మన ఆరోగ్యానికి మనమే తూట్లు పొడుచుకుంటున్నామని ఆయుర్వేద వైద్యుడు ఏల్చూరి వెంకటరావు వివరించారు. హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఆయన శుక్రవారం జనరంజకంగా ప్రసంగించారు. తన అనర్గళ ఉపన్యాసంతో ఆయన ప్రేక్షకులను నిజంగా కట్టిపడేశారు. ఉపన్యాసంలో ఆంగ్ల పదాలు లేకపోవటం విశేషం. సహజసిద్ధమయిన పల్లె పదాలను అలవోకగా ఉపయోగిస్తూ ఏల్చూరి చేసిన ఉపన్యాసం కమ్మని కంఠంతో సాగింది. ఆయన బోధనల్లో శాస్త్రీయ ఎంతుందో నాకు తెలియదు. అయితే ఆయన ఏ రోగానికీ రసాయనిక పదార్థాలను ఔషదాలుగా సూచించలేదు. సహజ పదార్ధాలను మాత్రమే నానబెట్టో, పిండి చేసుకునే, రెండు మూడు రకాలను కలుపుకునో తినమని సూచించటం గమనార్హం. అందువలన ఆయన సూచనలను పాటిస్తే లాభం, రోగం తగ్గటం మాట అటుంచి నష్టం మాత్రం లేదని చెప్పవచ్చు. దీనికితోడు తాను చెప్పినంత మాత్రాన నమ్మాల్సిన పనిలేదనీ, ఎవరి అనుభవంతో వారే రోగ నిదానాన్ని గుర్తించొచ్చని చెప్పటం ప్రశంసనీయం. ఆచరణీయం.
ఏల్చూరి ప్రవచించిన ఆరోగ్య సూత్రాలు ఇవీ :
1. విదేశీ వ్యాపారుల మాయమాటలకు లొంగి రసాయనికాలను వినియోగించి రోగాలు కొనితెచ్చుకోవద్దు.
2. రసాయనిక టూత్‌పేస్టుల వలన చిన్నతనంలోనే దంత సమస్యలు ఏర్పడుతున్నాయి. వేప పుల్లతో తోముకున్న పాత తరాలవారికి ఈ సమస్యలు లేవు.
3. రోజూ నాలుగు చెంచాల యవలు, ఒక చెంచా మెంతుల్నీ 24 గంటలపాటు నానపెట్టి తింటే పలు రోగాలు దరిచేరవు. రోగాలు నిదానిస్తాయి.
4. ఉదయం పూట తొమ్మిది గంటల లోపు, రాత్రి వేళ ఏడు గంటల లోపు భోజనం పూర్తి చేసేవారికి అనారోగ్యం దరిచేరదు. మధ్యాహ్నం ఉపాహారం తినవచ్చు. అయితే ఆ సమయంలో నిద్ర పోవద్దు.
5. పీఠమీదగానీ, కిందగానీ కూర్చుని భోజనం చేయాలి. ముద్ద కోసం వంగాల్సిన సమయంలో పొట్ట నిండిన విషయాన్ని గుర్తించే వీలుంది. పైగా అది శరీరానికి వ్యాయామం కూడా అవుతుంది.
6. ఆహారాన్ని కొంతయినా నమిలి తినాలి.
7. పడుకునే సమయానికి కనీసం మూడు గంటల ముందు భోజనాన్ని పూర్తిచేయాలి.
8. ఇంటిలోనే చిన్నపాటి వ్యాయామాలు చేసినా ఆరోగ్యం పాడవదు.
9. వంటకు ఆముదం మంచిది. వంటికి నువ్వుల నూనె రాసుకుంటే మేలు చేస్తుంది.
10. తినకూడని పదార్ధాలు లేవు. అయితే ఎంత, ఎప్పుడు తినాలో తెలుసుకుని ఆచరించాలి.
సమాజిక అంశాలు :
1. స్వాతంత్య్రద్యమకారుల ఆశయాలు నెరవేరలేదు.
2. విదేశీ వ్యాపారుల రాజ్కం కొనసాగుతోంది.
3. 23వ ఏటనే ఉరికంభానికెక్కిన భగత్‌సింగ్ సిద్ధాంతాలను ఆచరిస్తే మంచి సమాజం ఏర్పడుతుంది.
4. ఈ లోకాన్ని వదిలిపోయినవాళ్లెవ్వరూ ఇంత వరకూ తిరిగొచ్చి స్వర్గం, నరకం ఉందని చెప్పలేదు. అందువలన ఈ భూమి మీదే మంచి అలవాట్లతో స్వర్గాన్ని సృష్టంచుకోవాలి. మన అక్రమ చర్యలే నరకాన్ని సృష్టిస్తున్నాయి.
5. ప్రత్యేకంగా దేవుడు, దయ్యం లేవు. మంచి అలవాట్లే దేవుడు. చెడ్డ అలవాట్లే దెయ్యాలు.
6. అమ్మ భాషలో చదువు మానసిక అభివృద్ధికి దోహదపడుతుంది. విదేశీ భాషల్ని అవసరం మేరకు నేర్చుకోవటం తప్పుకాదు.
7. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు.
8. విదేశీయులు తమ వ్యాపారాలు చేసుకునేందుకే ఖర్చులేని ఆయుర్వేదాన్ని తొక్కేస్తున్నారు.
9. పిల్లల్లో దేశభక్తిని పెంపొందింపజేయండి.
10. ధైర్యమే అన్నింటినీ జయింస్తుంది. భయపడితే తాడే పామై కాటేస్తుంది.
25 డిసెం
Posted by Rao Lakkaraaju on డిసెంబర్ 25, 2010 at 4:12 సా.
ఇప్పుడు విదేశాల్లో కూడా పెద్ద పెద్ద డాక్టర్లు “శాకాహారం” చాలా మంచిదని చెపుతున్నారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.
Posted by కర్లపాలెం హనుమంత రావు on డిసెంబర్ 25, 2010 at 6:41 సా.
4. ఈ లోకాన్ని వదిలిపోయినవాళ్లెవ్వరూ ఇంత వరకూ తిరిగొచ్చి స్వర్గం, నరకం ఉందని చెప్పలేదు. అందువలన ఈ భూమి మీదే మంచి అలవాట్లతో స్వర్గాన్ని సృష్టంచుకోవాలి. మన అక్రమ చర్యలే నరకాన్ని సృష్టిస్తున్నాయి.
5. ప్రత్యేకంగా దేవుడు, దయ్యం లేవు. మంచి అలవాట్లే దేవుడు. చెడ్డ అలవాట్లే దెయ్యాలు.
6. అమ్మ భాషలో చదువు మానసిక అభివృద్ధికి దోహదపడుతుంది. విదేశీ భాషల్ని అవసరం మేరకు నేర్చుకోవటం తప్పుకాదు.-
ఈ టపా నాకూ విపరీతంగా నచ్చింది.
సరిగ్గా జనా విజ్ఞాన వేదిక వాళ్ళే చెప్పింది వీరూ చెప్పారు.
ఈ టపా నా బ్లాగులకి లింక్ ఇవ్వవచ్చా సుబ్బారావు గారూ!
Posted by తెలుగిల్లు on డిసెంబర్ 25, 2010 at 7:24 సా.
మీరు అడగాల్సిన పని లేదు. తప్పక వినియోగించికోగలరు.
Posted by durgeswara on డిసెంబర్ 26, 2010 at 4:38 ఉద.
మంచి విషయాన్ని ప్రచురించారు.ధన్యవాదములు
Posted by radha krishna on డిసెంబర్ 25, 2011 at 11:35 ఉద.
hi meeru chepe vishayalu naku chala baga nachinavi. i tee naku healthy stamina ga undalantee elanti aharam tusukovali, ayurvedam emina undaa chepandi pls. krishna97003@gmail.com na mail ID:
Thanks once again.
Posted by కృష్ణశ్రీ on డిసెంబర్ 29, 2010 at 7:13 ఉద.
యేల్చూరివారి ‘ఆచరణీయ ‘ అరోగ్య సూత్రాలు అన్నీ నిజమే.
అన్నిటికన్నా ముందు, మన ప్రాచీన ఆచారం–వీధిలోంచి వస్తూనే నూతిదగ్గర ముఖం, కాళ్లూ, చేతులూ కడుక్కొని లోపలికి రావడం, అలా వీల్లేకపోతే, వచ్చినవాళ్లకి–వాళ్లు కుటుంబ సభ్యులే అయినా, అతిథులైనా–కాళ్లకు నీళ్లివ్వడం!
అనుభవపూర్వకంగా చెపుతున్నాను…..ఇది ఆచరించి చూడండి–ఆరోగ్య సమస్యలు 80 శాతం తగ్గిపోతాయి.
మరి యెవరు ఆచరిస్తున్నారు?
ఇక సామాజిక సమస్యలు–అన్నీ అందరికీ తెలిసున్నవే–వాటిని ఒకచోట గుదిగుచ్చడం అభినందనీయం.
Posted by తెలుగిల్లు on డిసెంబర్ 29, 2010 at 11:30 ఉద.
మీకు నా నెనరులు
Posted by shoeb on ఏప్రిల్ 26, 2011 at 10:30 ఉద.
oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
Posted by vamshi on జూలై 13, 2011 at 5:10 ఉద.
mana aacharaalu greet sir………thank u sir.
Posted by pvkrishnamonhan on జూలై 13, 2011 at 7:55 ఉద.
Yelchuri is conducting a herculian task of propagating Ayurveda and tryibg to get back the lost wisdom to the so called Indian science of medicine AYURVEDAM. Really he is to be honoured for the strugle his is taking.
Posted by b.priyanka on ఆగస్ట్ 25, 2011 at 11:49 ఉద.
Namaskaramandi naku gata 5 years nundi white discharge vidudala avutundi taggatam kosam emi cheyali daya chesi edaina ayurveda medicine unte te
Posted by sandhya on సెప్టెంబర్ 19, 2011 at 6:13 ఉద.
namaste sir,na peru sandhya ma ammaye 9years ki mature ayendi, kani tharuvatha 1year date raledu,eppudu regularga vasthundi kani breast viparithanga perigipothundi a dress vesukovadanikyna siggupaduthundi please diniki parishkaram cheppandi.eppudu thana age 11 years.