ముడి చమురు ధరలు పెరిగితే … వియత్నాంలో ఊరట – భారత్‌లో బాదుట


అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరిగినా ప్రజలపై భారం మోపకుండా ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో వియత్నాం ప్రభుత్వానికీ మనదేశానికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం వినియోగదారులపై పడకుండా చర్యలు తీసుకోవడంలో వియత్నాం, భారత దేశాలు వ్యవహరించిన తీరు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దేశీయంగా ఎలాంటి చమురుశుద్ధి సదుపాయాలూ లేని వియత్నాం, పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నప్పటికీ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా వినియోగదారులపై దాని ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవడం విశేషం.
ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 101 డాలర్లకు చేరిన సమయంలో దాని ప్రభావం నుంచి ప్రజలను రక్షించడానికి వియత్నాం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోలు పంపిణీదారులకు లీటరు ఒక్కొంటికి 600 డాంగ్స్‌ (వియత్నాం రూక) చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఆ విధంగా ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష రాయితీ 1600 డాంగ్స్‌కు (18500 డాంగ్స్‌ ఒక డాలరుతో సమానం) చేరింది. ‘ధరల స్థిరీకరణ నిధి’ ద్వారా ఈ రాయితీలో కొంత భాగాన్ని వినియోగదారులు కూడా చెల్లిస్తున్నారు. ప్రతి లీటరు నుంచి 300 డాంగ్స్‌ ఈ నిధికి వెళ్తాయి. పెట్రో ఉత్పత్తులపై దిగుమతి పన్నులను పూర్తిగా ఎత్తివేయడం రెండో చర్య. వాస్తవానికి దీనికి ముందు ఆ ప్రభుత్వం గత రెండు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులపై దిగుమతి పన్నును రెండు సార్లు తగ్గించింది. పెట్రోలుపై దిగుమతి పన్నును 20 శాతం నుంచి ఆరు శాతానికీ, డీజిలుపై దిగుమతి పన్నును 15 శాతం నుంచి రెండు శాతానికీ తగ్గించింది. ప్రస్తుతం ఆ పన్నులను పూర్తిగా ఎత్తివేసింది. కానీ, మన దేశంలో దేశీయంగా చమురు వెలికి తీస్తున్నా కేంద్ర యుపిఎ ప్రభుత్వం మాత్రం ధరల భారం నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా, ధరల నిర్ణయాన్ని చమురు సంస్థలకే అప్పగించింది. ఫలితంగా కొన్ని వారాల్లోనే పెట్రోలు ధరలు లీటరుకు రూ.11.50 పెరిగాయి. దీనికితోడు త్వరలోనే డీజిలుపై ూన్న నియంత్రణను కూడా ఎత్తివేయాలని యోచిస్తోంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 2010 ప్రారంభం నుంచీ 30 శాతం పెరిగినా, వియత్నాంలో మాత్రం కేవలం 2.8 శాతం మాత్రమే పెరగడం గమనార్హం.

ప్రకటనలు

One response to this post.

  1. Well said.
    ఘనత వహించిన మన దేశాధినేతలకు “యాంటిల్లా”లు కట్టుకొనే కార్పొరేట్ ఆసాములు పేదోళ్ళుగా కనబడతారుగానీ (కార్పొరేట్ రంగానికి పన్నుల రాయితీలుగా దాదాపు రూ. 3,00,000 కోట్లు ఇచ్చారు) బండి మీద తిరిగి పాలమ్ముకునే పేదోడి నుండి మోపెడ్ పై ఆఫీసుకి వెళ్ళే చిరుద్యోగి దాకా మాత్రం సంపన్నులుగానే కనపడతారు:) ప్రజలకోసం కనీసం పెట్రోలు, డీజిల్ లపై సుంకాలు తగ్గించడం ద్వారానైనా ఉపశమనం కల్పించడానికి మాత్రం మనసొప్పదు.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: