ఈప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే అయితే ఇందరు దేవుళ్లు, దేవతలు ఎందుకు ఉన్నారు? ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? మనం ఎవరినైనా ఈ ప్రశ్నలడిగితే సాధారణంగా వచ్చే సమాధానం ఒకటే. ”దారులు వేరైనా గమ్యం ఒక్కటే, దేవుడిని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటారు. ఒక్కో పద్ధతిలో ఆరాధిస్తారు. అందుకు వేరువేరు మతాలు, వేరువేరు దేవుళ్లు, దేవతలు. నిజానికి దేవుడొక్కడే.” ఇటువంటి సమాధానాలు పైకి చాలా బాగుంటాయి. కాని ఇవి అసలు ప్రశ్నకు సమాధానం ఎంతమాత్రమూ కావు. ఒక సూర్యుడు అందరికీ ఒకేలా కనపడ తాడు. ఒక మాట అందరికీ ఒకేలా వినపడు తుంది. మరి ఒక్క దేవుడు మాత్రం అందిరికీ ఒకేలా ఎందుకుండడు? ఎందుకుఉండడంటే దేవుడు అనేది వాస్తవం కాదు. కేవలం మన ఊహ. వాస్తవాన్ని మనం తెలుసుకోగలిగితే అందరికీ ఒకేలా అర్థమవుతుంది.వాస్తవం కానిది ఊహించు కోవలిసి వస్తే ఒక్కొక్కరికీ ఒక్కోలా అర్ధమవు తుంది.
మనుషులకు కష్టాలొచ్చినపుడూ, సమస్యలు ఎదురై వాటిని అధిగమించలేకపోతున్నపుడూ దేవుడు గుర్తుకొస్తాడు. అంతే తప్ప మామూలుగా గుర్తుకు రాడు. భక్తి ఉద్యమంపై వ్యాసంలో (గత నెల వ్యాసంలో) ఈ అంశాన్ని ప్రస్తావిం చాను. భౌతిక వాదులు సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురైనపుడు వాటికి గల కారణా లను అన్వేషించి పరిష్కరం కోసం, వాటిని అధిగమించడం కోసం ప్రయత్నిస్తారు. అదే భావవాదులైతే సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు లేని పరిస్థితి రావాలని కోరు కుంటారు. కష్టాలు ఎందుకు వచ్చాయో వాటి మూల కార ణం ఏమిటో పరిష్కారం ఏమిటో భావ వాదులకు అక్కరలేదు. పరిష్కరం అయిపోతే చాలు. పరిష్కా రం సంగతి చూసుకోవలసినది దేవుడే. ఆ దేవుడిని ప్రార్థించడం, పూజించడం మినహా వేరు పనేమి చేయనవసరం లేదు.
భౌతికవాదులు వాస్తవపరిస్థితిని తమ ఆలోచనల్లోకి ఎక్కించుకోవడానికి ప్రయత్ని స్తారు. భావవాదులు తమ ఊహల్ని వాస్తవ ప్రపంచంపై రుద్దుతారు. ఈ ఊహలకే నమ్మకం, విశ్వాసం అన్నపేర్లు పెడతారు. ఈ ఊహల ప్రాతిపదిక పైనే మత వ్యవస్థ రూపొందుతుంది. దేవుడిని ఆరోధించే పద్ధతులూ, ఆచారాలూ దాని ఆధారంగా రూపొందుతాయి. అయితే ఊహాలు వాస్తవ ప్రపంచాన్ని మర్చలేవుగదా! కొంతకాలం పాటు ఊహల ప్రపంచంలో ఊరట పొందినప్పటికీ తాననుభవించే కష్టాలు అలానే కొనసాగుతూ వుంటే సగటు మనిషికి మళ్లీ సందేహం వస్తుంది. గజేంద్రమోక్షం (భాగ వతం) పద్యాలలో ”కలడు కలండనెడివాడు కలడో లేడో|| అన్న సందేహం ”ఉన్నావా? అసలున్నావా? ఊరికే కళ్లుముసుకు న్నావా? ఈ లోకం కుళ్లు చూడకున్నావా?” అన్న భక్త తుకారాం సందేహం ఇలాంటివే. సందేహం వచ్చిందంటే విశ్వాసం సడులుతుంది. విశ్వా సమే పునాదిగా ఉన్న మతవ్యవస్థ బలహీన పడుతుంది. అప్పుడు ఆ మతవ్యవస్థను తిరిగి బలంగా నిల బెట్టడానికి ప్రయత్నం అవసరమౌ తుంది. ఒక్కో సారి ఉన్న మతంలో సంస్కరణల ద్వారా, మరొక ప్పుడు ఏకంగా కొత్త మతాన్నే ముందుకుతేవడం ద్వారా పరిష్కారం దొరుకు తుంది. అందుకే ఇన్ని మతాలూ, ఇందరు దేవుళ్లూ మనకు కనపడుతారు. ఒకపైపు అజ్ఞానం, ఇంకోవైపు నిస్సహాయత, నిస్పృహ చుట్టముట్టగా నడిమిలో ఇరుక్కుపోయిన ప్రజలకు ఎందరు దేవుళ్లయినా చాలరు. ఎన్నిరాళ్లకు మొక్కినా సరిపోదు.
నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన సామా న్య ప్రజానీకానికి చేరువగా దేవుడిని తేడంలో భక్తి ఉద్యమం విజయం సాధించింది. వివిధ రూపాల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడి అభ్యుదయ పాత్ర పోషించింది. అయితే భక్తివల్ల ప్రజల కష్టాలు తీరవుకదా! కొత్త సమస్యలూ, కొత్త కష్టా లూ కొన్నిచోట్ల కొత్త మతానికి ఆస్కారం కల్పి స్తాయి. అలా వచ్చినదే సిక్కుమతం.
ఇది భక్తి ఉద్యమం కొనసాగింపుగా మొదలై ఒక ప్రత్యేక మతంగా రూపొందింది. 15వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ఈ మతం మొదలైంది. క్రీ.శ 1469లో తల్వాండ్ లో (ఇది లాహౌర్‌కి 80 కిలో మీటర్ల దూరంలో ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉంది) జన్మించి 1539 వరకూ జీవించిన నానక్ దీనికి ఆద్యుడు. నానక్ కాలం నాటికి భక్తి ఉద్యమం భారత ఉప ఖండంలో అనేక రూపాలలో విస్తరించింది. దేవుడి పవిత్ర నామ జపంతోనే మోక్షం లభిస్తుం దని ప్రచారం చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు కూడా రామకోటి రాసే వారిని చూస్తున్నాం. ‘రామనామ తారకం భక్తిముక్తి దాయకం’ అంటే అర్థం రాముడి పేరును పదే పదే ఉచ్ఛరిస్తే మోక్షం వస్తుంది అని. తులసీదాసు, కబీరు వంటివారు దీనిని బాగా ప్రచారం చేశారు. కబీరు ప్రచారం చేసిన సాంప్రదాయాన్నే అంది పుచ్చుకుని నానక్ తన మతాన్ని రూపొందిం చాడు. ఇస్లాం మతం నుండి భక్తి ప్రధానమైన సూఫీ మతం కూడా ఈ కాలం నాటికి ఉత్తర భారత దేశంలో ప్రచారంలో ఉంది. ఒక మంత్రాన్ని పదేపదే ఉచ్ఛరిస్తే అనుకున్నది సాధించగలమని విశ్వసించే తాంత్రిక యోగం ప్రభావం కూడా నానక్‌పై ఉన్నట్టు కనపడుతుంది.
నానక్ చెప్పిన ప్రకారం దేవుడు రూపం లేనివాడు (నిరంకార్), శాశ్వతమైన వాడు (అకల్), అనిర్వచనీయమైన వాడు (అలఖ్), సర్వవ్యాపి (సరచ్ వియాపక్). ఇంటువంటి లక్షణాలుగల భగవతుండిని తెలుసు కోవడానికీ, చేరుకోవడానికీ మానవులకు ఎంతో దయతో పలు అవకాశాలను భగవంతుడే కల్పించాడు. అయితే మానవుడు స్వభావరీత్యా భగవంతుడిని తెలుసుకోడానికి నిరాకరిస్తాడు. మానవులు తమ చుట్టూ ఉన్న దేవుడిని చూడలేని గుడ్డివాళ్లు. హిందువులు దేవాలయాల్లో చేసే పూజలుగానీ, ముస్లింలు మసీదుల్లో చేసే నమాజ్‌లు గానీ దేవుడిని చేరుకో డానికి తొడ్పడతాయని వారు నమ్ముతారు. ఇలాం టివి ఎందుకూ పనికిరావు. నిజానికి ఈ పూజలూ, నమాజ్‌లూ మానవులను చావు పుట్టుకల చక్రభ్రమణంలోనే మగ్గిపోయేలా చేస్తాయి తప్ప దానిని దాటి దేవుడిని చేరుకోడా నికి దోహద పడవు.
మానవులు తనను చేరుకోడానికి వీలుగా భగవంతుడు శబ్దరూపంలో తననుతాను తెలియ పరుచుకున్నాడు. ఈ శబ్దం గురువు ద్వారా మానవు లకు తెలియపరుస్తాడు. గురువు హృదయంలో ఈ శబ్దం దేవుని మహాత్మ్యం వలన ప్రతిధ్వనిస్తుంది. దానిని గురువు శిష్యు లకు తెలియజేస్తాడు. గురువు ద్వారా దేవుడిని తెలుసుకోగలిగిన శిష్యుడు దేవుని ఆదేశాన్ని గ్రహించగలుగుతాడు. దాన్ని గ్రహించ గలిగిన నాడు సామరస్యం ఏర్పడుతుంది. దీనికొక క్రమ శిక్షణ కావాలి. ఒక పద్ధతి ప్రకారం దైవ నామస్మరణ చేయాలి. దానికే కీర్తనం అన్నారు.
సిఖ్ అంటే అర్థం శిష్యుడు, సిక్కుమతం అని వాడుకలో మనం అంటున్నాం. కాని ఈ మతం అసలు పేరు గురు మతం. గురుద్వారా అంటే అందరూ ఒక దగ్గర కూడి సంకీర్తనం చేసేస్థితి. అమృతసర్‌లోని స్వర్ణదేవాలయం గురుద్వారాలన్నిటి లో ప్రముఖమైనది. సిక్కుల నాల్గవ గురువు అర్జున్‌దేవ్ (1563-1606) హరిమందిర్ పేరిట దీనిని తొలుత నిర్మించాడు. రాజా రంజిత్‌సింగ్ 19వ శతాబ్దంలో దీనిని స్వర్ణదేవాలయంగా అభివృద్ధిచేశాడు. నానక్ విగ్రహారాధననూ, కులవ్య వస్థనూ తీవ్రంగా వ్యతిరేకించాడు. గురుద్వారాలలో ఎక్కడా దేవుని విగ్రహాలుండవు. అన్ని కులాల, మతాల వారికీ, స్త్రీ పురుషులకూ తన మతంలో ప్రవేశం కల్పిం చాడు. అందరూ కలిసి ఒకే చోట భోజనం చేసే పద్ద్ధతి ఈ నాటికీ గరుద్వారాలన్ని టిలోనూ పాటిస్తారు.
హిందూ, ముస్లిం, బౌద్ధమతాలకు చెందిన వివిధ రకాల మతాచారాలు ఆనాడు పంజాబ్ ప్రాంతంలో ఉండేవి. తాంత్రిక యోగుల రహస్య దీక్షలూ, రకరకాల పూజలూ, పేదప్రజ లను ముఖ్యంగా మహిళలను చిన్న చూపు చూసే ఆచారాలూ అమలులో ఉండేవి. యోగుల దీక్షలకు ప్రధాన ఆటంకం స్త్రీలేనని ప్రచారంచేసే వారు. పాపాలకు మూలం స్త్రీ అని వారనేవారు. కొన్ని తరగతుల హిందువులలో, ముస్లింలలో పరదా పద్ధతి అమలులో ఉండేది. సతీసహ గమనం పెద్ద ఎత్తున అమలు జరిగిన కాలం అది. నానక్ స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రభో దించాడు. తన మతంలో వారికి సమాన స్థానం కల్పించాడు. పాపానికీ, అపరిశుభ్రతకీ, మోహానికీ, చంచల త్వానికీ, మోసానికీ, విచక్షణరాహిత్వానికీ ప్రతీ కగా స్త్రీని అభివర్ణించాడాన్నీ, లక్షణాలన్నీ స్త్రీల సహజ స్వభావంగా పేర్కొనడాన్నీ నానక్ తీవ్రంగా ఖండిచాడు. పుట్టుకలోనే ఆడపిల్లల్ని చంపేయడం, బాల్యవివాహాలూ, బహుభార్యత్వం, వ్యభిచారం, అత్యాచారాలు వంటి దురాచారాలను గట్టిగా ఎదిరించాడు. సిక్కు మతంలో వాటికి స్థానం లేదని చెప్పాడు. గురువు ద్వారా నామ సంకీర్తనం చేసే పద్ధతి సిక్కులలో నానక్ నుండి వరుసగా పాటిస్తూ వచ్చారు. నాలుగో గురువు అర్జున్ సింగ్ కాలంలో ఈ సంకీర్తనలను గ్రంథస్తం చేశారు. సంకీర్తనం జరిగే అన్ని ప్రదేశాలలోనూ గురువు ప్రత్యక్షంగా ఉండడం సాధ్యం కాదు గనుక ఈ గ్రంథాన్ని గరువుగా పరిగణించసాగారు. దాన్ని ఆది గ్రంథ్ అని గురు గ్రంథ్ సాహెబ్ అని అంటారు.
సిక్కుల కూటమిని ఖల్సా అంటారు. మతంలో చేరదలచిన ప్రతివారూ దీక్ష తీసుకో వాల్సి వుంటుంది. తొలుత ఎక్కువగా పట్టణ ప్రాంత వ్యాపారులు (ఖత్రీ) ఈ మతంలో చేరారు. క్రమంగా ఈ మతం ప్రజలలో ఆదరణపొందింది. రైతాంగానికి చెందిన జాట్‌లు, కొన్ని తక్కువ కులాల వారు సైతం ఖల్సాలో చేరసాగారు. ఇది ముస్లిం పాలకులకు కన్నెర్ర అయింది. ఇంకోవైపు ఆప్ఘన్ ప్రాంతంనుండి ముస్లిం రాజుల దండయా త్రలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. దీర్ఘకాలం ఈ తాకిడులను తట్టుకోవలిసి వచ్చిన క్రమంలో వీరంతా శివాలిక్ పర్వతాల నడుమకు వలసపో వాల్సి వచ్చింది. అక్కడ అప్పటికే ఉన్న తెగులను కుడా కలుపుకున్నారు. జాట్‌లూ, శివాలిక్ ప్రాత తెగల ప్రజలూ ఆయుధాల వాడకంలో అంతేరిన వారు. వారు జీవించిన భౌతిక పరిస్థితులు అటువవంటివి. సిక్కుల 9వ గురువు తేజ్ బహ దూర్‌ను ఔరంగజేబు హత్యగావించాడు. ఏడవ గురువైన గోవింద సింగ్ కుమారులను నలుగురినీ చంపించాడు. ఈ పరిస్థితుల్లో సిక్కుల్లో ఒక యుద్ధ సంస్కృతిని గురు గోవిందసింగ్ ప్రవేశపెట్టారు.
పంచ్ కకారాలు సిక్కుమతం ఆచారల్లో అత్యంత ప్రముఖమైనవి. క్రీ.శ (జత్తు కత్తిరించు కోరాదు), కరా (చేతకి ఉక్కుకంకణం), కంగా (దువ్వెన), కబ్బా (గోబీ), కిర్వాణ్ (కత్తి).. ఇవి ప్రతి సిక్కువద్దా ఉండాలి.
ఖల్సా (సిక్కుసంఘం) అత్యున్నతమైనది. ఖల్సా కోసం ఏమైనా ప్రాణాలతో సహా అర్పిం చగలిగి వుండాలి. ”ఖల్సా నా ఊపిరి, ఖల్సానా ఆత్మ, ఖల్సా నా ప్రతిష్ట, ఖల్సా యే నేను, ఖల్సా నా జాతి, నా కర్మ ఖల్సా నా ఆంతరాత్మ, ఖల్సా నా ఆదర్శగురువు, ఖల్సా నాకు ధైర్యానిచ్చే మిత్రుడు, ఖల్సా నాకు తెలివినీ, విజ్ఞతనూ ఇస్తుం ది, ఖల్సా నా ధ్యానానికి లక్ష్యం- గురుగో విందసింగ్.”
ఏడవ గురువు గురు గోవిందసింగ్ తర్వాత సిక్కు గరువుల పరంపర ఆగిపోయింది. గురువు స్థానాన్ని గురు గ్రంథ స్రాహిబ్ తీసుకుంది. ఏ నిర్ణయం తీసుకున్నా గురు గ్రంథ సాహిబ్ సమక్షం లో తీసుకోవాలి. పలు గురుద్వారాలు ఏర్పడ్డాక వాటి ప్రతినిధులతో కూడిన అకల్ తక్త్ సర్వాధి కారులు కలిగిన వేదికగా రూపొందింది.
ఇవన్నీ కలిసి 17, 18 శతాబ్దాలలో సిక్కులను ఒక సంఘటిత శక్తిగా నిలిపాయి. వ్యకి ప్రాధాన్యత కన్నా సమిష్టి తత్వానికి ప్రాధ్యానత కలిగిన విశిష్టమైన మతంగా సిక్కు మతం ఉంది. దేవుడిని చేరుకోవడం ఎలా అన్న దగ్గర మొదలైన సిక్కు మతం ఆఫ్ఘన్, ముస్లిం పాలకుల తాకిడిని తట్టుకుని మనుగడ కొనసాగించడమెలా అన్న లక్ష్యంతో ముందుకు నడిచింది. ఇది మంచి ప్రయోజనాలను కలిగించినప్పటికీ, కాలక్రమంలో కొన్ని దుష్పరిణామాలకూ కారణమయ్యింది.
ఖల్సాకు అత్యున్నత వేదిక అయిన అకల్ తక్త్‌ను 20వ శతాబ్దంలో అకాలీ దళ్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోనారంభించింది. లౌకిక ప్రజాస్వామ్యంలో ఇటువంటి ధోరణులు ఎప్పుడూ దుష్పలితాలనే ఇచ్చాయి, ఇస్తాయి. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ వంటి హిందూ మతోన్మాద సంస్థలు గానీ, ఇస్లామిక్ మతోన్మాద సంస్థలుగానీ, దేశంలో ఏవిధంగా మత విద్వేషానికి కారకాలయ్యాయో అదేవిధంగా మతాన్నీ, రాజకీయాలనూ కలగలిపిన పర్యవసానంగా ఖలిస్తాన్ ఉద్యమం తలెత్తి దేశానికి అపార నష్టం తెచ్చింది.
సిక్కు మతం పుట్టుక, పరిణామాన్ని అధ్యయనం చేసినపుడు సాపేక్షంగా ఒక స్వల్ప కాలవ్యవధిలో (15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు) పలు విధాలా ఆ మతం మార్పు లకు లోనవడం మనకు కనబడుతుంది. మోక్ష సాధన లక్ష్యంగా మొదలై భౌతిక, వాస్తవ సమస్యలను పరిష్కరించడానికీ, ఉనికిని నిలబెట్టు కోడానికీ ప్రాధాన్యతనిచ్చి ఆ క్రమంలో ఒక మిలిటెంట్ స్వభాన్ని సంతరించకోవడం, ఆ తర్వాత ఆధునిక రాజకీయాలలో ఒక సాధనంగా మారిపోవడం మనం చూస్తాం. ఒకప్పుడు హిందూ మత దురాచారాలను తెగనాడి సంస్కరణోద్య మంగా మొదలైన సిక్కు మతం నేడు హిందూ మతోన్మాద రాజకీయాల కూటమితో సన్నిహితంగా దిగబడిపోవడం మనం చూస్తున్నాం.
భక్తి ఉద్యమంగానీ, సిక్కుమతంగానీ ఒకనొక దశలో అభ్యుదయకరమైన పాత్రను పోషించిన ప్పటికీ అదితాత్కాలికమే నన్నది మనకు స్పష్టంగా కనపడుతుంది. భావవాద పునాదుల్లోంచి తలెల్తిన మతం, అది ఎంత ఉధాత్తమైన భావాలతో రూపొందినప్పటికీ ఆచరణలో అంతిమంగా అది అభివృద్ధి నిరోధకులకే తోడ్పడుతుంది.
ఎం.వి.ఎస్. శర్మ
Posted by hkjk on జూన్ 1, 2011 at 1:19 సా.
బాగు౦ది. మతాన్ని, దేవుణ్ణి మీకర్థమైన రీతిలో విభిన్న౦గా విశ్లేషి౦చారు.
ఆలోచనార్హమైన వ్యాస౦.
Posted by hkjk on జూన్ 1, 2011 at 1:21 సా.
మొదటి మూడు పేరాలు అద్బుత౦. ఆస్తికత్వమూ కాదు, నాస్తికత్వమూ కాదు. రె౦డి౦టి సమ్మిశ్రమ౦.
Posted by devudu ledu anna vadu murkududu on ఏప్రిల్ 7, 2012 at 3:15 సా.
][][]][][] devudu ledu ante nivu alla puttavu [[[][[[[[[]
devudu okkade avaru
alla vutadu lelusa
appudu vastha do niku telusa
ni ku adharalu kavala
leliyaka pote lelusuko ela ala padite ala rayaku
m.v.s sarma call me 7799441711 8886281504
by satish
Posted by Soogur Bhaskar on జూలై 5, 2012 at 6:52 ఉద.
మొదటి మూడు పేరాలు అద్బుత౦. ఆస్తికత్వమూ కాదు, నాస్తికత్వమూ కాదు. manavatvamu mukyam…