కర్నాటక గనుల వివాదంలో దేశ వ్యాపితంగా ప్రచారం పొందిన గాలి సోదరుల్లో ఒకరైన కర్నాటక పర్యాటక, మౌలిక సదుపాయాల మంత్రి గాలి జనార్ధనరెడ్డి కూర్చొనే కుర్చీ విలువ ఊహకే అందనిదిగా ఉంది. పూర్తిగా బంగారంతో చేసిన రూ.2.2 కోట్ల విలువైన కుర్చీలో గాలి ఆశీనులవుతారు. పూజకు ఉపయోగించే దేవతా విగ్రహాల విలువ రూ.2.58 కోట్లు. ఇక ఆయన ధరించే బెల్టు ఖరీదే రూ.13.15 లక్షలు. ఆయన ఇంటిలో ఏ వస్తువును ముట్టుకున్నా ధగ ధగ మెరిసే బంగారమే. గ్లాసులు, పళ్లాలు గిన్నెలు, స్పూన్లు, ఫోర్కులు తదితరాలన్నిటి విలువ రూ.20.87 లక్షలు. ఇతరులెవరో చెప్పిన మాటలు కావివి. కర్నాటక లోకాయుక్తకు 2010జూన్‌లో సమర్పించిన నివేదికలో గాలి జనార్థన్ రెడ్డి ఈ వివరాలను సమర్పించారు. మూడు పేజీలకు నిండిపోయిన వజ్రవైఢూర్యాల ఆభరణాల చిట్టా కోట్ల విలువ చేస్తుంది. బంగారు గాజులకు కొదవే లేదు. ఇక వజ్రాలు పొదిగిన నెక్లెస్‌లు, చెవిదుద్దులు, పురుషులు ధరించే ఆభరణాలు చేతి ఉంగరాలు, దేవతల విగ్రహాలు అన్నీ బంగారంతో చేసినవే. ఇక వెండి వస్తువుల సంగతి కొస్తే టేబులు మీద అమరికకు, పూజకు ఉపయోగించే వెండి వస్తువుల విలువ లక్షల్లో ఉంటుంది. గృహోపకరణాలు, ఫర్నిచర్ విలువ కూడా లక్షల్లో ఉంది. వ్యవసాయ భూమి, భవనాలు, పూర్వీకుల ఆస్తులు కాక జనార్ధనరెడ్ది పేరిట ఉన్న ఆస్తి విలువ రూ. 153.49 కోట్లు. వ్యాపారాల రూపంలో లభించే ఆదాయం రూ. 18.30 కోట్లు కాగా జీతభత్యాల రూపంలో రూ. 31.54కోట్లు లభిస్తున్నట్లు గాలి చూపారు.
31 మే
Posted by కృష్ణశ్రీ on మే 31, 2011 at 3:19 సా.
మా అమ్మమ్మలాగే వాళ్లమ్మమ్మ కూడా “హారి నీయిల్లు బంగారం గానూ!” అని దీవించేసివుంటుంది వాణ్ని!
యెటొచ్చీ, ఆ సమయంలో ఆ దేవతలెవరో “తథాస్తు” అనేసి వుంటారు….మనకెవరూ అనలేదు….అంతే తేడా.
లక్కీ ఫెలో!
Posted by తెలుగిల్లు on జూన్ 1, 2011 at 6:27 ఉద.
భలే భలే చెప్పారు శ్రీ గారూ