మకరజ్యోతి, అయ్యప్ప దేవస్థానం సృష్టేనని ఆ దేవస్థానం మాజీ కమిషనరు పివి నళినాక్షిన్ నాయర్ దేవస్థానం తీర్పరి ఆర్ భాస్కరన్‌కు రాసిన లేఖలో వివరించారు. పొన్నాంబళమేడు పర్వత శిఖరంపై ఏటా మకర సంక్రాంతి రోజున దేవస్థానం యంత్రాంగమే ఈ జ్యోతిని వెలిగిస్తుందని పేర్కొన్నారు. లక్షలాది మంది ఏళ్ల తరబడీ దర్శించుకు0టున్న మకరజ్యోతి మానవ కల్పితమే అయినప్పటికీ దా0తో అయ్యప్ప దేవాలయానికి ఎటువంటి సంబంధమూ లేదని ఆలయ అధ్యక్షుడు శుక్రవారం ప్రకటించారు. అయితే తాను దేవస్థానం కమిషనరుగా పనిచేసినపుడు ఇతర అధికారులతో కలిసి పొన్నాంబళమేడు వెళ్లి ఏటా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనే వాడినని నళినాక్షిన్ తెలిపారు. 2008లో దేవస్థానం కమిషనరుగా బాధ్యతలు స్వీకరించిన ఆర్నెల్ల తర్వాత తొలిసారిగా ఈ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు నళినాక్షిన్ లేఖ ప్రకారం మకరజ్యోతికి దాదాపు 45 ఏళ్ల చరిత్ర ఉంది. వాస్తవానికి ఈ మకరజ్యోతిని తొలుత మలయరాయ తెగకు చెందిన కుటుంబాలు వెలిగించేవని వివరించారు. శబరిగిరి జలవిద్యుత్తు పథకం నిర్మాణం కోసం వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించిన తరువాత కేరళ రాష్ట్ర విద్యుత్తు సంస్థ్డ అధికారులు ఈ జ్యోతిని వెలిగిస్తుండేవారనీ, ఆ తరువాత ట్రావెంకూర్ దేవస్థానంతోపాటు పోలీసు శాఖ ఈ బాధ్యతను స్వీకరించాయని నాయర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పంప వద్ద ఉండే దేవస్థానం ఈఈ బాధ్యుడిగా వ్యవహరించే వారని తెలిపారు. అయితే దానికి సంబంధించిన ఖర్చుల్ని మాత్రం దేవస్థానం ఖాతాలో ఎన్నడూ నమోదు చేయలేదని వివరించారు. ఎందుకు మోసం చేస్తున్నారని తాను అడుగగా, జ్యోతి కనిపించకపోతే భక్తులు అశాంతికి లోనవుతారని దేవస్థానం అధికారులు వివరించారని తెలిపారు. ఈ ప్రక్రియను రద్దు చేసే ధైర్యం దేవస్థానానికి లేనపుడు దీనిని సంప్రదాయంగా మార్చాలని కోరానని వివరించారు. దానికయ్యే ఖర్చును నమోదు చేసేందుకు వీలవుతుందవి చెప్పాననీ, అయితే తన సలహాను అధికారులు పెడచెవిన పెట్టారని తెలిపారు. దేవస్థానం కొనసాగిస్తున్న మోసమే భక్తులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
23 జన
Posted by Indian Minerva on జనవరి 24, 2011 at 3:32 ఉద.
ఆహా… ఇదే విషయమై క్రితం సంవత్సరం నాకు నా కొలీగ్ ఒకతనికి మధ్య ఓ సంవాదం జరిగింది. Trained eagles, camphor torches తో జనాల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారని నేను కొంత information ఇంటర్నెట్ నుండి చూపిస్తే. “అవన్నీ ఆరోపణలు మాత్రమే” నంటూ కొట్టివేశాడు. తరువాత అతనే ఆ దేవస్తానం రిఠైర్డ్ అధికారి పలుకులు చదివి (యాహూ గ్రూప్స్‌లో ననుకుంటా) “deeds matter more than the means” అంటూ కొత్త వాదాన్ని లంకించుకున్నాడు. అసలు మతాలన్నీ ఇంతే ఓ పేద్ద confusion. దేవుడన్నింట వుంటాడంటూనే మళ్ళీ పవిత్ర స్థలాలంటారు. జనాల్ని నీతివర్తనులుగా చెయ్యడానికి వీళ్ళు మాత్రం నానా గడ్డి కరుస్తారు. సువార్త స్వస్థత మహాసభల్లో వాళ్ళుచేసే మోసానికీ కేరళబోర్డు చేస్తున్న మోసానికీ ఆట్టేతేడా వున్నట్లు నాకైతే అనిపించట్లేదు.
Posted by మకరజ్యోతి అయ్యప్ప దేవస్థానం సృష్టే! – మాజీ కమిషనరు పీవీ నళినాక్షిన్ | indiarrs.net Classifieds | Featured blogs from INDIA. on జనవరి 24, 2011 at 3:34 సా.
[…] https://telugillu.wordpress.com/2011/01/23/%e0%b0%ae%e0%b0%95%e0%b0%b0%e0%b0%9c%e0%b1%8d%e0%b0%af%e0%… […]
Posted by suryapradeep on మే 25, 2011 at 3:54 ఉద.
yes i agree but we have so many doubts about supreem should u explain abt that is know a any site..fr discussion pls frwd
Posted by venkatamuni sarai on అక్టోబర్ 24, 2011 at 7:31 ఉద.
mathamu demudu nammakam viswasam kavali adi lenappudu manisiki santhi santosamu vundadu
Posted by Praveen Sarma on అక్టోబర్ 24, 2011 at 10:22 ఉద.
>>>>>
అయితే దానికి సంబంధించిన ఖర్చుల్ని మాత్రం దేవస్థానం ఖాతాలో ఎన్నడూ నమోదు చేయలేదని వివరించారు.
>>>>>
ఖర్చుల్ని దేవస్థానం ఖాతాలో నమోదు చేస్తే ఎంత ఖర్చు పెట్టారు, ఎంత సొంత జేబులో వేసుకున్నారు లాంటి విషయాలు తెలుస్తాయి. కనుక దేవస్థానం ఖాతాలో నమోదు చెయ్యరు.