మళ్లీ నిరుద్యోగ లోకంలోకి….

అవును, నేను మరోమారు నిరుద్యోగ లోకంలోకి దూకాను. 2011 మార్చి 15న నేను పనిచేస్తోన్న సంస్థతో బంధుత్వం తెంచుకున్నాను. ఆ సంస్థలో 2010 సెప్టెంబరులో రెండోమారు చేరాను. మొదటిసారి 2001 ఫిబ్రవరిలో ఒంగోలు కేంద్రంలో చేరిన నేను దాదాపు ఎనిమిదన్నరేళ్లపాటు అందులో పనిచేశాను. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌లో సేవలమ్ముకున్నాను. ఆ సంస్థలో కొందరి సహచరుల పని విధానం నచ్చక బయటపడ్డాను. అనంతరం ఆంధ్రజ్యోతిలో సీనియర్‌ సబ్‌ఎడిటర్‌గా ఆరు నెలలపాటు పనిచేశాను. మా టీవీలో న్యూస్‌ కో-ఆర్డినేటర్‌గా అవకాశం వచ్చింది. ఓ ఏడాది గడిచిందో లేదో మళ్లీ నాకు బతుకు గండం ఏర్పడింది. మాటీవీ యాజమాన్య భాగస్వామి చిరంజీవి రాజకీయాల్లో చేరటంతో వార్తా విభాగానికి చావొచ్చిపడింది. అందులో భాగస్వాములయిన అక్కినేని నాగార్జున, మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌కు కాంగ్రెసుపార్టీతో ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా చిరంజీవికి అనుకూల వార్తల్ని ప్రసారం చేయటం వారికి ఇబ్బందిగా మారింది. దీంతో వార్తల విభాగం గొంతు నొక్కేసి ఉద్యోగుల్ని వీధులపాలు చేశారు. అలా సరళీకృత విధానాలకు నేను కూడా బలయ్యాను. ప్రజారాజ్యం పాడుగానూ అంటూ ఆనాడు సిబ్బంది పెట్టిన శాపాలు రెండేళ్లకు ప్రాణం పోసుకున్నట్లుంది. చావు పేగు మెడలో వేసుకుని పుట్టిన ప్రజారాజ్యం తనకు తానే ఉరేసుకుని ఉసురు తీసుకుంది. తర్వాత కొంతకాలం యథావిథిగా నిరుద్యోగం. కొందరు మిత్రుల ప్రభావంతో రెండోమారు నా మాతృ సంస్థ అనదగిన ఆ పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా చేరాను. వాస్తవానికి పూలమ్మిన చోటే కట్టెలమ్మేందుకు సిద్ధపడ్డాను. అది నా గొప్పతనమూ కాదు, చేతగాని తనం అంతకన్నా కాదు. మార్క్సిజం నాపై చూపించిన ప్రభావంరీత్యా మనస్సును అదుపులో పెట్టుకున్నాను. మా టీవీలో నేను తీసుకున్న జీతంలో మూడో వంతు తీసుకుంటూ పనిచేశాను. అదే సంస్థలో మొఫిసిల్‌ డెస్క్‌ ఇన్‌ఛార్జిగా పనిచేసిన నేను అదే విభాగంలో సాధారణ ఉప సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. అయితే సంతృప్తిగా పనిచేయని మాట వాస్తవం. కారణాలు మాత్రం జీతమూ కాదు, బాధ్యతలూ కాదు. ఏ పనిచేసినా, ఎక్కడ చేసినా ప్రథమ స్థానంలో ఉండాలనేది నా విధానం. మేమిచ్చిన పనేదో చేసిపోతే చాలు అన్న రీతిన నా పనిపై ఆంక్షలు విధించిన ఫలితంగా ఏర్పడిన అసంతృప్తి అది. అక్కడ కేవలం ఇతరుల ఆదేశాలను పాటించటమే నా పని. ఆదేశాలు అంటే ఏదో నా కన్నా మెరుగ్గా పని చేయగలిగినవాళ్లో, బాధ్యతలరీత్యానన్నా ఉన్నతులో ఇస్తే అమలు చేసేవాడినేమోగానీ, దారినబోయే దానయ్యల పెత్తనాన్ని సహించలేకపోయాను. నా కన్నా సబ్‌ జూనియర్లు, పొట్టగోస్తే అక్షరం ముక్కరాని ఉప సంపాతకులు, అర్ధవంతంగా ఒక్క వాక్యాన్ని రాయలేని కలం వీరుల వికటాట్టహాసాలను చెవిలో వేసుకోవటం కనాకష్టమయింది. దీనికితోడు నన్ను పనిదొంగగా చిత్రించేందుకు ప్రయత్నం ప్రారంభమయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాయటం సాధ్యం కాదు. రాయటమూ అనవసరమే. అయితే నేను పనిచేసే విభాగం బాధ్యుడు నాతో మాట్లాడిన తీరును బ్లాగ్మిత్రులకు వివరించటం అవసరమని అనుకుంటున్నాను. దయచేససి ఇక్కడ మారుపేర్లు రాసేందుకు అనుమతివ్వండి.
రాజ్‌కుమార్‌ : నా సెలవు రోజయిన శుక్రవారం రాత్రి 9 గంటలకు ఫోను చేశారు.
నేను : చెప్పండి!
రాకు : ఫలానా జిల్లా నుంచి ఫలానా ఫలానా స్పెషల్‌ స్టోరీలు రెండు వచ్చాయటగదా?
నేను : ఒక్కటి మాత్రమే నాకు తెలుసు. అది అసమగ్రంగా ఉన్నందున వెనక్కి పంపాను. ఏమేమి అదనపు సమాచారం కావాలో వాళ్లకు వివరించాను సార్‌. రెండో స్టోరీ విషయం నాకు తెలియదు.
రాకు : మీరడిగిన సమాచారాన్ని అరగంటలోనే వాళ్లు పంపారట. దాన్ని జయారెడ్డి మీ ఫోల్డర్‌లో వేసి మీకు చెప్పారట కదా?
నేను : లేదండీ, ఇప్పటివరకూ నాకా విషయం తెలియదు.
రాకు : లేదండీ, మీకు చెప్పారట.
నేను : సార్‌, ఇద్దరే ఉన్నచోట వాళ్లు మాట్లాడుకున్నారో? లేదో? మాట్లాడుకున్నా ఏమి మాట్లాడుకున్నారో? సాక్ష్యం ఎక్కడ దొరుకుతుందండీ?
రాకు : లేదు, లేదండీ, సుబ్బారావుగారూ! ఆయన చెప్పకుండా, చెప్పానని చెప్పడండీ.
నేను : సరేనండీ, అతనిపట్ల మీకు అంత నమ్మకం ఉంటే, ఉండనీయండి. కానీ నేను ఈ సంస్థకు పనికొస్తానో? లేదో? తేల్చి చెబితే నాకు మంచిది.
రాకు : అంతెందుకు లెండి. రేపు సమావేశం వేసుకుని చర్చించుకుందాం.
ఇదీ మా ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ. నాకు అర్ధం అయినదాన్నిబట్టి పని ఉన్నా , నేను కావాలనే చేయకుండా తప్పుకు తిరుగుతున్నానని ఆయన ఆరోపిస్తున్నట్లు భావించాను. రెండోది సమావేశాలతో ఏదీ తేలదని నా పూర్వ అనుభవం. కాకపోతే అలాంటి సమావేశాల్లో చేయని తప్పును నాతో ఒప్పించే పని జరగవచ్చు. అందువలన అన్నింటికీ తలొంచి అక్కడ పనిచేయటమా? తలొంచికుని బయటకు నడవటమా? అన్న రెండు అవకాశాలే నాకు కన్పించాయి. తలొంచి బతకటం నేను నేర్చుకోని ఓ మంచి పని. ఇక మిగిలిన పని తలొంచుకుని బద్దెనను గుర్తుచేసుకోవటమే. అన్నట్లు సుమతీ శతకకారుడు బద్దెన, మిడిమేలపు కొలువుగొలిచేకన్నా మడి దున్నుకు బతకవచ్చు మహిలో సుమతి అన్నాడు కదా.
మడి దున్నగలనో? లేదోగానీ ముందు కొలువును వీడి రాజధానిలో వీధినపడ్డాను.

19 వ్యాఖ్యలు

  1. Posted by నైమిష్ on మార్చి 25, 2011 at 11:00 ఉద.

    సుబ్బారావు గారు మీరు చాలా మంచిపని చేశారు..మీరు నమ్ముకున్న ధర్మాన్ని పాటించండి..ధర్మో రక్షతి రక్షిత హః ..మీకు త్వరలో మరో మంచి అవకాశం వస్తుందని ఆశిస్తూ..

    స్పందించండి

  2. Posted by Malakpet Rowdy on మార్చి 25, 2011 at 1:26 సా.

    Yeah, its tough to work where there is no recognition. I think you did what you needed to do, I’m sure you’ll land up with something much better. All the best and let us bloggers know if we can be of any help.

    స్పందించండి

  3. “adaptability and flexibility” is the key in any job situation. Think from other peoples perspective, why they behave that way, not in a way that you think.

    Best of luck!.

    స్పందించండి

  4. నేనూ మారు పేరు వుపయోగిస్తాను, ఏమనుకోకండి.

    సుబ్బారావుగారు,
    నది మధ్యన పడవనుంచి జంప్ అవకూడదు. వాళ్ళే తోసే దాకా ఓపిక పట్టాలి, ఇంతలో ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. ఆసరా దొరికాక, ‘రాకింగ్ బాసు, మీదగ్గర పని చేయడం అద్భుతమైన అనుభవం, తాపీగా గోళ్ళుగిల్లుకుంటున్నా జీతం ఇచ్చేవారు. ఆ బ్రతుకు బోర్ కొట్టింది, కొన్నాళ్ళు పని చేద్దామని బయటకు వెళుతున్నా. మీరు అప్పుడప్పుడు పని చేస్తూ వుండండి లేదా కొలెస్టరాల్ పెరిగిపోతుంది, ఆరోగ్యం జాగర్త, సెలవూ అని రాజీనామా హెచ్.ఆర్ కి ఇవ్వాలి. తరువాత కొన్నాళ్ళకి వెంకట్రావు మిమ్మల్ని కలిసి ఓ ఉద్యోగం చూపమని ప్రాధేయపడతాడు. 🙂

    మీకు ఓ మంచి ఉద్యోగం దొరుకుతుందని ఆసిస్తున్నా, ధైర్యంగా వుండండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తనలో కాస్త మార్పు కనిపించవచ్చు, ఆస్వాదించండి.

    స్పందించండి

  5. ఉందిలే మంచికాలం ముందు..ముందునా..అందరూ సుఖపడతారు..నంద..నందనా/సంతోషించండి మీరు ఆత్మసాక్షిని తాకట్టుపెట్టుకోకుండా..రైట్ రాయల్గా బయటకొచ్చారు.

    స్పందించండి

  6. @SNKR మాటే నాదీను సుబ్బారావు గారు. మీరు వెరే ది వెతుక్కొని మానేస్తే బాగుండేదేమో, కాకపోతే అప్పటివరకూ రాజీ పడటానికి మనసు ఒప్పుకొని పోయి ఉండవచ్చు. అయినది ఎదో అయ్యింది, మీకు త్వరలోనె మంచి ఉద్యోగం వస్తూందని ఆశిస్తున్న. తోటి వారిగా మేమేమయినా సహాయం చేయగలమెమో చెప్పండి.

    ఉచిత సలహా అనుకోకపోతే ఓ మాట, ఇంకొల్లు ఆ చుట్టుప్రక్కల్ల ఎటూ మంచి స్కూల్స్ ఉన్నట్లు లేవు, ఏదయినా కాన్వెంట్ లాంటిది సొంతగా పెట్టుకొనే ఆలోచన ఎలా ఉంటుందో ఆలోచించండి.

    స్పందించండి

  7. హ్మ్ ! గౌరవం లేని చోట పని చేయటం కష్టమే , మీకు ఓ మంచి ఉద్యోగం దొరుకుతుందని ఆశిస్తున్నాను !

    స్పందించండి

  8. Posted by pratyaksha saakshi on మార్చి 26, 2011 at 12:48 సా.

    మీరు రాసినవి అక్షర సత్యాలు సుబ్బారావు గారూ. అక్షరం ముక్క రాని ఆ ఇంచార్జీలు అక్కడే బతకగలరు. ఇంకెక్కడా దమ్మిడీకి పనికిరారు.

    స్పందించండి

  9. Wish you all the best sir.

    స్పందించండి

  10. Sorry to read that.
    Wish you all the best. I am sure you will find employment in line with your capabilities.

    స్పందించండి

  11. sir.
    what is going on u r old Marxism party paper.
    where is going that Marxism.
    in that paper all high position employees sorry actvists should remove. like TD, MD, JS heads and also main head of paper.

    స్పందించండి

  12. మార్క్సిస్ట్ పత్రిక సవ్యంగానే వుంది . కావూరి లాంటి అపసవ్య వ్యక్తులే అభాండాలు వేస్తున్నారు . అది అటు మార్క్సిస్ట్ పార్టీ కి గాని ఇటు మార్క్సిస్ట్ పత్రికకు గాని కొత్త గాదు. మిడిమిడి ప్రావిన్యంతో తామే గోప్పోల్లమని బీరాలు పలికే కావురీలకు , నిజమే ఆ పత్రిక సరి కాదు . దారి తప్పి వెళ్ళిన అతగాడిని ..మళ్ళీ అక్కున చేర్చుకున్న ఆ పత్రిక పైనా , అందులో కష్టాలు (వ్యక్తిగత ) దిగమింగుకొని ప్రజల పక్షాన పనిచేస్తున్న వారి పైన నిందలు వేయడమంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే అవుతుంది . ‘ అసంతృప్తి’తో పని చేసానని స్వయంగా వెళ్ళగక్కిన కావూరి ..మల్లి ఆ పత్రిక గడప తోక్కరుగా !

    స్పందించండి

    • మార్క్సిస్ట్ పత్రిక సవ్యంగానే వుంది – నేను కాదన్నట్లుగా మీకు కల ఏమయినా వచ్చిందా సారూ.?? నేను మీకు తెలియదు .. అయినా నా అపసవ్యతను మీరు ఏ అంజనం వేసి కనిపెట్టారో వెల్లడిస్తే హేతువాదులకు బుధ్ధివస్తుంది. ప్రావిన్యంతో తామే గోప్పోల్లమని – కావురీలకు , మల్లి, తోక్కరుగా …. నా ప్రావీణ్యం మాటేమోగానీ మీ ప్రావీణ్యం ఇక్కడ దర్శన మిస్తోందిలే. దారి తప్పి వెళ్ళిన అతగాడిని …. ఓ, మీరు చెంచాగాడన్నమాట. కస్టాలు, దిగమింగుకొని నిందలు …. చ _ ఉమ్మి ఎవరు వేసినా ఆకాశం మీద వేయాల్సిందే. ఆకాశం అంటే తెలుసుకొండి శ్రీ. గడప తోక్క వ ద్దనటానికి అదేమీ మీ తాత సొమ్ము కాదు.

      స్పందించండి

  13. sri… meeru bramallo vunnaremo chusukondi avi tolaginchukokunte alage bramallo migilipotaru
    miku kali vunte o ten days vachi hydeabad loni aa paper officelo gadipi vellandi akkada paristiti yenta darunamga vundo thelisi poddi
    melanti party manushulu antha tindi mani paisa paisa prajala nunchi vasulu chesi pampithe ekada veellu chestunna nirvakam yemito meeko bodapadutundi
    ayana cheppindi kuda marxist partyni kadu aa chettu peru cheppudkuni kayalu kadu kadu modalune ammukuntunna patrikaloni donga pedda manushula gurinche
    mundu danni guurtinchandi
    mh bhavanlo vunna dongala mutanu chudandi vari chestalu chusi kallu teravandi leka pothe meeku aa malinam antakunda podu……..

    స్పందించండి

  14. Posted by bujji on మే 10, 2011 at 2:38 సా.

    kavuri garu manchi pani chesarandi. mila dyryam leka memanta vallu anna matalaku tala vanchukuni vachesamu. kani miru ala kakunda variki tagina samadanam cheppi vachi nanduku chala santosamga undi. vallaku mi matalu saripovu inka variki telusukovalsina visayalu chala unnai ika mundaina gurtinchi mi lanti vallanu pogottu kokunda untarani asaistu..

    స్పందించండి

  15. Posted by aamani on మే 13, 2011 at 6:49 ఉద.

    గతంలోనూ ఇలాంటి సమస్యలు ఉండేవి. ఇక ముందూ ఉంటాయి. మన పార్టీ చెప్పింది అదే కదా! సమస్యలు లేకఁండా అంతా చక్కగా నడిచిపోతే ఇంకే.. అందుకే అంతర్గత పోరాటం జరపాలి. అంతేకానీ అలా వెళ్లిపోతే ఎలా? వ్యకఁ్తలకఁ పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వదు. మనం కూడా అంతే కదా! వ్యకఁ్తల కోసం కాదు మనం పఁచేసేది. పార్టీ కోసం. దాఁ లక్ష్యం కోసం.. అలాంటప్పుడు ఎఁ్న ఆటుపోటులు వచ్చిన అక్కడే ఉండి ఎదుర్కోవాలి. కొన్నేళ్లుగా అలాంటిది జరుగుతున్న దాఖలాలు ఉండటం లేదు. అంతర్గత పోరు చేయడాఁకి సిద్ధపడటం లేదు. ఎందుకలా? అలా చేయకఁండా.. ఁలబడకఁండా పోతే నష్టపోయేది ఎవరు? పార్టీ కాదా? దెబ్బతినేది దాఁ లక్ష్యం కాదంటారా? అల్టిమేట్‌గా లాభపడేది కొందరు స్వార్థపరులు. మన లక్ష్యాఁ్న, పార్టీఁ ఎవరైతే దెబ్బతీయాలనుకఁంటున్నారో వాళ్లే… ఁజమా? కాదా?

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: