కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి విముక్తి పొందేందుకుగాను తాను సజీవ సమాధి అయ్యేందుకు అవకాశం కల్పించాలని విశాఖజిల్లా చోడవరం మండలం పిఎస్‌పేటకు చెందిన శతాధిక వృద్ధురాలు మజ్జి దేముడమ్మ (110) జిల్లా కలెక్టరుకు విన్నవించింది. దీంతో కలెక్టరు ఆదేశాల మేరకు చోడవరం తహశీల్దారు జి తాతబ్బాయి, ఎస్‌ఐ గఫూర్ ఆమె వద్దకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. పిఎస్‌పేటకు చెందిన దేముడమ్మ భర్త బాపునాయుడు 40 ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె ఆస్తులన్నింటినీ ఆమె మనవడు మజ్జి రామకృష్ణ గతంలోనే స్వాధీనం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంటిని కూడా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్నాడు. ఆమె నివసిస్తున్న ఇంటికి విద్యుత్తును కూడా నిలిపేయించాడు. తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులను మిగతా కుటుంబ సభ్యులు కాజేశారని ఆమె కన్నీటి పర్యంతమయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు సజీవ సమాధికి అనుమతించాలని దేముడమ్మ కోరింది. ఇంటి ప్రాంగణంలో సమాధిని కూడా సిద్ధం చేసుకున్నానని ఆమె వారికి చూపింది. ఇదీ నేటి భారతం
27 జన
Posted by sagar on జనవరి 27, 2011 at 7:37 సా.
Would you please post the contact details for monitory help to మజ్జి దేముడమ్మ if any.
Posted by తెలుగిల్లు on జనవరి 28, 2011 at 12:14 సా.
సాగర్ గారు,
విశాఖ లో వుండే చౌడమ్మ మనమరాలు జగదీశ్వరి (ఫోను …9440677964) తో మీరు సంప్రదించవచ్చు
Posted by krishna on జనవరి 28, 2011 at 7:20 ఉద.
అప్పుడెప్పుడో ఇంకొల్లు నుండి ఒంగోలు ఎర్ర బస్సులో ఎక్కించారు, ఒంగోలు శివార్లు వరకూ తీసుకెళ్లారు. ఆ తర్వాత బస్సుకు పంచర్ అయ్యినట్లుంది.
ఇలాంటివి మీరు కాకపోతే ఇంకొకరు, ఇంకేదన్నా పేపర్లోనో వేస్తారు, కాకపోతే ఆ ఇంకొల్లు/అద్దంకి ప్రాంత మాండలికంలో ఆ రైతులు గురించి (కొంచం పండే వడ్లు, ఎక్కువగా పురుగు మందులు తాగించే పత్తి, పొగాకులు, కాస్త జొన్న గట్రా లు, ఒంగోలు ఆవులు, బ్యారన్లు, రైసు మిల్లులు, కిరాణా కొట్లు, ఎండాకాల్మ్ వస్తే మంచినీళ్ల కోసం అగ చాట్లు, నకిలీ పురుగు మందులు, పాసు పుస్తకాల కోసం పుస్తెలు అమ్ముకోవాల్సి రావల్సిన రోజులు గట్రా ) ఇంకెవరు వ్రాస్తారు? దయచేసి మీ energy ని ఆ వేపు మళ్లించండి. మరో గుండ్లకమ్మ కథలు లాంటి కథలు తయారు అవుతాయి, అందులో అనుమానాలు పెట్టుకోవద్దు.
Posted by వజ్రం on జనవరి 28, 2011 at 11:11 ఉద.
Address available within the post.
Majji Demudamma,
P.S.Peta,
Chodavaram ( Mandal )
Visakha ( District )
Andhra Pradesh.
Posted by వజ్రం on జనవరి 28, 2011 at 11:12 ఉద.
Address available within the post.
Majji Demudamma,
w/o Late Bapu naidu
P.S.Peta,
Chodavaram ( Mandal )
Visakha ( District )
Andhra Pradesh.
Posted by వజ్రం on జనవరి 28, 2011 at 11:13 ఉద.
@Sagar
Address available within the post.
Majji Demudamma,
w/o Late Bapu naidu
P.S.Peta,
Chodavaram ( Mandal )
Visakha ( District )
Andhra Pradesh.
Posted by niranjankarlapalem on జనవరి 28, 2011 at 5:26 సా.
manavtvam maruguna padi potunnadi.
GALIB anane annadu kada “narudu narudauta dushkaramu summu”.