సిలికానాంధ్ర సంస్థ హైదరాబాద్‌లోని జిఎంసి బాలయోగి స్డేడియంలో ఆదివారంనిర్వహించిన మహా కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నిస్ పురస్కారం సాధించింది. 2800 మంది నర్తకీమణులు ఏక కాలంలో చేసిన నాట్య విన్యాసానికి ఈ అరుదైన పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నృత్య ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సిలికానాంధ్ర నిర్వాహకులకూ, నృత్య కళాకారులకు అభినందనలు తెలిపారు. గిన్నిస్ పురస్కారం సాధించి కూచిపూడికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన అందరినీ అమె ప్రశంసించారు. భారతదేశం నాట్య కళాకారులకు, సంస్కృతీ వైభవానికి తార్కాణంగా నిలిచిందన్నారు. 600 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో అవతరించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ పురస్కారం సాధించటం అరుదైన ఘట్టంగా రాష్ట్రపతి అభివర్ణించారు. కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందనిగవర్నరు ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రస్తుతించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసిన నిర్వాహకులను, నృత్య కళాకారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు.
26 డిసెం