ఎగసాయం – తెలుగుపల్లెల జీవనధారావాహిక … 5


”బైపాస్‌, బైపాస్‌ సెంటర్లో దిగేవాళ్లంతా రావాలండి” కలెక్టరు కేకలు పెట్టాడు అందరికీ వినపడేటట్టు. ఈదుమూడి రైతులంతా బిలాబిలా దిగిపోయారు తమతమ గోతాల్నీ, సంచుల్ని చేతబట్టుకుని.
అర ఫర్లాంగు దూరంలోని విత్తనాభివృద్థి సంస్థ కార్యాలయానికి బాటపట్టారు.
వెళ్తూ, వెళ్తూ వసంతరావు, భోగేశ్వరరావు చిన్నగా నడుస్తున్నట్లుగా నటించి, తప్పుకున్నారు. బస్సు ఒంగోలు సమీపిస్తుండగానే వాళ్ల నాలుకలు పీకటం ప్రారంభమయింది. నాలుకలు పీకటమంటే రంగారాయుడు చెరువు నీరు తాగేందుకుకాదు. పొట్లాల్లోనూ, సీసాల్లోనూ నింపి అమ్మే మినరల్‌ వాటర్‌ కోసం కానేకాదు. మందేసుకోవటం కోసం. ఇద్దరూ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ అయ్యప్ప బార్‌లోకి జొరబడి గుటకేశారు.  మూతి తుడుచుకుని బయట పడ్డారు. బంకు దగ్గర ఆగి చెరొక తీపి కిళ్లీ కట్టించుకుని బుగ్గల్ని బూరెల్లా పొంగించారు. తూలుకుంటూ అడుగుల్లో అడుగులేసుకుంటూ నడుస్తూ, నడుస్తూ రోడ్డుపక్కన ఒకరి తర్వాత మరొకరు కూలబడ్డారు. కాసేపు ఏదేదో వాగారు. ఎవర్నో బూతులు తిట్టారు. ”చెల్లియో, చెల్లకో…భోగేశ్వరరావు” రాగాలు తీస్తూనే వాలిపోయాడు. అతన్ని లేవదీస్తూ, వల్లగాక మరికాసేపటికి వెంకటరావు కూడా ఒరిగిపోయాడు మత్తుగా అతని పక్కనే.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: