ఇచ్చట తెలుగు వార్తా ఛానళ్లు కొనబడును… అయితే, ష్‌ష్‌ష్‌ష్‌ అంతా రహస్యం

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంది సొమ్మును అడ్డంగా దోచేసిన వైఎస్‌ తనయుడు జగన్మోహనరెడ్డి తానే గద్దెనెక్కేందుకు అన్ని మార్గాల్లోనూ వేటాడుతున్నాడు. ప్రధానంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు శతవిధాలా సొమ్ము వెదజల్లుతున్నాడు. తన సాక్షి పత్రికనూ, టీవీని జగన్మోహకరించిందిగాక, పాక్షికంగా అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రసార మాధ్యమాలను కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు మూడు వార్తా ఛానళ్లను 50 శాతానికి కొద్దిగా అటూఇటూగా బినామీ పేర్లతో కొనుగోలు చేసేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన నరేంద్రనాథ్‌ చౌదరి సంస్థాపిత ఎన్‌ టీలో 49 శాతాన్నీ, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అన్న ఐదు అత్యవసరాలు అందరికీ అందించే ధ్యేయం తమదంటూ పురుడుపోసుకున్న టీవీ-5లో  42 శాతం,  టీవీ-9 పాత్రికేయులతో చిన్నపాటి సమరభేరి మోగించిన  ఓ విద్యా వ్యాపారి రాజు భావోద్వేగ ఫలితంగా ఉద్భవించిన ఐ న్యూస్‌లో 51 శాతాన్ని యువనేత కొనుగోలు చేసినట్లు జగన్మోహనరెడ్డి శిబిరంలో పనిచేస్తోన్న ఒకరు ఉప్పందించాడు.

ఈ మూడు ఛానళ్లు ఇక సాక్షి స్థాయిలో ఏకపక్షంగా జగన్మోహన చాలీసాలను అదే పనిగా భజనచేయకపోవచ్చేమోగానీ వ్యతిరేకంగా మాత్రం నోరు విప్పబోవు. అయితే ఈ ఛానళ్ల ద్వారా ప్రత్యర్థులను దొంగ దెబ్బ తీసేందుకు జగన్మోహనుడి శిబిరం ప్రణాళిక రూపొందించుకున్నట్లు మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్మోహనుడి శిబిరంలోకి చేరిపోయిన మూడు ఛానళ్లూ తొలి నుంచీ అంతో ఇంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దొడ్డిలోనే ఉండేవి. కాకపోతే ఇప్పుడు పూర్తిగా జగన్మోహన రాగాన్ని ఆలపించేందుకుగాను సొమ్ముల్ని దక్కించుకుని నీకో సగం – నాకో సగం అంటూ పాడబోతున్నాయి. అంటే ఈ ఛానళ్లు ఇక సోనియా వ్యతిరేక, నకికురె వ్యతిరేక, తెదేపా వ్యతిరేక ఆలాపనలకు వేదికలు అవనున్నాయి. ఇక ఆ తరహా ఆలాపాలు వినాలో? వినకూడదో? నిర్ణయించుకోవలసింది మాత్రం వీక్షకులే.

5 వ్యాఖ్యలు

  1. Posted by ఒక పాఠకుడు on ఫిబ్రవరి 28, 2011 at 11:18 ఉద.

    మరి ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రోహన రాగం ఎప్పుడాపేస్తాయంటారు?
    టీవీ-9 సోనియోహన, కికురోహన రాగాన్నో?
    తెలంగాణ గుండెచప్పుడు రాజ్‌ న్యూస్‌ ఈ జన్మలో కేసీఆరోరాహన రాగాన్ని తప్ప వేరేదేం ఆలాపిస్తుంది అంటారు?

    ప్రతీ చానలూ అంతో ఇంతో ఎవడికో ఒకడికి భజన చేస్తుందన్న విషయం సగటు మనిషిని నాకేతెలిసినప్పుడు, ప్రముఖ పాత్రికేయులు, విఙ్ఞులు పెద్దవారు మీరు కేవలం జగన్‌ పెట్టుబడులున్న చానల్స్‌ ని ఫోకస్‌ చేస్తూ రాయడం ఏం పద్ధతి సుబ్బారావు గారూ!
    పెద్దవారు మీకిది తగునా?

    స్పందించండి

  2. జగన్ చచ్చిన దేముని బిడ్డ, దేముడు ఇచ్చిన డబ్బులుతో ఎన్ని చాన్నెల్స్ కావాలంటే అన్ని చాన్నెల్స్ కొనుక్కొన్ని, ఎన్ని సువార్తలు కావాలంటే అన్ని సువార్తలు వెలిబుచ్చుతారు, దాని మీద ఎవరూ ఏమీ వ్రాయకూడదు 🙂

    స్పందించండి

  3. మొదటి కామెంట్ వ్రాసిన పాఠకుడు అడిగిన ప్రశ్నే నేనూ అడుగుతున్నాను. చంద్రబాబుకు అజెండా సెట్ చెయ్యడం, పచ్చదేశానికి భాజాలు భజంతీలు మోగించడం, తన వ్యూస్ తప్ప, న్యూస్ వ్రాయని వారిగురించి అస్సలు గుర్తుండదబ్బా.
    సడెన్ గా అందరికీ జగన్,ఆయన పత్రికలు,వ్యాపారాలు అందులో నీతి నిజాయితీలు, లక్షకోట్లు(ఈ ముక్క మొదలెట్టినోడిని అదేదో సినిమాలో చూపించినట్లు, లక్షకోట్లు చూపించిందాకా తన్నాలి) నిద్రలోకూడా గురొస్తున్నట్లున్నాయి.
    మొత్తం అక్రమసంపాదనంతా తీసుకెళ్ళి వేరేదేశాల్లో పెట్టి, యికనాగురించి ఎవరికీ తెలియదులే అని అవినీతిగురించి గొంతుచించుకునే నాయుడూ, పొద్దునలేస్తే నీకు సింగపూర్, మలేశియాలో ఎంపనో చెప్తావా?

    స్పందించండి

  4. NTV నిజానికి కొంత కాలం క్రిందటి దాక కాస్త బాగుండేది.ఈ మధ్యలో అదీ ఎందుకో ఇలాగయి పోయిందని అనుకుంటున్నాను.అదన్నమాట అసలు కారణం.సమాజం కోసం ఏమేమో చేస్తామని బడాయిలు కొడుతూ సమాచార మాధ్యమాలను ప్రారంభించే ఈ ఉత్త్తర కుమార సంతతి తీరా గోగ్రహణాలనెదిరించి యుద్ద్డం చేయవలసిన వేళకి తమ అమ్ముల పొదిని అమ్మేసుకుంటున్నారు.మీరు ఎవరైనా జగన్ మోహన్ రెడ్డిని గురించి విమర్శ చేయండి ..వెంటనే అయన వీరాభిమానులు ఏ ఈనాడు, ఆంధ్రజ్యోతి పేరులో తీసుకొచ్చి ఎదురు దాడికి దిగుతారు.నిజానికి వారు అంతా పరిశుద్దులు అని చెప్పటం లేదు కానీ ..వున్నంతలో ఏదో కాస్త జనం గురించి ఆలోచించే వాళ్ళు అప్పుడప్పుడన్నా కొన్ని కొన్ని నిజాలు బయట పెడుతుంటారు .సాక్షి పేపరు పెట్టినప్పుడువై ఎస్సార్ అన్న మాటలు ఇప్పటికి గుర్తుకొస్తున్నాయి …సమాచార విభాగాన్ని ఎలా నడపాలో సాక్షి ని చూసి నడుచుకోండి ! అన్నాడు. హా హా హా ఇదండి పత్రికలని టి వి లని నడిపే తిరు..అందరూ ఆ ఐడియాల నుంచి నేర్చుకోవాలి కాబోలు!

    స్పందించండి

  5. Posted by పండు on మార్చి 1, 2011 at 3:44 సా.

    హనుమంతరావుగారూ,
    జగన్ అనగానే మీరంతా పరిగెత్తుకురావట్లా? మేమూ అంతే. మేమేదో సామాన్య జనాలం. మీరు మీడియా వారు కదా, యిన్ని రోజుల్లో రా.రా(రామోజీ రావు) గురించి కానీ, ఆయనచేసిన(చెయ్యని అని మీ అభిప్రాయం అయ్యుండొచ్చు.. మనం న్యాయనిర్ణేతలం కాదు కాబట్టి అది వదిలేద్దాం) అన్యయాలగురించి కానీ, నాయుడు అవినీతిగురించి కానీ మీరు వెలికితీసి జనాల కళ్ళు తెరిపించిన వ్యాసాలేమైనా వుంటే యివ్వండి, చదివి మాట్లాడదాం.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: