ఆహార భద్రత అంటూ ప్రబ్యా సుద్దులు…ఆచరణలో కాబూలీవాలాలకు పెద్ద పొద్దులు

ఒకవైపు ఆహార భద్రత గురించి సుద్దులు చెప్పే ప్రపంచబ్యాంకు {ప్రబ్యా} మరోవైపు వ్యవసాయం, నీరు, వరదల నివారణ, పారిశుధ్య రంగాలకు ఇచ్చే రుణాలలో కోత పెట్టింది.  ఆర్థిక సంస్థలు, ప్రైవేటు రంగ అభివృద్ధికి పెద్ద పీట వేసింది. 15 అక్టోబరు 2010న  బ్యాంకు విడుదల చేసిన 2010 వార్షిక నివేదిక  ఈ ధోరణిని పట్టిచూపింది. భారత విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా  930 కోట్ల డాలర్ల రుణం ఇచ్చినట్లు నివేదిక వెల్లడించింది. ఏ దేశానికీ  ఇంత పెద్ద మొత్తం ఒకే సంవత్సరంలో రుణమివ్వలేదు.  దేశంలో గత ఐదు (2005-2010) సంవత్సరాలలో వివిధ రంగాలకు బ్యాంకు ఇచ్చిన రుణాలు 2,230.7 కోట్ల డాలర్ల నుంచి 5,874.7 కోట్ల డాలర్లకు పెరిగాయి. దీనిలో వ్యవ సాయం, అడవులు, మత్స్య రంగానికి 193.36 కోట్ల నుంచి 261.83 కోట్ల డాలర్లకు రుణం పెరిగింది. గతేడాది 340 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. ఇదే సమయంలో ద్రవ్యవ్యాపారం చేసే ఆర్థికసంస్థలకు, ప్రైవేటు రంగ అభివృద్ధికి 386.2 కోట్ల నుంచి 1,772.6 కోట్ల డాలర్లకు పెంచింది. కేవలం ద్రవ్య సంస్థలకు 167.51 కోట్ల నుంచి 913.66 కోట్లకు పెంచింది. ఈ ధోరణికి అను గుణంగానే రుణాలు తీసుకొనే దేశాలు తమ విధానాలను అమలు జరపాలనే షరతులు ఉంటాయని తెలిసిందే. నీరు,వరదల నివారణకు  218 కోట్ల డాలర్ల నుంచి గతేడాది 436 కోట్ల డాలర్లకు పెరగ్గా ఈ ఏడాది 410 కోట్లడాలర్లకు తగ్గించారు.
ప్రపంచంలో అత్యధికంగా 100 కోట్ల మంది జనం రోజుకు రెండుడాలర్ల (రు.93) కంటే తక్కువ ఆదాయంతో  బతుకీడుస్తున్నారని నివేదిక పేర్కొంది.  విద్యుత్తు‌ అందుబాటులో లేకపోవటం ఒక తీవ్ర సమస్యగా ఉందంటూ భారత్‌లో 44 శాతం కుటుంబాలకు విద్యుత్తు సౌకర్యము‌ లేదని పేర్కొంది. భారత్‌లో అమలు జరుగుతున్న సర్వశిక్ష అభియాన్‌కు 105 కోట్ల డాలర్ల సాయం అందించినట్లు తెలుపుతూ ప్రపంచంలోనే ఈ పధకం పెద్దది, అత్యంత జయప్రదమైనదని వర్ణించటాన్నిబట్టి చూస్తే ప్రపంచ  బ్యాంకు మోసకారి నాటకాలు  ఆడుతోందని అర్ధమవుతుంది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: