అదిగో ! అదిగదిగో !!
తిరుమల కొండ
తిరుపతి – తిరుమల కొండ
చూడ చూడ రుచులు జాడవేరన్నట్లు
చూడండి … నిశితంగా చూడండి
మళ్లీ మళ్లీ చూడండి
కనరే మనుజులోరిని !
కనులారా కనరే, మనుజుని ముఖారవిందం !!
అవిగో అవిగో … అవి తిరుమల కొండలు
చూడ చూడ కొత్త కోణం … బహు కళాత్మకం
కొండ వంపులు – కొత్త సొంపులు
కనపడలేదా ! పరుండిన మనుజునివోలే !!
విశాలి నుదురు – పొడవాటి నాసిక
వాటి మధ్య ఓ నయనం మసక
కిందకొస్తే పెదాలు – వంపుదీరిన గడ్డం సరేసరి !
అదండీ, సంగతి మరి !!
Posted by balu on సెప్టెంబర్ 7, 2011 at 5:03 సా.
అరే భలే బాగుంది! ఎవరు కనిపెట్టారండీ ఇది?
Posted by కృష్ణశ్రీ on సెప్టెంబర్ 7, 2011 at 5:30 సా.
నాదీ అదే కామెంట్!
Posted by sailabala on అక్టోబర్ 9, 2011 at 12:28 సా.
chala bavundi evaru kanipettaru idi