ఉద్యమిస్తే పోయేదేమీ లేదు… బడులకు పడ్డ తాళాలు ఊడటం తప్ప!!


ఓ డజను రోజులపాటు తెలంగాణలో బడులకు వేసిన బలవంతపు తాళాలు 2011 అక్టోబరు 18 నుంచీ ఊడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రాంత ప్రైవేటు పాఠశాలల యజమానుల సంఘం 17వ తేదీ సాయంత్రం ప్రకటించింది. వాస్తవానికి ఈ ప్రకటన రానున్న విషయాన్ని తెలుగిల్లు 15వ తేదీనే విశ్లేషించిన వైనం చదువరులకు విదితమే. ఏదయితేనేం బడులు తెరుచుకోవటం తల్లిదండ్రుల ఉద్యమ ఫలితమే. అందుకు తెలుగిల్లు తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతోంది. ఇదేదో తెలంగాణ వ్యతిరేక వ్యవహారం కాదు సుమా. ఉమ్మడిగా గొంతు విప్పితే వచ్చే లాభం ఏమిటో తెలియజెప్పేందుకే. ఈ విజయం మరిన్ని పోరాటాలకు దారి తీయాలని తెలుగిల్లు ఆశిస్తోంది. గ్యాస్‌ ధర పెరుగుదల, విద్యుత్తు భారాలు, నిరుద్యోగం, నిలిచిపోయిన నీటి సరఫరా, బడి మూత, పంతుళ్ల కొరత, రోడ్డుపై చెత్తాచెదారం, పన్నుల పెంపు, లంచాలు, అక్రమాలు ఇలా … ఇలా సమస్య ఏదయినా వీలయిన వాళ్లంతా ఉమ్మడిగా కదలాలి. ఒక్కటై గళం విప్పాలి. అప్పుడు విజయాలు ఒళ్లో వచ్చి వాలతాయి.

13 వ్యాఖ్యలు

  1. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కంటే ఒక సంవత్సరం విద్యా కాలం ముఖ్యమా?

    స్పందించండి

  2. పిల్లల చదువులని ఒక ఏడాది వాయిదా వెయ్యడానికే బద్దకమా?

    స్పందించండి

  3. Posted by భీష్ముడు on అక్టోబర్ 17, 2011 at 2:35 సా.

    శిఖండి వున్న చోటికి భీష్ముడు రాడు.

    స్పందించండి

  4. Posted by తాడిగడప శ్యామలరావు on అక్టోబర్ 17, 2011 at 5:16 సా.

    క్షమించండి.
    తిట్టుకోకుండా చర్చించుకోలేరా?
    ఎవరు ఒప్పు యెవరు తప్పు అనేది వేరే విషయం.
    పరస్పరదూషణల వలన ఇరువురి గౌరవమూ పలుచనౌతున్నది.
    వాగ్భూషణం భూషణం అని గ్రహిస్తే సంతోషం.

    స్పందించండి

  5. పంది కి ఏమి తెలుసు పన్నీరు వాసన – టొపీ పెట్టుకున్న గాడిద కేమి తెలుసు చదువు విలువ.

    స్పందించండి

  6. డబ్బైనా, వస్తువైనా మనిషి చేతిలో ఉన్నప్పుడే నిజమైన అనుభూతి. కోస్తా ఆంధ్రలో ఉంటున్న పేదవాళ్ళు తమ చేతిలో లేని & ఎక్కడో వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ కోసం తెలంగాణా ప్రజల మీద ద్వేషం పెట్టుకుంటారని అనుకుంటే అనుభూతి అనేది ఎందుకో తెలియకుండా పోతుంది. మార్క్సిజం నిజంగా అర్థమైనవాళ్ళందరికీ అనుభూతి అంటే ఏమిటో తెలుసు. అనుభూతికి బయట ఉండే సబ్జెక్టివ్స్‌కి మనిషి అంత ప్రాధాన్యం ఇస్తాడనుకుంటే మీకు అనుభూతి గురించి అర్థం కాదు.

    స్పందించండి

  7. https://telugillu.wordpress.com/2011/10/17/%e0%b0%b8%e0%b0%ae%e0%b1%88%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b0%a8%e0%b0%9f%e0%b0%82/#comment-1045 ఇక్కడ సుబారావు గారు మార్క్సిజం పేరు చెప్పి తనని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తే నేను సమాధానం వ్రాసాను. జస్టిఫికేషన్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటారు కదా మనవాళ్ళు.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: