తెలుగులో డిస్కవరీ

 

ప్రపంచ ప్రసిద్ది గాంచిన డిస్కవరీ చానల్‌ తెలుగులో ప్రసారాలను ప్రారంభించినట్లుగా 20 అక్టోబరు 2010న ప్రకటించింది. కల్పన రహిత  సైంటిఫిక్‌ కార్యక్రమాలను అందిస్తూ  ప్రపంచ వ్యాపితంగా 180 దేశాలలో 150 కోట్ల టీవి చూపరుల అభిమానం పొందిన తమ సంస్థ దేశంలో ప్రసారాలను ప్రారంభించి 15 వసంతాలు పూర్తి చేసిన తరుణంలో తెలుగు ప్రసారాలను ప్రారంభించినట్లుగా  ఆసియా-పసిఫిక్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ బక్షీ వివరించారు. ప్రస్తుతానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకూ తెలుగు ప్రసారాలను చేస్తున్నట్లు తెలిపారు.  జనవరి,2011 నుంచి 24 గంటలూ తెలుగు ప్రసారాలను అందించనున్నట్లు  వివరించారు. ఇప్పటిదాకా దేశంలో ఇంగ్లీష్‌, హిందీలతో పాటుగా ఈ ఏడాది మొదటి నుంచి తమిళ  ప్రసారాలను ప్రారంభించిన తమ చానల్‌ నాల్గవ భాషగా తెలుగు ప్రసారాలతో దూసుకొని పోతున్నదని వివరించారు. ప్రస్తుతం దేశంలోని 604 జిల్లాలోని పట్టణాలు, గ్రామాలలో కలిపి 5కోట్ల 30 లక్షల మంది వీక్షకులతో దూసుకుపోతున్నామని వివరించారు. ముఖ్యంగా తమిళ ప్రసారాలు ప్రారంభించిన తరువాత 27 స్ధానాలు ముందుకు వచ్చి 18వ స్థానంలో తమ చానల్‌ నిలిచిందని వివరించారు. ఆ అనుభవంతోనే తెలుగు ప్రసరాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు

ప్రకటనలు

6 వ్యాఖ్యలు

  1. సంతోషం -కాని,ఈ చానేల్ల్స్ వల్ల అనువాదకులు,డబ్బింగ్ కళాకారులు దోపిడీకి గురవుతున్నారు.ఒక ఎపిసోదేకి అనువాదకునికి ౩,౫౦౦/,డబ్బిన్గ్కి ౨౫౦౦/రూపాయలకి బదులుగా,౧౫౦౦/[ఒక్కొకరికి]మాత్రం ఇష్టు,మిగిలిన దంతా స్వాహా చేస్త్తున్నారు.హైదరాబాదులోని అనువాదకులు+డబ్బింగ్ కాలాకారులు ఈ విషయలో గట్టిగా ఉంటె మంచిది మరి.

    స్పందించండి

  2. నా ఈ క్రింది టపాని చదివారా?

    http://amtaryalu.blogspot.com/2010/08/4.html

    తరవాత, మీ “నమ్మకాల…..తీర్పు” టపా పై నా వ్యాఖ్యనేమైనా ప్రచురించారా? జవాబు ఇచ్చారా?

    స్పందించండి

  3. చాలా సంతోషం.

    కానీ, స్పందనలకి ప్రతిస్పందన కూడా వెంటనే వుంటే బాగుంటుంది కదా?

    స్పందించండి

  4. ఈ స్పందనలకి కాదు–టపాలపై వచ్చిన స్పందనలకి!

    ఈ విషయం లో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి ఆలోచనలు క్రింది లింకు తో చదవండి.

    http://kyamedidotcom.blogspot.com/2010/10/blog-post_17.html

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: