లోక్‌సభ కడప సభ్యుడు వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి విజయలక్ష్మి చట్టసభలకూ, కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ 28 నవంబరు 2010 ఉదయం 11.30 గంటలకు రాజీనామా చేశారు. కాంగ్రెసుపార్టీ అధిష్టానం తన కుటుంబం పట్ల వ్యవహరిస్తున్న తీరు కారణంగానే జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని సోమవారం ఉదయం నుంచే ఆయన ముఠా ప్రచారంలో పెట్టటం వెనుక మతలబు దాగి ఉంది. తన అవసరాలు, ఆకాంక్షల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నెరవేర్చలేని పరిస్థితుల్లో కాంగ్రెసు అధిష్టానం ఆయనను మారుస్తూ, పనిలో పనిగా జగన్మోహనరెడ్డికి ముకుతాడు వేసేందుకు కూడా పావులు కదపటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. కుర్చీ రాజకీయాల్లో సహజమయిన ఎత్తుకు పైఎత్తు వ్యవహారం ఇది. వైఎస్ కుటుంబాన్ని అదుపులో పెట్టేందుకు కాంగ్రెసు అధినాయకత్వం ముఖ్యమంత్రి మార్పుతో ఎత్తులు వేయగా, జగన్మోహనరెడ్డి ముఠా తమ రాజీనామాలతో పైఎత్తులు మొదలు పెట్టింది. ఇందంతా ఇప్పటికే సంపదను మూటగట్టుకుని స్థిరపడ్డ వర్గానికీ, మూటగట్టుకుంటూ స్థిరపడాలన్న తపన ఉన్న వర్గానికీ జరుగుతోన్న పోరు తప్ప మరొకటి కాదు. కాకపోతే పైకి మాత్రం ప్రజల పక్షాన నిలబడినందునే తనపై వేటేస్తున్నారని జగన్మోహనరెడ్డి, వ్యవస్థ ముఖ్యం తప్ప వ్యక్తులు కాదని కాంగ్రెసు అధిష్టానం మాయామేయ నాటకాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కొన్నాళ్లు మాత్రమే సాగుతాయి. తస్మాత్ జాగ్రత్త.
29 నవం
Posted by tprao on నవంబర్ 29, 2010 at 8:26 ఉద.
ఎవరికి వారు తనకూ, తన వర్గానికీ మేలు జరగాలని…….విమర్శలు, ప్రచారాలు, బెదిరింపులు, చివరికి రాజీనామాలు… ఇవే రాజకీయాలు… కుర్చీలో ఉన్న వారు కుర్చీని నిలబెట్టుకోడానికీ, కుర్చీ ముందున్న వారు కుర్చీని ఆక్రమించుకోడానికీ తపన….. ప్రజల గోడు ఎవరికీ పట్టదు… కుళ్లు రాజకీయాలు ఇవి… పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి…..
–టిపి రావు