భారత్ అమెరికాకు లొంగిపోయింది. అణు ప్రమాద పరిహార బిల్లును అమెరికా నిర్వీర్యం చేసింది. అణు ప్రమాద పరిహారం విషయంలో పరిమితులు విధించే అనుబంధ పరిహార ఒప్పందం (సిఎస్‌సి)పై భారత్ చేత సంతకాలు చేయించడంలో సఫలమైంది. అణు ప్రమాదం సంభవిస్తే అందుకు నిర్వాహకులు స్వల్పంగా చెల్లిస్తే సరిపోతుంది. ఆ సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా పరిమితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచ దేశాల (ముఖ్యంగా అమెరికా)తో అణు వాణిజ్యాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఈ ఒప్పందంపై వియన్నాలో భారత్ సంతకాలు చేసింది. ఈ చర్య ద్వారా ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన అణు ప్రమాద పరిహార చట్టాన్ని నీరుగార్చేందుకు యుపిఎ ప్రభుత్వం ప్రయత్నించినట్లయింది. ఈ ఒప్పందంపై భారత్ సంతకాలు చేసినట్లు వియన్నా నుంచి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) అధికారులు ధ్రువీకరించారు.
27 అక్టో