రాళ్లసీమలో కోట్లు వెదజల్లుతున్న శాసనమండలి ఎన్నికల కాంగ్రెసు అభ్యర్థి


రాళ్లసీమ నుంచి శాసనమండలి ఎన్నికల్లో పోటీబడుతోన్న కాంగ్రెసు అభ్యర్థి శ్రీధరరెడ్డి కోట్లాది రూపాయల్ని వెదజల్లుతున్నాడు. ఈయన లోక్‌సభ నంద్యాల సభ్యుడు, నందిపైపుల సంస్థ అధినేత ఎస్పీవై రెడ్డి అల్లుడు కావటం విశేషం. శ్రీధరరెడ్డి, ఎస్పీవైరెడ్డి నిలువెత్తు ఫొటోలను ముద్రించిన పదో తరగతి స్టడీ మెటీరియల్‌ పుస్తకాలను పశ్చిమ రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమమంతా విద్యాశాఖ కార్యాలయాల నుంచే, ఆ విభాగం అధికారుల పర్యవేక్షణలో జరుగుతుండటం విశేషం. విద్యాశాఖ కార్యాలయాల్లో నిల్వచేసిన వేలాది పుస్తకాలను అనంతపురంలో శనివారంనాడూ, కడపలో ఆదివారంనాడూ సిఐటియు కార్యకర్తలు పట్టుకున్నారు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో ఓట్ల కొనుగోలుకు ధనిక అభ్యర్థులు ఎన్ని వ్యూహాలు పన్నుతారో వెల్లడయింది. అక్రమాలను వెల్లడించినందుకేమో సిఐటియు కార్యకర్తలపైనే దాష్టీకం చేసేందుకు పూనుకున్నారు తప్ప, అక్రమార్కులపై కనీసం కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఇచ్చగించలేదు.
కడప జిల్లాకు 18,472 పుస్తకాలను కేటాయించారు. ఒక్కొక్క పుస్తకం విలువ రూ. 200. అంటే ఈ జిల్లాలోనే రూ. 37 లక్షల విలువయిన పుస్తకాలను పంపిణీ చేసేందుకు పూనుకున్నారు. మూడు జిల్లాల్లోనూ పంపిణీ చేసేందుకుగాను కోటి రూపాయలకు పైగా విలువయిన పుస్తకాలను శ్రీధరరెడ్డి ముద్రించారు. ఓట్లను రాబట్టేందు పరోక్షంగా పనికొచ్చే కార్యక్రమానికే కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తే ఇక ప్రత్యక్ష కొనుగోళ్లకు ఎంత వెచ్చిస్తారో మరి?! విలువయిన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసి ప్రతిఫలంగా వారి బంధువుల గ్రాడ్యుయేట్‌ ఓట్లకు గాలం వేస్తున్నారు. దీనికితోడు తాము దానకర్ణులమంటూ ఉపాధ్యాయులనూ బుట్టలో వేసుకునేందుకు పన్నాగం పన్నారు. ఈ పుస్తకాలను కడప జెడ్పీ కార్యాలయానికి మూడు రోజుల క్రితం తరలించారు. ఈ పుస్తకాలను ఇప్పటికే కడప జిల్లాలో బద్వేలు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, ప్రొద్దుటూరుకు అధికారులు పంపేశారు.

ప్రకటనలు

One response to this post.

 1. నమస్కారం.
  మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
  http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
  తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
  మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
  సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

  దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
  మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .

  ధన్యవాదముతో
  మీ సమూహము
  http://samoohamu.com

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: