సమైక్యాంధ్ర వాదం లేదనటం తెరాస మరో పెద్ద తప్పుడు వాదన


తెలంగాణవాదం లేదనీ, ఆందోళనలు జరగటం లేదని ఎవ్వరూ అనటం లేదు కాబట్టి దానిమీద వివాదం లేదు.
అయితే సమైక్యవాదం ఒట్టట్టిదని తెరాస ప్రచారం చేస్తోంది. ఆంధ్ర పెట్టుబడిదారుల ఆర్థిక సాయంతో కొందరు పత్రిక పులులు గోల చేస్తున్నారని కేసీఆర్‌ సహా తెలంగాణ వాదులు తరచూ ఎద్దేవా చేయటం సాధారణమయింది. సమైక్యవాదమే ఉంటే అక్కడ ఆందోళనలు ఎందుకు జరగటం లేదని కూడా వీళ్లు ప్రశ్నిస్తుంటారు.
తెరాస వాదనలో ఒక్కటి మాత్రం నిజం … సీమాంధ్రలో ఇప్పుడు ఆందోళనలు జరగని మాట వాస్తవం. ప్రజలు ఆందోళనలకు ఎప్పుడు దిగుతారో కూడా తెలియకపోవటమే తెరాస తప్పిదం. తమ మీద నేరుగా భారాలు పడినప్పుడో, తమ చేతుల్లోది జారిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడో, అడుగంతా జారిపోయినప్పుడు మాత్రమే ప్రజా సమాన్యం ఆందోళనలకు దిగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే సీమాంధ్రులు ఇప్పుడు అలాంటి నొప్పులేమీ లేవు. అందువలన అక్కడి నేతలు తమ భావాలు ప్రకటిస్తారు తప్ప జనం కనీసం మాట్లాడే అవకాశాలు కూడా లేవు. సరే, దాన్నలా ఉంచి సమైక్య వాదం ఎందుకు ఉందో చూద్దాం!
1. ప్రస్తుతం సీమాంధ్రలో ఇంజినీరింగు, మేనేజిమెంటు, ఫార్మసీ తదితర కోర్సులు చదివే పిల్లలు కనీసం పది పదిహేను మంది లేని గ్రామం లేదు. ఈ చదువులకు సంబంధించిన ఉద్యోగాలకు హైదరాబాదు కేంద్రమని విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ భావిస్తున్నారు. అలా వేలాది కుటుంబాలు సమైక్యతను కోరుతున్నాయి.
2. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, బ్యాంకు తదితర రంగాలలో ప్రవేశించాలనుకునేవారికి హైదరాబాదులో మాత్రమే ఉత్తమ శిక్షణ సంస్ధలు ఉన్నాయన్న నమ్మకం ఏర్పడింది. అలా మరి కొన్ని వేలమంది సమైక్యవాదానికి కట్టుబడిపోయారు.
3. వేలాది మంది సీమాంధ్ర ప్రవాసులు హైదరాబాదులో ఆస్తులు కొనుగోలు చేసుకున్నారు. వారి తల్లిదండ్రులను ఇక్కడే ఉంచి తరచూ కలిసి పోతుంటారు. అందువలన కూడా సమైక్య రాష్ట్రం కావాలని మరి కొన్ని వేలమంది కోరుకుంటున్నారు.
4. వ్యవసాయంలో అంతో ఇంతో సంపాదించుకున్న పెద్ద రైతులూ, వివిధ పాలక పార్టీల నాయకులు కూడా హైదరాబాదులో స్థలాలు, ఇళ్లు కొనుక్కున్నారు. అందువలన హైదరాబాదుతో అనుబంధం పెంచుకున్నారు. రాష్ట్రం విడిపోతే తామంతా తమ తమ ఆస్తుల్ని వదులేసుకోక తప్పదన్న భయం తెరాస చర్యల వలనే వారిలో ఏర్పడింది.
5. డిగ్రీలు చదివిన లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగాల వేటలో అనుబంధ చదువుల కోసం హైదరాబాదులో కాపురాలు ఉంటున్నారు.
6. వీటన్నింటికీ తోడు సహజంగానే హైదరాబాదు రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడకు వచ్చి లక్షలాది మంది ప్రైవేటు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవిస్తే ఉద్యోగాలు వదులుకోవలసి వస్తుందనీ, కొత్తగా ఏర్పడే రాజధానిలో తమకు అవకాశాలు దక్కవని వీళ్లు భావిస్తున్నారు.
ఇలా ఉద్యోగార్ధులు, ఉద్యోగులు, ప్రవాసాంధ్రులు, ఇక్కడ ఆస్తిపాస్తులున్నవారంతా లక్షల సంఖ్యలోనే సమైక్యవాదం విన్పిస్తున్నారు.
తెలంగాణ ప్రకటన ఏ క్షణంలో వచ్చినా వీళ్లంతా ఉవ్వెత్తున వీధుల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఆందోళనకు తీసిపోని విధంగా సీమాంధ్రలోనూ ఆందోళనలు చెలరేగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనటంలో అతిశయోక్తి లేదు.

ప్రకటనలు

37 వ్యాఖ్యలు

 1. “సమైక్యాంధ్ర వాదం లేదనటం తెరాస మరో పెద్ద తప్పుడు వాదన”

  ఏంటి మీరు పిచ్చి కుక్క మొరుగుడుని కూడా పట్టించుకుని పోస్ట్ లు వేస్తారా?

  స్పందించండి

 2. సమైక్య వాదమే లేకపోతే తెలంగానా ఉద్యమాలెందుకు, రోడ్లెక్కి ఆ గోలెందుకు ఎప్పుడో తెలంగానా వచ్చేది కదా. 60,50 10 సంవత్సరాల ఉద్యమం అని వారే అంటున్నారు కదా. సమైక్య వాదమే లేకపోతే అంత కష్టమెందుకు? ఉద్యమం అంటే మన వొళ్ళు మనం కోసుకొని మరీ చెప్పఖర్లేదు.

  స్పందించండి

 3. 2009లో మా పట్టణంలో సమైక్యవాదులు బలవంతంగా బంద్‌లు చెయ్యించడం నా కళ్ళారా చూశాను. ఇక్కడ సమైక్యవాదం నిజంగా ఉందంటే నేను ఎలా నమ్మాలి? నేను వ్యక్తిగతంగా తెలంగాణా సపోర్టర్‌నే కానీ నా కళ్ళు నన్ను మోసం చెయ్యలేవు కదా. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం కంటే చిన్న పట్టణమైన ఆముదాలవలసలో ఎక్కువ హింస జరిగింది. ఆముదాలవలస మాజీ మంత్రి తమ్మినేని సీతారాం సొంతూరు కావడంతో తన ఊరిలో హింస ఎక్కువ చెయ్యించుకున్నాడు. అలాగే అశోక గజపతిరాజు సొంతూరు అయిన విజయనగరంలోనూ హింస ఎక్కువ జరిగింది. మా ఊరిలో ఏమి జరిగిందో తెలియనంత అమాయకుణ్ణి కాదు. ఇక్కడ బంద్ బలవంతంగా జరిగితే స్వచ్ఛందంగా జరిగిందని టివి చానెళ్ళలో వార్తలొచ్చాయి. శ్రీకృష్ణ కమిటీ సలహా ఇవ్వకముందే మీడియా మేనేజ్‌మెంట్ జరిగింది. బంద్ సమయంలో షాప్ అద్దాలు బద్దలగొడతారని అప్పర్ ఫ్లోర్‌లో ఉన్న నా షాప్‌కి లోపలి నుంచి షటర్లు వేసుకుని లోపల కంప్యూటర్‌లో పనులు చేసుకునేవాణ్ణి. ఇక్కడ బంద్ ఎంత బలవంతంగా జరిగిందో నాకు తెలియదా?

  స్పందించండి

 4. ఉద్యోగ అవకాశాలు లేక వ్యవసాయం మీద ఆధారపడే జనాభా కోస్తా ఆంధ్రలోనూ కోట్ల సంఖ్యలో ఉంది. వీళ్ళు కేవలం లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉన్న హైదరాబాద్ కోసం తెలంగాణాని ద్వేషిస్తారనుకోవడం అర్థం లేనిది. అభివృద్ధి చెందిన జిల్లాగా చెప్పుకునే కృష్ణా జిల్లాలో కూడా డిగ్రీలు చదివి వ్యవసాయం చేసినవాళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఉండేవాళ్ళు. ఉద్యోగ అవకాశాలు లేని వీళ్ళకి హైదరాబాద్ మీద ఆశ ఎక్కడ ఉంటుంది?

  స్పందించండి

 5. సీమాంద్ర ప్రాంతం నుంచి హెద్రాబాద్ లో సెటిలైనవారి కంటే బెంగుళూర్,చెన్నై,ముంబైల్లో నివసిస్తున్న తెలుగు వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు,సెటిల్ అవడం కోసం అందరూ అన్ని ప్రాంతాలకూ వెళ్తున్నారు.సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లే వాళ్లు ఎవరూ లేరా…..రాష్ట్రం వస్తే ఉద్యోగాలు ,ఆస్తులు కోల్పోతామన్నది ఒట్టి భ్రమే…

  స్పందించండి

 6. Ante jobs.. properties kosame meeru samaikyandhra antunnara..?

  Telugu talli…
  telugu jaathi… antha vottidena..?

  స్పందించండి

  • అన్నింటీ నిర్ణయించేదీ డబ్బు ఒక్కటే కదా. ఈ విషయo బాగా అర్ఠం కావాలంటే పిల్లల కోసం రంగనాయకమ్మ రాసిన మార్క్స్ పెట్టుబడి చదవండి

   స్పందించండి

   • I studied Marx’s Capital. అన్నిటినీ నిర్ణయించేది డబ్బే కానీ ఈ అంశంలో డబ్బు మీద ఆశ ఒక్కటే ప్రధాన అంశం కాదు. దేశంలో ఐదవ అతి పెద్ద నగరం తమ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉందని గొప్పగా చెప్పుకోవాలనే తపన కోసం కూడా సమైక్యాంధ్ర ఉద్యమం నడుపుతునారు. కోస్తా ఆంధ్రలో కూలీ పనులు చేసుకుని బతికేవాళ్ళకీ లేదా నెలకి 3500 జీతానికి ఏ పరిశ్రమలోనో పని చేసుకుని బతికేవాళ్ళకీ ఎక్కడో వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ మీద ఎలాంటి ఆశ ఉండదు. అలా ఉంటుందనుకునేవాళ్ళకి మార్క్సిజం అర్థం కాదు. కేవలం ఒక నగరం కోసం ఒక ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాన్ని ద్వేషించేవాళ్ళకి మార్క్సిజం అర్థమవుతుందని నేను అనుకోను.

   • ప్రాంతీయ సంకోచాల నుంచి బయటపడలేని మీకు మార్క్సిజంతో పని ఏమిటి? మార్క్సిజం అనేది అంతర్జాతీయవాద భావజాలం. కేవలం ఒక నగరం మీద వ్యామోహంతో జరుగుతోన్న సమైక్యవాద ఉద్యమాన్ని నమ్మేవాడు తాను మార్క్సిస్ట్‌నని చెప్పుకుంటే మార్క్సిజం నిజంగా చదివినవాళ్ళు ఎవరైనా నవ్వుతారు.

   • మార్క్సిజానికి వ్యతిరేకమైన వైయుక్తికవాదం అనే తత్వం ఉంది. వైయుక్తికవాదులు మనిషి సమాజం కంటే అధికుడనీ, మనిషి సమాజానికి లోబడకూడదనీ నమ్ముతారు. మీరు ఆ వర్గానికి చెందినవారే కానీ మార్కిస్ట్ కాదు. పోనీ మీ లాగే వైయుక్తికంగా ఆలోచించినా కేవలం ఒక నగరం కోసం ఒక ప్రాంతం మీద ద్వేషం పెట్టుకోవడం అవసరమా? అనే సందేహం వస్తుంది. సమైక్యవాదం అనేది మార్క్సిస్ట్‌లు అంగీకరించలేని & వైయుక్తికవాదులకి కూడా అర్థం కాని విషయం.

   • తిండి లేని వానికి స్వేచ్ఛ గురించి చెపితే అర్థం కాదని కొందరు పెట్టుబడిదారీ తత్వవేత్తలు కూడా ఒప్పుకున్నారు. తిండి లేని వానికి హైదరాబాద్ హైటెక్ సిటీ, మెట్రో ప్రోజెక్ట్‌ల గురించి చెపితే అర్థమవుతుందనుకోవాలా? ఇలా చూస్తే కోస్తా ఆంధ్రలో ఉన్న సాధారణ ప్రజలకి కూడా సమైక్యాంధ్ర వల్ల ప్రయోజనం ఉండదు అని అంగీకరించాలి. మార్క్సిజం చదివినవాళ్ళందరికీ అనుభూతి అంటే ఏమిటో తెలుసు. అనుభూతి అంటే ఏమిటో అర్థం కాకపోతే మార్క్సిజం అర్థం కాదు.

 7. @వేలాది మంది సీమాంధ్ర ప్రవాసులు హైదరాబాదులో ఆస్తులు కొనుగోలు చేసుకున్నారు
  >> “సీమాంధ్ర ప్రవాసులు” ఈ పదప్రయోగం నాకైతే కొత్తగా,అర్థం లేనిదిగా అనిపిస్తుంది. స్వంత రాష్ట్రం వెలుపల ఉండేవాళ్ళని ప్రవాసాంద్రులు అంటారు అని నాకున్న పరిజ్ఞానం. మన స్వంత రాష్ట్రములో పుట్టి,పెరిగిన ప్రతిఒక్కరికి మన రాష్ట్ర రాజధాని పరాయిది ఎలా అవుతుంది.ప్రవాసాంద్రులు ఎలా అవుతారు? ఎవరైనా వివరించగలరు !

  స్పందించండి

 8. “I studied Marx’s Capital.”
  అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను
  సజ్జనుండు పలుకు చల్లగాను

  స్పందించండి

 9. “అనుభూతి అంటే ఏమిటో అర్థం కాకపోతే మార్క్సిజం అర్థం కాదు.”

  రోకలి తలకు చుట్టుకొని రససిద్ధి పొందందే మార్క్సిజం అర్థం కాదు. గుడ్డి గుర్రాలకు పళ్ళుతోమడమంత సులభం కాదు మార్క్సిజం

  స్పందించండి

 10. అసలు పాయింట్‌కి రా. ఈ బ్లాగ్ ఓనర్ కావూరి వెంకట సుబ్బారావు గారు తాను మార్క్సిస్ట్‌నని చెప్పుకున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతున్నది మార్క్సిజాన్ని వ్యతిరేకించే గ్లోబలైజేషన్ అనుకూల వర్గంవాళ్ళు అనే విషయం కన్వీనియంట్‌గా మర్చిపోతున్నాడు. అందుకే అతనికి మార్క్సిజం పేరు చెప్పుకోవద్దు అన్నాను. అలా చెప్పుకుంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టే.

  స్పందించండి

  • నువ్వు చెట్టుపేరు, పుట్టగొడుగుల్లాంటి మావో, రంగనాయకమ్మ, నక్సలైట్ల పేరు చెప్పుకుని కాయలు పళ్ళు అమ్ముకోవడంలేదూ? నీకన్నా చెత్త వాగుడు కాయ బ్లాగ్లోకంలో ఎవరైనా వున్నారా? ఒక్కడిని చూపించు.
   గుడ్డిగుర్రాలకు పళ్ళుతోమి, మాలీష్ చేసే నీకు మార్క్స్ పేరెత్తడానికి కూడా అర్హతలేదు.

   స్పందించండి

  • అందుకే అతనికి మార్క్సిజం పేరు చెప్పుకోవద్దు అన్నాను.
   ———————————————————–
   నీలాంటి మూర్ఖిస్టులే మార్కిస్టులమని చెప్పుకోగాలేంది ఆయనచెప్పుకుంటే తప్పా? చెవిలో పూలు పెట్టుకున్న వారికి చెప్పు.

   స్పందించండి

 11. తారా, నువ్వు సాహెబు పేరు పెట్టుకున్నా, ఇంకెవరి పేరో పెట్టుకున్నా నీ అడ్డమైన ఆర్గ్యుమెంట్ల స్టైల్ మారదు. నలమోతు చక్రవర్తి లాంటి ఫ్రీ మార్కెట్ అడ్వొకేట్ల శిష్యులు ఫ్రీ మార్కెట్ వర్గానికి వ్యతిరేకమైన మార్క్సిజం పేరు చెప్పుకుంటే వాళ్ళని నమ్మేయడానికి చెవుల్లో పువ్వులు పెట్టుకోవాలి.

  స్పందించండి

 12. పువ్వులేకాదు ఉమ్మెత్త కాయలు కూడా పెట్టుకో, గాజులు తొడుక్కుని అక్కాయో అక్కాయో అంటూ రైళ్ళలో జనాలవెంట పడు. నేనే అసలైన మార్కిస్టుని, నీవు మూర్ఖిస్టువి. కావాలంటే విప్లవవిద్రోహకారుడు విషేకర్‌గారిని అడుగు, ఇదే సత్యం, అదే న్యాయం అని కోడై కూస్తారు.

  స్పందించండి

 13. గాడిదలన్ని చూడ నొక్క పోలికనునుండు – పరికించి చూడ రూపమే వేరయా
  గాడిదలయందు – అడ్డ గాడిదలే వేరయా విశ్వదాభి రామ వినుర “శర్మ”

  స్పందించండి

 14. సమైక్యవాద గాడిదలకి నేను విసిరిన ఒక చాలెంజ్ http://telanganasolidarity.in/75944677
  “హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రుల చేత కాకుండా కొత్తగూడెంలో స్థిరపడిన ఆంధ్రుల చేత జై సమైక్యాంధ్ర అనిపించాలి”

  స్పందించండి

  • వాళ్ళేందుకంటారు? జై తెలంగాణ అనకపోతే తీవ్ర అహింసా పద్ధతుల్లో మక్కెలిరగతంతాం అని వారికి ఎరికే. నీ కథ చెప్పు, నీవు మా ఉద్యమానికి ఉద్ధరించిందేమో చెప్పి చావు, లేదంటే నీవు గాడిదల్లో కచరా అని ఒప్పుకో.

   స్పందించండి

  • Posted by అగినాత on అక్టోబర్ 18, 2011 at 7:09 ఉద.

   వాళంటే చీకోలం దాకా తరిమికొడతం. నీవు మా వుద్యమానికి ఏం వెలగబెట్టావో చెప్పి ఏడువు. లేదంటే కచరావని ఒప్పుకో.

   స్పందించండి

  • వేర్పాటువాద గాడిదలకి నేను విసిరిన ఒక చాలెంజ్ >
   “కరీంనగర్‌లో స్థిరపడిన ఆంధ్రుల చేత కాకుండా విజయవాడలో స్థిరపడిన తెలంగాణ వారి చేత జై తెలంగాణా అనిపించాలి”

   స్పందించండి

 15. Posted by అజ్ఞాత on అక్టోబర్ 18, 2011 at 7:17 ఉద.

  తెలుగిల్లు గారూ – ఇంకా సినిమా పరిశ్రమ బదిలీ కూడా ఒక ముఖ్యమైన పాయింటు.

  స్పందించండి

 16. Posted by శ్రీకాంతాచారి on అక్టోబర్ 18, 2011 at 7:18 ఉద.

  నీ సాలిడారిటీ ఇచ్చి ఉద్యమం దుంప తెంచుడు సేసినవ్, ఐరన్‌లెగ్ శర్మ. నీవు ఎగస్పార్టీలో వుంటేనే ఉద్యమానికి మేలు, ఆడికెళ్ళు, చల్ హఠ్

  స్పందించండి

 17. ప్రెవీన్‌ ఖర్మ..
  నీకోసమే బలాగు బాబ్జీ గాడు రాశాడిక్కడ చూసుకో
  http://blaagubaabji.blogspot.com/2011/10/blog-post_18.html

  స్పందించండి

 18. బలాగు బాబ్జీ ఉండేది మా వైజాగ్‌లోనేలే. అతను వైజాగ్‌లో తెలంగాణావాళ్ళని ఎన్నడూ చూడనట్టు నటిస్తూ మాట్లాడుతున్నాడు.

  స్పందించండి

 19. “నీ సాలిడారిటీ ఇచ్చి ఉద్యమం దుంప తెంచుడు సేసినవ్, ఐరన్‌లెగ్ శర్మ. నీవు ఎగస్పార్టీలో వుంటేనే ఉద్యమానికి మేలు, ఆడికెళ్ళు, చల్ హఠ్” ఇప్పటికైనా గ్రహించారు తెలంగానాచారిగారు.

  స్పందించండి

 20. vennemuka leni jaati. okkadu” ee jaati ni mukkalu kaanivvanani cheppade????
  thooooooooo … edanna tamil gaano, isreal lono putide baagundedi.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: