ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీదేవి సాక్షిగా 78 ఏళ్ల వృద్థుడు అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికను 30 అక్టోబరు 2010న వివాహం చేసుకున్నాడు. దీనికిగాను ఆ వృద్ధుడు ఆ బాలిక కుటుం బానికి పొలం రూపాన కన్యాశుల్కం చెల్లించాడు. మహారాష్ట్రలోని బెలోలి తాలూకా నర్సి పట్టణ సమీపంలోని నాహేగాంకు చెందిన సాహెబ్‌రావు భార్య, 40 ఏళ్ల కుమారుడు మృతి చెందారు. కోడలు తనకు సేవలు చేయడం లేదంటూ ఈ వృద్ధుడు పెళ్లికి తయారయ్యాడు. వాస్తవానికి గతంలోనే మరొకరితో అతనికి వివాహం జరిగింది. వృద్ధుడి వేధింపులు భరించలేక ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయిoది. ఇప్పుడు తన గ్రామానికే చెందిన పేద బాలికపై కన్నేశాడు. తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని బాలిక కుటుంబానికి ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలుత బాలిక ఎదురు ఎదురుతిరిగింది. అయితే కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. దీంతో చేసేది లేక వృద్ధుడితో ఆ బాలిక తాళి కట్టించుకుంది. ఇంత తతంగం జరిగినా ఆలయాధికారులుగానీ, పోలీసులుగానీ ఈ పెళ్లిని అడ్డుకోలేదు. ఆలయ పూజారులు పెళ్లి చేసేందుకు నిరాకరించడంతో బయట నుంచి పూజారిని పిలిపించుకుని కార్యక్రమం ముగించుకున్నారు.
30 అక్టో
Posted by manda pithamber. on అక్టోబర్ 31, 2010 at 11:55 ఉద.
మనుమ రాలి వయసు మగువను మనువాడ ,
డెబ్బ దేండ్ల కెట్టి జబ్బు వచ్చె?
చదవులమ్మ గుడిన బుధుల కేమాయెనో!
మంద వారి మాట మణుల మూట!