150 క్వింటాళ్ల ఆహారం నాశనం
రెండు లక్షల ఖరీదు
ప్రవేశ రుసుము రూ. 2000
ఎవ్వరయినా చేయరాని పనిచేస్తే ”ఇదేం రోగం! అని ఈసడించుకోవటం మా ఊరి ఆచారం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా 2011 ఆగస్టు 7న మన హైదరాబాదులో కొంతమంది యువతీయువకులు టమోటా(రామములగ)లతో కొట్టుకున్నారట. హైదరాబాదులో ఇదే మొదటిసారట. వాస్తవానికి టమోటాలతో కొట్టుకునే పండుగ స్పెయిన్లో జరుపుకుంటారని చదివినట్లు గుర్తు. మద్యం తాగటం, వేగంగా వాహనాలు నడిపి ఆనందపడటం, తైతక్కలాడటం, సినిమాలు, చిందులు, అరవటం, చేతులూపుకోవటం, చేతులకు ఏ దారాలో, ప్లాస్టిక్ రింగులో కట్టటం … ఇలా ఇప్పటిదాకా పండగలు గడపటం మన యువతకు తెలుసు. పాతొక రోత – కొత్తొక వింత అన్నట్లుగా ఈ దఫా స్పెయిను వాళ్లను అనుకరించారు.
రోజుకో దినం, అనుకరణ … అదేమోగానీ, ఇలా విలువయిన ఆహార పదార్ధాన్ని వ్యర్థం చేయటం చూసి నాకు కడుపు రగిలిపోయింది. టమోటాలతో కొట్టుకున్నాళ్లు ఎవరయినా నాకు కనపడి ఉంటే కొట్టి ఉండేవాడినేమో కూడా. కనీసం నిరసన వ్యక్తం చేసి ఉండేవాడిని. దారీతెన్ను కానని యువత ఏదో చేసింది పో… టమోటినో ఫెస్ట్‌లో పాల్టొన్నవాళ్లకు మీడియా కితాబులు ఇవ్వటం దాని దిగజారుడు కాదూ! అయ్యయ్యో! ఎంత తక్కువ వేసుకున్నా రెండు లక్షల రూపాయల విలువచేసే 150 క్వింటాళ్ల టమోటాలను ఇలా నేలపాలు చేసిన పాపం ఊరకే పోతుందా? ఇంత విలువయిన ఆహారాన్ని నేలపాలు చేయటం మనలాంటి పేదదేశాలకు అరిష్టం కదూ! ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జలవిహార్ సంస్థ యాజమాన్యానికి తగిన శిక్ష వేయాలి. నేనేగనుక న్యాయమూర్తినయితే, కూలీలను వినియోగించుకోకుండా యాజమాన్య ప్రతినిధులు, దాని అధికార బృందంలో వాళ్లంతా ఏడాది పాటు ఒక్కొక్కరు ఎకరం నేలలో టమోటాలు పండించాలని శిక్ష వేసేవాడిని. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులూ, ఈ వార్త ప్రసారంలో పాల్గొన్న మీడియా సిబ్బంది కనీసం ఏడాదిపాటు ఏడాదిపాటు టమోటాలు తినకూడదని నిషేధించేవాడిని. వారంతా కనీసం వారం రోజులపాటు చిత్తూరు జిల్లా వెళ్లి టమోట రైతుల వద్ద ఉచితంగా సేవ చేయాలని ఆదేశించేవాడిని. అయినా ఈనాడు నా మాటలు ఎవడు వింటాడు? నా పిచ్చి కాకపోతే! ”వాస్తవంగా నాకు స్పానిష్ టమోటాలను వినియోగించాలన్న కోరిక ఉంది. అయితే అవి కిలో రూ. 65 పలుకుతున్నందున స్థానిక పంటనే వినియోగించకతప్పలేదు” అని ఈ కార్యక్రమ నిర్వాహకుడు బిస్కెట్ శ్రీకాంత్ వాపోయాడట పాపం. యువతను ఆకర్షించేందుకుగాను ఈ సంస్థ ప్రవేశ ధరను కూడా తగ్గించిందట. మామూలుగా ఓ జంట ప్రవేశానికి రూ. 3500 వసూలు చేస్తారు. టమోటా పండుగకు మాత్రం కేవలం రెండు వేల రూపాయలనే వసూలు చేశారు మరి. అంటే ఇంతింత చెల్లించి ఆహార నాశనం పండుగ చేసుకున్నారంటే వాళ్ల బాబులకు అప్పనంగా సొమ్ములు వస్తుంటేనే సాధ్యం.
1. అమెరికా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశం రేపు ఏమి కాబోతుందో టమోటా యువతకు అవసరం లేదా?
2. ఆరుగాలం శ్రమించి పండించిన టమోటా రైతన్నకు ఎంత ప్రతిఫలం దక్కుతుంతో ఈ ఆటగాళ్లు ఎన్నడయినా ఆలోచించారా?
3. దేశాన్నీ, ప్రపంచాన్నీ త్వరలో ఆహార కొరత సమస్య ఆవరించబోతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయటం ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎప్పుడయినా విన్నారా?
4. తప్పును తప్పుగా చెప్పలేని మీడియాకు ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా వ్యవహరించే దమ్ముందా?
5. ఇంతకూ ఈ బ్లాగు చదువరులు ఏమంటారు? చెబుతారు కదూ!
8 ఆగ
Posted by ఆత్రేయ on ఆగస్ట్ 8, 2011 at 12:21 సా.
ముందు గా చెప్పుతో కొట్టాల్సింది
ఆ పాల్గొన్న పిల్లల అమ్మా బాబులను (ఖచ్చితం గా బేవార్స్ సంపాదన ఫలితమే అది)
తర్వాత నిర్వాహకులను టీవీ వాళ్ళను.
పిల్లలకు ఒక సంవత్సరం పిజ్జా/ బర్గెర్ బాన్ పెట్టాలి.
వస్తు విలువల గురించి, ఎలా చెబితే పిల్లలు వింటారో అలా చెప్పలేని పరిస్తిల్లో మన కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఉండటం శోచనీయం.
Posted by తెలుగిల్లు on ఆగస్ట్ 8, 2011 at 4:06 సా.
ఎలా చెబితే పిల్లలు వింటారో అలా చెప్పలేని పరిస్తిల్లో మన కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఉండటం శోచనీయం…..భలే బాగా చెప్పారు ఆత్రేయ గారు
Posted by ఓబుల్ రెడ్డి on ఆగస్ట్ 8, 2011 at 2:03 సా.
నిజమే, ఆహార కొఱతతో బాధపడే ఇండియాలాంటి దేశాలవాళ్ళు పిత్తబలిసిన పాశ్చాత్యుల దుబారా వేడుకల్ని అనుకరించడం అమానుషం, మతిలేనితనం.
Posted by తెలుగిల్లు on ఆగస్ట్ 8, 2011 at 4:08 సా.
అమానుషం…..మీతో నూరు సాతం ఏకీభవిస్తున్నాను
Posted by ravi on ఆగస్ట్ 8, 2011 at 2:17 సా.
it’s really very bad on the organizers part. Our country has lot of formers and our culture values food. In spain they might have had a reason for what they do, and our guys just bliendly follow it with out any thought. Now a days everyone just cares for money.
Posted by తెలుగిల్లు on ఆగస్ట్ 8, 2011 at 4:18 సా.
it’s really very bad on the organizers
Posted by shivani on ఆగస్ట్ 8, 2011 at 3:24 సా.
అవునండీ …నాకు ఆ వార్త చదివినపుడు అయ్యూ… ఎంత పిచ్చితనం
ఆ పండ్లు ఎంత మంది కష్టఫలితమో ? వీళ్ళకి అసలు ఎలా మనసు ఒప్పింది అలా నేల పాలు చేయటానికి?అవునండీ …నాకు ఆ వార్త చదివినపుడు అయ్యూ… ఎంత పిచ్చితనం
ఆ పండ్లు ఎంత మంది కష్టఫలితమో ? వీళ్ళకి అసలు ఎలా మనసు ఒప్పింది అలా నేల పాలు చేయటానికి?
Posted by తెలుగిల్లు on ఆగస్ట్ 8, 2011 at 4:17 సా.
అవునండీ …
Posted by krishnapriya on ఆగస్ట్ 8, 2011 at 3:47 సా.
౧౦౦% మీతో ఏకీభవిస్తున్నాను సర్ ఆర్గనైజర్లకి కూలీల సహాయం లేకుండా అన్ని క్వింటాళ్ళ టమాటాలని పండించే ‘అవకాశం’ ఇచ్చి చూడాలి. పొద్దున్నుంచీ మంట గా బాధ గా ఉంది. :-((
WP గారి బ్లాగ్ లో ఇదే చర్చ జరుగుతోంది. http://weekend-politician.blogspot.com/
Posted by తెలుగిల్లు on ఆగస్ట్ 8, 2011 at 4:14 సా.
మెత్తగానయితేనేమి దిమ్మ తిరిగేలా కొట్టారు
Posted by వీకెండ్ పొలిటీషియన్ on ఆగస్ట్ 8, 2011 at 3:49 సా.
Yeah.. it is a bit irresponsible and is in bad taste. I wrote on the same topic.
http://weekend-politician.blogspot.com/2011/08/blog-post.htmlshowComment=1312816848760#c7295626210730086956
Posted by తెలుగిల్లు on ఆగస్ట్ 8, 2011 at 4:11 సా.
మీ విశ్లేషన చాలా బాగుంది.
Posted by Mauli on ఆగస్ట్ 8, 2011 at 4:22 సా.
1. అమెరికా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశం రేపు ఏమి కాబోతుందో టమోటా యువతకు అవసరం లేదా?
లేదు .వాళ్ళెం చేస్తారు 🙂
2. ఆరుగాలం శ్రమించి పండించిన టమోటా రైతన్నకు ఎంత ప్రతిఫలం దక్కుతుంతో ఈ ఆటగాళ్లు ఎన్నడయినా ఆలోచించారా?
లేదు .వాళ్ళెం చేస్తారు 🙂
3. దేశాన్నీ, ప్రపంచాన్నీ త్వరలో ఆహార కొరత సమస్య ఆవరించబోతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయటం ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎప్పుడయినా విన్నారా?
అ౦దుకేగా ము౦దే అమ్మి సొమ్ము చేస్కు౦టున్నారు. అప్పుడు ఇ౦కో బుసినేస్సు చేస్కు౦టారు అ౦తే 🙂
4. తప్పును తప్పుగా చెప్పలేని మీడియాకు ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా వ్యవహరించే దమ్ముందా?
భలేవారే , ఆ పని చేసారని మనమా చానెల్ చూడడం మానెయ్యలేద౦టే, మనల్నేమనాలి 🙂
5. ఇంతకూ ఈ బ్లాగు చదువరులు ఏమంటారు? చెబుతారు కదూ!
ఏము౦ది , దేవుడా ఆ పిల్లలు టమేటాల వల్ల కాళ్ళు జారకు౦డా చూడు త౦డ్రీ
Posted by Mauli on ఆగస్ట్ 8, 2011 at 4:23 సా.
1. అమెరికా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశం రేపు ఏమి కాబోతుందో టమోటా యువతకు అవసరం లేదా?
లేదు .వాళ్ళెం చేస్తారు 🙂
2. ఆరుగాలం శ్రమించి పండించిన టమోటా రైతన్నకు ఎంత ప్రతిఫలం దక్కుతుంతో ఈ ఆటగాళ్లు ఎన్నడయినా ఆలోచించారా?
లేదు .వాళ్ళెం చేస్తారు 🙂
3. దేశాన్నీ, ప్రపంచాన్నీ త్వరలో ఆహార కొరత సమస్య ఆవరించబోతున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయటం ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎప్పుడయినా విన్నారా?
అ౦దుకేగా ము౦దే అమ్మి సొమ్ము చేస్కు౦టున్నారు. అప్పుడు ఇ౦కో బుసినేస్సు చేస్కు౦టారు అ౦తే 🙂
4. తప్పును తప్పుగా చెప్పలేని మీడియాకు ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా వ్యవహరించే దమ్ముందా?
భలేవారే , ఆ పని చేసారని మనమా చానెల్ చూడడం మానెయ్యలేద౦టే, మనల్నేమనాలి 🙂
5. ఇంతకూ ఈ బ్లాగు చదువరులు ఏమంటారు? చెబుతారు కదూ!
ఏము౦ది , దేవుడా ఆ పిల్లలు టమేటాల వల్ల కాళ్ళు జారకు౦డా చూడు త౦డ్రీ 🙂
Posted by Praveen Sarma on ఆగస్ట్ 8, 2011 at 4:28 సా.
టొమాటోలు పూసే నెపంతో అమ్మాయిల ఒళ్ళ మీద అసభ్యంగా చేతులు రుద్దేవాళ్ళకి ఆ కార్యక్రమంలో అసలు ఆనందం ఉంటుంది.
Posted by telugite on ఆగస్ట్ 18, 2011 at 9:16 సా.
టొమాటోలు పూసే నెపంతో అబ్బాయిల ఒళ్ళ మీద అసభ్యంగా చేతులు రుద్దేవాళ్ళకి ఆ కార్యక్రమంలో అసలు ఆనందం ఉండదా?
Just Kidding…
Posted by jambu on ఆగస్ట్ 18, 2011 at 10:01 సా.
నువ్ తెలుగైట్ కాదు …తెలుగేట్