నల్లారికి నోటిదూల ఎక్కువే


ప్రతిపక్షంలో ఒకమాట – గద్దెనెక్కాక మరో కూత… దేశమంతటా ప్రస్తుతం కన్పిస్తోన్న దృశ్యం ఇది. విన్పిస్తోన్న తీరు ఇది. వాస్తవానికి కాంగ్రెసుపార్టీ ప్రతిపక్షంగానూ పనికిరానిదే. అయితే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే మాత్రం భలే మాటలు చెప్పయగలదు. బోల్తా కొట్టించేయగలదు. అతివృష్టి, తుపాను బీభత్సం, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతన్నలు గత డిసెంబరు నుంచే 500 మంది చనిపోయారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ కళ్లకు మాత్రం రైతు మరణాలు విభిన్నంగా కన్పిస్తున్నాయి. గుండె పగిలి చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా దానికి కారణం పంట నష్టం కారణమే కాదని ఆయన తేల్చి చెప్పేశారు. అనారోగ్యమే కారణమని చావు కబురు చల్లగా పేల్చేసేశారు. అప్పులు కూడా దానికి తోడవుతున్నాయని తోడుగా చెప్పారు. హైదరాబాదులో మూడు రోజులపాటు నిర్వహించిన వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రుల జాతీయ సదస్సులో గురువారంనాడు ఆయన ప్రసంగిస్తూ…. రోగాలపాలయిన రైతులకు వైద్య సేవలందించేందుకుగాను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. అంటే తాము ఖర్చుకు వెనుకాడకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సిద్ధంగా ఉన్నా రైతు మాత్రం రోగాల్ని తగ్గించుకునేందుకు సిద్ధంకాక ప్రాణాలు తీసుకుంటున్నారని ఆయన మాటల వెనకున్న గూఢార్ధం.
వాస్తవానికి ఆయన చెప్పినదాంట్లో కొంత నిజముంది. రైతులు అనారోగ్యంతో చనిపోతున్నారని కదా ఘనత వహించిన ముఖ్యమంత్రిగారి విశ్లేషణ. అది నిజమే. పంట చేతికొస్తే పిల్ల పెళ్లి, పిల్లగాడి చదువు, సొంతింటి కల, ఇల్లాలి వైద్యం ఇలా ఇలా ఏదో ఒకటి సాకారం అవుతుందని ఎదురు చూసిన రైతన్నను అననుకూల వాతావరణం పెఠీల్మని కొట్టింది. దిమ్మదిరిగిన వాడిని అనారోగ్యం చుట్టుముట్టింది. మంచం పట్టాడు. ఓ పాపపు ఉదయం ఆ రైతన్నను గుండెపోటు తీసుకెళ్లింది. ఇక నల్లారిగారి రెండో మాట ఆర్థిక సమస్య. ఈ చరాచర జగత్తును నడిపేది అదే కదా మరి. డబ్బు అన్నింటినీ తేలేకపోవచ్చుగానీ, డబ్బులేకపోతే ఏదీ ఉండదుగదా? డబ్బు లేకపోతే కూలి చేసుకు బతకొచ్చు. అయితే రైతన్న పరిస్థితి అదిగాదే. సాగుకోసం చేసిన అప్పులు నెత్తిమీద కుంపటి రాజేస్తే ఎట్లా బతుకుతాడు? చెంబూ, తపాళ జప్తు చేస్తామంటూ ప్రభుత్వ ఆర్థిక సంస్థల బెదిరింపులు ఓ పక్క, నీ పెళ్లాన్నో, నీ పిల్లతోనో వ్యభిచారం చేయించి మా అప్పు తీర్చు అంటూ కాబూలీవాలాలు మరోవైపు. దేశంలో అంతో ఇంతో సిగ్గు మిగిలున్న రైతన్న చావక ఛస్తాడా? అందుకని, ఓ ముఖ్యమంత్రీ హామీలు గుప్పించటం కాదు మాకు కావాల్సింది. సాయం చేసే చేతులు కావాలి. చేతనయితే చెయ్యి. లేకపోతే నోరు మూసుకు కూర్చో. అంతేగానీ కారుకూతలు కూశావో, అంతకు అంత అనుభవిస్తావు గుర్తుపెట్టుకో. ఖబడ్దార్‌.

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

 1. Well Said.
  1.హౌసింగ్ లోన్ల కుంభకోణంలో 50 లక్షల విలువచేసే ఇంటిపై కోటి రూపాయల లోన్లిచ్చిన, అదే రైతూ పదివేల లోను కట్టకపోతే ఇంటి తలుపులు ఊడబెరుక్కపోయే ఘనులున్న మన వ్యవస్థలో రైతుకు ఆసరాగా నిలిచేదెవ్వడు?
  2. ఎవడైనా కంపెనీ పెట్టదలచాడనగానే వాడిచ్చే కమీషన్లకోసం కక్కుర్తిపడి వాడి ఫైలుచుట్టూ తిరిగి పైరవీ చేసి, అణాకో అర్ధణాకో అప్పణంగా ప్రభుత్వ భూముల్నీ వగైరా వాడికి అప్పజెప్పిచ్చి వాడిదగ్గర్నుంచి బ్రోకరేజీ తీసుకునే నాయకుల్లారా కొంచెం రైతులకోసం కూడా లాబీయింగ్ చెయ్యండి. పొలం లేని రైతుకు పొలమో, హలం లేని వాడికి హలమో ఇవ్వకపోయినా కనీసం యూరియాకోసం వీధిపోరాటాలూ, కల్తీ విత్తనాలూ పురుగుమందులా భారినపడి ఆత్మహత్యలు చేసుకోవలసిన ఆగత్యమునుండికాపాడండి. బుక్ చేసుకున్న వారానికి గ్యాస్ బండను ఇంటిదగ్గర ఇచ్చి వెళ్ళినట్లే పంటవేసే కాలానికి కనీసం నెలముందే రైతన్న పాసుపుస్తకాన్నిబట్టి ఎన్నిమందుకట్టలవసరమో అంతా అతనింటిదగ్గరే ఇచ్చివెళ్ళండి. ఇదేమంత గగనకుసుమం కాదేమో తెంపకరాలేమనడానికి?
  3.ఓ పక్క ధాన్యానికి సరియైన ధరలేక రైతు చస్తుంటే, మరోవైపు ఆహారం సరిగ అందక పేదోడు చస్తుంటే కాలం చెల్లిన విధానాలతో,అతి ముందుచూపుతో అడ్డగోలుగా ఎఫ్.సి.ఐ గోదాముల్లో ధాన్యాలను ముక్కబెడుతున్నారు. ఆ పాడు పద్ధతుల్ని మార్చుకోండి. రైతుకు ఎక్కడ గిట్టుబాటు ధర ఉంటే అక్కడ అమ్ముకోనీయండి.
  4.ఒక చేత్తో తీసుకున్నదానికి అయిదు రెట్లు ఇంకోచేత్తో తిరిగిచ్చే రైతన్నకు ఇచ్చిన ఆసరా ఎప్పటికీ వృధాకాదనే సత్యాన్ని గుర్తించి మసలుకుంటే సర్వధా, సధా సుభిక్షం, లేదంటే తప్పదు దుర్భిక్షం.

  స్పందించండి

  • బుక్ చేసుకున్న వారానికి గ్యాస్ బండను ఇంటిదగ్గర ఇచ్చి వెళ్ళినట్లే పంటవేసే కాలానికి కనీసం నెలముందే రైతన్న పాసుపుస్తకాన్నిబట్టి ఎన్నిమందుకట్టలవసరమో అంతా అతనింటిదగ్గరే ఇచ్చివెళ్ళండి. ఇదేమంత గగనకుసుమం కాదేమో తెంపకరాలేమనడానికి?

   ఆరెస్ రెడ్డి గారూ, వ్యాక్య అవరమే లేని మీ విశ్ల్లేషణ చాలా చాలా బాగుంది. అనుసరణీయం.

   స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: