పదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల అవినీతి : పాత్రికేయుడు పాలగుమ్మి


గడచిన పది సంవత్సరాల్లో దేశంలో రూ. 10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ విశ్లేషించారు. కడప జిల్లా పరిషత్తు సమావేశ భవనంలో పిఎఫ్‌ఐ, ఐసిఇయు, ఎపిఎంఎస్‌ఆర్‌యు, యుటిఎఫ్‌, జెవివి గురువారం సంయుక్తంగా నిర్వహించిన ‘రాజకీయాల్లో అవినీతి – ధన ప్రాబల్యం’ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ సంసదను కార్పొరేట్‌ సంస్థలు, అవినీతి పరులైన రాజకీయ నాయకులు కలిసి దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమానికి నిధులు లేవంటున్న ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు మాత్రం కోట్లాది రూపాయలు రాయితీలుగా ఇస్తున్నాయని తప్పుపట్టారు. ప్రపంచ కుబేరుల్లో మనదేశం నాలుగో స్థానంలో ఉండగా, మానవాభివృద్ధిలో 134వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 53 మంది ధనికుల వద్ద దేశ తలసరి ఆదాయంలో 1/3 వంతు సంపద పోగుబడుతోందని తెలిపారు. స్విస్‌ బ్యాంకుల్లో రూ. 20 లక్షల కోట్ల భారతదేశ ధనం మూలుగుతోందని వివరించారు. స్విస్‌ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారి ఖాతాలు తెలియవని మొదట ప్రకటించిన ప్రణబ్‌, తర్వాత మాట మార్చి వారి పేర్లు ఉన్నాయని చెప్పటంలో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దొంగలెవరో తెలిసినా చెప్పలేమని ప్రణబ్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. స్విస్‌ బ్యాంకుల్లో దాచిన అవినీతి ధనం 2-జి స్కాం కన్నా పది రెట్లు అధికమని విశ్లేషించారు.
ప్రభుత్వం సృష్టించిన వివిధ కారణాలతో 1995 నుంచీ ఇప్పటి వరకు మహారాష్ట్రలోని విదర్భలో 45 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. 2003లో ఎకరా పత్తి సాగుకు ఐదు వేల రూపాయలు సరిపోగా, ఇప్పుడు 24 వేల రూపాయలు పెట్టాల్సి వస్తోందని చెప్పారు. దిగుబడి మాత్రం నాలుగు క్వింటాళ్లే వస్తోందన్నారు. ఈ లెక్కన రైతుకు ఎనిమిది వేల రూపాయల దాకా నష్టం వస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 1995 నుంచి ఇప్పటి వరకూ 2.56 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే 30 వేల మంది చనిపోయారని గుర్తుచేశారు. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయన్నారు. 2008 నుంచీ ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు.

3 వ్యాఖ్యలు

 1. Thank you for the information.
  This is a known issue. Even ordinary people (illiterate villagers or Tribals) know this.

  India needs solutions now. Even that Italian and PM are with holding the names (from public and Supreme Court) of peoples who stashed money in Swiss Banks.

  If the PM and that Italian (all powerful person who is ruling India with Iron fist) can do that, who can save the country?

  స్పందించండి

 2. డబ్బుతో ఎన్నికలలో నెగ్గుకుని రావచ్చు అన్న ధీమా వున్నంత కాలం రాజకీయనాయకుడు అక్రమ సంపాదనకు అధికారాన్ని వుపయోగించుకుంటూనే వుంటాడు.
  సంపాదనతో రాజకీయాలను కొనగలం అన్న ధీమా వున్నంత కాలం వ్యాపారవర్గాలు ఆ డబ్బు పోగేస్తూనే వుంటారు. అవకాశం వున్నంత మేరకు పన్నులు ఎగవేయటానికి కారణం పన్ను ఎగవేత దారులకు కఠిన శిక్షలు వేయించే సంకల్పం ధైర్య౦ రాజకీయపక్షాలకు వుండదు. వారు ఆ అదాయవర్గాల వారీ నుంచీ విరాళాల రూపంలో గడ్డి కరిచి వుంటారు కనక.జనంలో కూడా ఎన్నికలలో గానీ ,సాధారణ సమయాలలో లో గానీ చిన్న చిన్న లాభాలకు కూడా ప్రలోభ పడే మనస్తత్వం పెరిగి పోవడం ఆందోళన కలిగించే విషయం. ఎన్ని లక్షల కోట్లు అక్రమమార్గాల ద్వారా ఆర్జించారని ఎంత ప్రచారం చేసిన సాధారణ వోటరు మీద చివరికి ప్రభావం చూపించేవి ఇవేవీ కానే కాదు.తన కూడు గుడ్డ కొంప ను తప్ప మరి దేనినీ అతగాడు పట్టించుకోడు.ఈ సంగతి తెలుసుకున్న వారు ఎన్నికల ముందు వోటరు దేవుడిని సంతృప్తి పరచటానికి ఏదో నైవేద్యమ్ లాంటిది పెట్టుకుంటాడు.చాలా కాలం అధికారం లో వున్నందు వల్ల జనంతో సంబంధాలు పోగొట్టుకున్న వాళ్ళు ఈ తెలిసిన పాత విషయాలనే మార్చి పోయి ఓడిపోతారు.ఈ అవినీతి డబ్బు లెక్కలు అన్నీ మేధావి వర్గాల వారు విని గుండె జబ్బులు తెచ్చుకోవటానికి తప్ప మరి దేనికీ పనికి రావు.ఇది నేను నిరాశావాదం తో చెబుతున్న మాట కాదు.వాస్తవాలను గమనించి అనుకుంటున్నది.

  స్పందించండి

 3. వ్యాప్తిన్ జెందక,వగవక,
  ప్రాప్తించినలేశమైన పదివేలనిచున్
  దృప్తింజెందని మనుజుఁడు
  సప్త ద్వీపములనైనఁ జక్కంబడునే?

  — పోతన భాగవతం అష్టమ స్కంధము ౫౭౩

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: