మకరజ్యోతి, అయ్యప్ప దేవస్థానం సృష్టేనని ఆ దేవస్థానం మాజీ కమిషనరు పివి నళినాక్షిన్ నాయర్ దేవస్థానం తీర్పరి ఆర్ భాస్కరన్‌కు రాసిన లేఖలో వివరించారు. పొన్నాంబళమేడు పర్వత శిఖరంపై ఏటా మకర సంక్రాంతి రోజున దేవస్థానం యంత్రాంగమే ఈ జ్యోతిని వెలిగిస్తుందని పేర్కొన్నారు. లక్షలాది మంది ఏళ్ల తరబడీ దర్శించుకు0టున్న మకరజ్యోతి మానవ కల్పితమే అయినప్పటికీ దా0తో అయ్యప్ప దేవాలయానికి ఎటువంటి సంబంధమూ లేదని ఆలయ అధ్యక్షుడు శుక్రవారం ప్రకటించారు. అయితే తాను దేవస్థానం కమిషనరుగా పనిచేసినపుడు ఇతర అధికారులతో కలిసి పొన్నాంబళమేడు వెళ్లి ఏటా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనే వాడినని నళినాక్షిన్ తెలిపారు. 2008లో దేవస్థానం కమిషనరుగా బాధ్యతలు స్వీకరించిన ఆర్నెల్ల తర్వాత తొలిసారిగా ఈ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు నళినాక్షిన్ లేఖ ప్రకారం మకరజ్యోతికి దాదాపు 45 ఏళ్ల చరిత్ర ఉంది. వాస్తవానికి ఈ మకరజ్యోతిని తొలుత మలయరాయ తెగకు చెందిన కుటుంబాలు వెలిగించేవని వివరించారు. శబరిగిరి జలవిద్యుత్తు పథకం నిర్మాణం కోసం వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించిన తరువాత కేరళ రాష్ట్ర విద్యుత్తు సంస్థ్డ అధికారులు ఈ జ్యోతిని వెలిగిస్తుండేవారనీ, ఆ తరువాత ట్రావెంకూర్ దేవస్థానంతోపాటు పోలీసు శాఖ ఈ బాధ్యతను స్వీకరించాయని నాయర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పంప వద్ద ఉండే దేవస్థానం ఈఈ బాధ్యుడిగా వ్యవహరించే వారని తెలిపారు. అయితే దానికి సంబంధించిన ఖర్చుల్ని మాత్రం దేవస్థానం ఖాతాలో ఎన్నడూ నమోదు చేయలేదని వివరించారు. ఎందుకు మోసం చేస్తున్నారని తాను అడుగగా, జ్యోతి కనిపించకపోతే భక్తులు అశాంతికి లోనవుతారని దేవస్థానం అధికారులు వివరించారని తెలిపారు. ఈ ప్రక్రియను రద్దు చేసే ధైర్యం దేవస్థానానికి లేనపుడు దీనిని సంప్రదాయంగా మార్చాలని కోరానని వివరించారు. దానికయ్యే ఖర్చును నమోదు చేసేందుకు వీలవుతుందవి చెప్పాననీ, అయితే తన సలహాను అధికారులు పెడచెవిన పెట్టారని తెలిపారు. దేవస్థానం కొనసాగిస్తున్న మోసమే భక్తులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
Archive for జనవరి 23rd, 2011
23 జన
మకరజ్యోతి అయ్యప్ప దేవస్థానం సృష్టే! – మాజీ కమిషనరు పీవీ నళినాక్షిన్
23 జన
నేతాజీని గౌరవించడం మరిచారు : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
నేతాజీ సుభాష్ చంద్రబోసును గౌరవించడంలో దేశం పూర్తిగా విఫలమయిందని ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి ఆదివారం విమర్శించారు. ఈ తప్పిదాన్ని ఇప్పటికయినా సరిదిద్దుకోవాలని సూచించారు. కొల్‌కతాలో జరిగిన నేతాజీ జయంతి సభలో ఆయన ప్రసంగించారు. దేశ రాజధాని ‘ఢిల్లోలో ఒక్క ప్రదేశానికి కూడా నేతాజీ పేరు పెట్టలేదని తెలిసి తాను చాలా విస్మయానికి గురయ్యానని వ్యాఖ్యానించారు. ఒక వేళ తాను చెప్పేది తప్పయితే సవాలు చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కనీసం అధ్బుతమైన దేశ ప్రధానయినా నా సవాలును స్వీకరిస్తారా? అని వ్యగ్యంగా ప్రశ్నించారు. నేతాజీ ధైర్యవంతుడయిన నాయకుడని శ్లాఘించారు. ఈ సభలో పశ్చిమబెంగాల్ గవర్నరు ఎంకె నారాయణ మాట్లాడుతూ నేతాజీ జన్మదినం జనవరి 23ను దేశభక్తి దినంగా ప్రకటించాలని కోరారు.