ప్రజల నాడి పట్టేందుకు 15 కోట్లు ఎరవేసిన జగన్మోహనరెడ్డి


స్వచ్ఛంద సంస్థలకు ఆహ్వానం
ద్వితీయ స్థాయి నాయకత్వానికి ఫోను రాయబేరాలు
రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించిన కడప మాజీ ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజల నాడి తెలుసుకునేందుకు సిద్ధమౌతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు స్వచ్చంద సంస్థలతో పరిశీలన చేయించనున్నారు. పరిశీలన చేసినందుకుగాను ప్రతి సంస్థకూ లక్ష రూపాయల చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం రూ. 14.70 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోన్న స్వచ్ఛంద సంస్థలకు ఆయన అంతర్జాలంలో ఆహ్వానం పలికారు. పరిశీలన ఎలా ఉండాలో సూచించారు. పరిశీలన కార్యక్రమానికి సిద్ధమైతే అంగీకారాన్ని తెలపాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలతోపాటు మరో మూడు సంస్థల ద్వారా కూడా ప్రజల నాడిని పట్టుకునేందుకు జగన్మోహనరెడ్డి నిర్ణయించారు.
మండలానికి రెండువేల మందితో ముఖాముఖి
ప్రతి మండలంలో రెండు వేల మందిని ముఖాముఖి ప్రశ్నించి నాడిని పట్టాలని అంతర్జాలంలో సూచించారు. నియోజకవర్గంలో సాధారణంగా నాలుగయిదు మండలాలు ఉంటాయి. అందువల్ల నియోజకవర్గానికి కనీసం ఎనిమిది వేల మంది నుంచి పది వేల మంది అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసిన గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి తాము సూచించిన ప్రశ్నలతో వారిని వేధించాలి.
పట్టాల్సిన అంశాలు ఇవీ
జగన్మోహనరెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారా? ఇలా ఆయన వ్యవహారశైలి గురించీ, రాజకీయ ప్రవేశంపైనా పది అంశాలున్నాయి. దీనికితోడు నియోజకవర్గంలో బలమైన సామాజిక తరగతికి చెందిన ముగ్గురి నాయకుల పేర్లను కూడా సంస్థలు సూచించాలి. ఎంపిక చేసిన నాయకులు రాజకీయ కుటుంబానికి చెంది, ఆర్థికంగా బలంగా ఉండాలని సూచించారు. ప్రజల్లో వారికున్న పలుకుబడి తీరును సంస్థలు సేకరించాలి.
స్థానిక నేతలపై ప్రత్యేక దృష్టి
జగన్మోహనరెడ్డి తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు స్థానిక నేతలపై దృష్టి సారించారు. సర్పంచుల, ఎంపిపి, జెడ్‌పిటిసి సభ్యుల వివరాలను తన సాక్షి యంత్రాంగం ద్వారా సేకరిస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి చెందిన వారిపైనే దృష్టి సారించారు. నేతల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్నీ, రాజకీయ పలుకుబడికి సంబంధించిన సమాచారాన్ని సాక్షి విలేకరుల బృందాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాపితంగా సేకరిస్తున్నాయి.
నాయకులతో ఫోను రాయబేరాలు
సాక్షి యంత్రాంగం ద్వారా ముఖ్యుల ఫోను నంబర్లను కూడా సేకరిస్తున్నారు. అనంతరం వారికి ఫోను చేసి మాట్లాడుతున్నారు. కడప కేంద్రంగా ఈ పని సాగుతోంది. రాష్ట్ర భవనాలు- రహదారులశాఖ మంత్రి ధర్మాన సోదరుడు, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనభ్యుడు కృష్ణదాస్‌కు ప్రత్యేకంగా జగన్మోహనరెడ్డి ఫోను చేసి తన కొత్త పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలిసింది. మాజీ ప్రజాప్రతినిధులనూ ఆయన ఆహ్వానిస్తున్నారు. ముఠా రాజకీయాల నేపథ్యంలో నేతలను గుర్తించి వారిని ఆకర్షించేందుకు ఫోను రాయబేరాలు సాగిస్తున్నారు.

4 వ్యాఖ్యలు

  1. మీ సమాచారం చాలా ఆసక్తిగా వుంది కెవిఎస్ గారూ!సంపాదించిన సొమ్ముతో ఇలా కూడా అధికారం రాబట్టుకోవచ్చన్నమాట ! జుత్తు వున్న అమ్మ ఏ కొప్పు అయినా పెడుతుంది. ఇప్పుడా యన గారు అంత కష్ట పడి డబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులో కొంత ఈ మధ్య ప్రాణాలు పోగొట్టుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చి అడుకోవచ్చుగా!
    మరో” ఓ …ఓ..దార్పు” యాత్ర కు శ్రీకారం చుట్టవచ్చుగా!

    స్పందించండి

  2. how can a person speaks from jail, it is immpossible………….

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: