అయోడిన్‌ లోపం ఉంటే మరుగుజ్జులు

అక్టోబర్‌ 21ని ప్రపంచ అయోడిన్ ‌లోప వ్యాధుల దినంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య రక్షణలో అయోడిన్‌ పాత్ర గురించి తెలుసుకుందాం…

అయోడిన్‌ ఒక మూలకం. ఉప్పు, కొన్ని కూరగాయలు, సముద్రం నుండి లభించే కొన్ని ఆహార పదార్థాలలో అయోడిన్‌ ఉంటుంది.

మన దేశంలో ప్రతి ఐదుగురులో ఒకరు ఏదో ఒక స్థాయి అయోడిన్‌ లోపంతో బాధపడుతున్నారు.

మనం గొంతుపై బంతి లాంటి గడ్డ ఉన్నవారిని చూస్తుంటాం. దీన్ని గాయిటర్‌ అంటారు. ఈ గడ్డకు కారణం అయోడిన్‌ లోపమే.

మనం సర్కస్‌ కంపెనీలలో మరుగుజ్జులను చూస్తుంటాం. తల్లికి గర్భధారణ సమయంలో అయోడిన్‌ లోపం ఉంటే మరుగుజ్జులు పుట్టవచ్చు.

గర్భవతులలో అయోడిన్‌ లోపం ఉంటే – పిల్లలు తెలివి తక్కువతో, చెవుడు, మూగ, మెల్లకన్ను సమస్యలతో పుట్టొచ్చు.

అయోడిన్‌ లోపముండే గర్భవతులలో గర్భస్రావాలు కూడా ఎక్కువ.

మన శారీరక, మానసిక ఎదుగుదల అయోడిన్‌పై ఆధారపడి ఉంటుంది.

మనకు రోజూ కావాల్సిన అయోడిన్‌ 150 మైక్రోగ్రాములు. అంటే గుండు సూది తలపై పెట్టేంత మాత్రమే. ఈ లెక్కన జీవితాంతం ఒక స్పూను అయితే సరిపోతుంది.

కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలలో అయోడిన్‌ లోపం ఎక్కువ.

ఇప్పుడు అయోడిన్‌ కలిపిన ఉప్పు ప్రతి చోటా లభిస్తోంది.

అయోడిన్‌ కలిపిన ఉప్పునే వాడండి. భావితరాలు చురుకుగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడండి.

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌

సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్

సామాజిక సేవతో పునీతుడవుతోన్న  ఓ వైద్య మిత్రుడు రాసిన ఈ రచనపై వైద్య మిత్రులు స్పందిస్తే ఉపయోగం.
1. కల్లు ఉప్పులో అయోడిన్ సహజంగా ఉంటుందా/
2. కల్లు ఉప్పు ఉపయోగం?
3. టేబుల్; సాల్ట్ పేరి పేరిత లభ్యమవుతోన్న ఉప్పు ఉపయోగము ఎంత? నస్టాలు ఉన్నాయా?
4. హిమాలయేతర ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పు వాడాల్సిన పని లేదా?
అందరూ స్పందించండీ
అయోడిన్ టేబుల్; సాల్ట్ లాభాల మూట

ప్రకటనలు

3 వ్యాఖ్యలు

 1. మన తాత,తండ్రి,ముతాతలు ఇఒదిన్ ఉప్పు తినలేదు,వారిలో మరిగుజ్జులు లేరు.మరి ఈ కొత్త కార్పోరేట్ సంస్క్రుతినించి వచ్చిన ఈ ఉప్పు ఆరోగ్యానికా?లేక బహుళ జాతి వ్యాపార సంస్థలు డబ్బు దండుకోదానికా?

  స్పందించండి

 2. సముద్రపు ఉప్పులో సహజంగా అయోడిన్ ఉంటుంది. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లలో దొరికే రాతి ఉప్పులో అయోడిన్ ఉండదు.

  స్పందించండి

 3. సామాజిక సేవతో పునీతుడవుతోన్న ఓ వైద్య మిత్రుడు రాసిన ఈ రచనపై వైద్య మిత్రులు స్పందిస్తే ఉపయోగం.
  1. కల్లు ఉప్పులో అయోడిన్ సహజంగా ఉంటుందా/
  2. కల్లు ఉప్పు ఉపయోగం?
  3. టేబుల్; సాల్ట్ పేరి పేరిత లభ్యమవుతోన్న ఉప్పు ఉపయోగము ఎంత? నస్టాలు ఉన్నాయా?
  4. హిమాలయేతర ప్రాంతాల్లో అయోడిన్ ఉప్పు వాడాల్సిన పని లేదా?
  అందరూ స్పందించండీ
  అయోడిన్ టేబుల్; సాల్ట్ లాభాల మూట

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: