….
  cinemani cinema lagane choodali,,,,
  Vallu guddalippuku ade cinemalaki meeru vellakandi…padimandiki velladdani cheppandi….
  manchi movies ki mouth publicity ivvandi….

  Ultimate gaa…
  cinemalu chettala raavadaaniki kaaranam choose janam…
  teese janam kaadu….

  స్పందించండి

 11. Posted by ఓబుల్ రెడ్డి on సెప్టెంబర్ 30, 2010 at 5:15 ఉద.

  ఏయెన్నార్ కుటుంబానికి కళతో సంబంధం లేని అనేక నీచ స్వార్థప్రయోజనాలున్నాయి. వాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. మీకు తెలియకపోతే లేదనుకోవద్దు. మీకు అంత కోపమొస్తే, నరకాలనుకుంటే నరకాల్సింది మమ్మల్ని కాదు. ఏయెన్నార్ కుటుంబాన్నే. అన్నపూర్ణా సినీ స్టూడియోస్ కట్టిన భూమి ప్రభుత్వం నుంచి అప్పనంగా కొట్టేసినటువంటిది. అ తరువాత ఆ స్థలంలో కొద్దిగానే స్టూడియో కట్టి మిగతాదంతా రియల్ ఎస్టేట్ గా అమ్మేసుకున్నారు. అది ప్రజల డబ్బు కాదా ? ఇది చాలా సంవత్సరాల నాటి సంగతి. కానీ ఇప్పుడు కూడా ఆ కుటుంబం చేస్తున్నది ప్రజల సొమ్ముని బకాసురుల్లా భోంచేయడమే. వైయెస్ హయాములో నాగార్జున షమ్సాబాదు దగ్గర వెయ్యి కోట్ల రూఫాయల విలువ చేసే 60 ఎకరాల భూమిని కేవలం వందకోట్ల రూపాయలకి ప్రభుత్వం నుంచి కొట్టేశాడు. ఇప్పుడా భూమి మీద రోశయ్య ప్రభుత్వం విచారణ ఏర్పాటు చేసి దాని స్వాధీనాన్ని పెండింగులో పెట్టింది. ఆ కడుపుమంటతో – ఎప్పుడూ రాజకీయ ప్రకటనలు చేయని నాగార్జున వైయెస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బావుంటుందని ఇప్పుడు సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు.

  స్పందించండి

  • Narikestam — annadi mimmalni kadu…. :)….maa vrutti , pravrutti adi kaadu 😛
   Sentence malli okasari chadavandi…..”ala koothalu koostunnaru rajakeeya naayakulu ani” annanu…

   –వాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు– ANR & Co. intha pedda rowdies ani neneppudu vinaledu lendi
   Annapurna studios bhoomi veellu kotteyyaledu….Govt kalla vella padi madras nunchi film industry ni ikkadiki taralinchadaaniki icchindi….meeku telise untundi ANR n Ramanayudu lead chesaru transfer jaragadaaniki….
   adi sarigga amalayyela choodaledu…..Padmalaya studios vishayam lo (krishna’s) kuda ide jarigindi……
   Mememi ANR family fans kaadu reddy gaaru.
   Kaani ee samsya ni ANR konamlonchi kaadu ….nagarjuna konamlonchi choodandi…..
   Todu dongalu aayana …and appati – ippati congress govt.

   –కానీ ఇప్పుడు కూడా ఆ కుటుంబం చేస్తున్నది — ANR family chala peddadandi…..tappu chesedi NAG …..ayyanni target cheyyali mottam family anadam sari kaademo ….

   స్పందించండి

 12. సినిమాను పరిశ్రమగా గుర్తించాలని కోరేది ఈ పెద్దమనుషులే. పరిశ్రమ గుర్తింపు వస్తే, మినహాయింపులు కోరేదీ ఈ పెద్దమనుషులే. సినిమా ఓ పరిశ్రమే అనుకుంటే, వీళ్లందరూ ఉద్యోగస్తులో వ్యాపారులో ఔతారు కానీ, కళాకారులెలా అవుతారు?

  స్పందించండి

 13. అక్కినేనికి సినిమా గురించి లెనిన్ అన్న మాటలు తెలిసిఉండవనినుకున్తున్నాను రావు జీ

  స్పందించండి

 14. మీరు రాసిన విధానం బావుంది, మీ శైలి నచ్చింది. అక్కినేని అంటే నాకు గౌరవం, నిబద్ధత, నిజాయితీ కలవాడని. మీరు చెప్పిన విషయాలు విన్నాక కాస్త నిజమే అనిపిస్తున్నాది. అక్కినేని మరి కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బావుంటుందేమో.

  స్పందించండి

 15. గుడ్డలిప్పుకుని మీరు ఆడే తైతక్కలు ఒక కళ. మీ ముఖం కాదు, మీ మాట కాదు – మీకు మా భాష రాదు, మా భావాలు తెలియవు, మా సంస్కృతి తెలియదు, మా సంప్రదాయం అసలే తెలియదు, మా అలవాట్లు తెలియవు, మీ గొంతు కాదు, మీ పాట కాదు – మీ గళం కాదు, ఎగిరేది మీరు కాదు, చివర్లో శత్రువుని తన్నేది, తొలుత వాడితో తన్నించుకునేది మీరు కాదు … అయినా మిమ్మల్ని (మిమ్మల్ని అంటే అక్కినేని కాదు- ఈనాటి నటనాగ్రేసరులనూ, గ్రేసరమ్మలనూ) కళాకారులుగా మేము చూడాలంటారా? ఆనందించాలంటారా? అసలెట్లా కనపడుతున్నాం, మీకళ్లకు? గొర్రెల్లాగానా? బర్రెల్లాగానా? అసలు బుర్రలేనోళ్లలాగానా? మట్టితో నిండిన బుర్రలు కలిగినోళ్లలాగానా?
  ee maatalu naaku baagaa nachaayi

  స్పందించండి

 16. ANR is 100 times bettter than NTR and his silly antics. After starting a party in the name of telugu atma gouravam, he slowly converted it to kamma dhanarjanam & kamma kula ahankaram. ANR’s relatives did not kill dalits like “brother”

  స్పందించండి

 17. తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్థంభాలుగా కొలవబడ్డ కాలంలో యన్ టి ఆర్, అక్కినేని తప్ప మరొకరిని వీళ్ళు ఎదగనీయలేదు. కొంతకాలనికి క్రిష్ణ లాటి వారు వచ్చినప్పటికీ అతనిని అణగదొక్కడానికి, తమలో తమకు గల భేడాలన్నిటిని మరిచి యన్ టి ఆర్, అక్కినేని చేతులు కలిపారు. వీళ్ళు పెద్ద మర్రి చెట్లే గాక, ఏ మాత్రం నటనాసామర్ధ్యం లేని బాలయ్యను నాగార్జున్ని మన తలలపై రుద్ది నటులంటే వీళ్ళు, వీళ్ళ కుటుంబాలు తప్ప మరేమి కాదనె స్థాయికి పరిశ్రమను దిగజార్చారు. వీళ్ళు పక్కా స్వార్ధపరులు, కులపిచ్చగాల్లు. సమాజాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారు. వీరివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. వీళ్ళా గురుంచి మాట్లాడక పోవాదమె ఉత్తమం.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: