నేను మార్క్సిస్టుని కాదు … మూర్ఖుస్టుని అంతకన్నా కాదు … ఆ రెండూ అతి స్వల్పంగా తెలిసినవాడిని మాత్రమే


శ్రీకాకుళం శర్మగారు ప్రకటించినట్లుగా నేను మార్క్సిస్టునని ఎక్కడా లిఖితపూర్వకంగాగానీ, మౌఖికంగాగానీ ప్రకటించుకున్న జ్ఞాపకం లేదు. అయితే గియితే అలా జరిగి ఉంటే మాత్రం తప్పే. ఎందుకంటే నాకు మార్క్సిజం కొద్దిగా తెలుసు. చాలా విషయాలు నాకు అసలు అర్ధమే కాలేదు. అర్ధం చేసుకునేందుకుగాను కొంతమేర ప్రయత్నించి వదిలిపెట్టాను. ఆ మాటకొస్తే మార్క్సిజమే కాదు… తెలుగులో రాసిన కొన్ని కవితలు కూడా నాకు ఎందుకో అర్ధం కాలేదు. దాన్నలా ఉంచితే ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి. నేను ఓ వామపక్ష పార్టీ కార్యకర్తగా రెండు దశాబ్దాలపాటు పనిచేసిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు ఆ ఊసే వదిలేశానని కాదు. ఇప్పటికీ మార్క్సిజం అంటే గట్టి విశ్వాసం ఉంది. అదే ఈ అస్తవ్యస్థ వ్యవస్థల నుంచి నాలాంటి వారిని రక్షిస్తుందని నమ్మకం. అందరికీ సమాన అవకాశాల్నీ, సొంత ఆస్తిలేని సమాజాన్ని నేను ఆకాంక్షిస్తున్నాను. మళ్లీ సమయం చిక్కితే నా ఆశయాల సాకారానికి గట్టిగా కృషి చేయటం ప్రారంభించాలన్న కోరిక ఉంది. ఒకటి రెండేళ్లలో అది సాధ్యం అవుతుందని విశ్వసిస్తున్నాను. శీర్షికలో చెప్పినట్లుగా మూర్ఖిస్టుని కూడా కాదు. నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అంటూ వాదించటం నాకు నచ్చదు. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ వాదాన్నయినా, అటు సమైక్య రాగానన్నయినా చూస్తాను. అసలే నిత్యం ఈతి బాధలతో సతమతమవుతోన్న జనాలను ఇబ్బంది పెట్టకుండా ఎవరు ఏ వాదాన్నయినా విన్పించవచ్చంటాను. సజస అయినా, రైలు, బస్సు, బడి బందుల్నయినా అదే కోణంలో విమర్శించాను తప్ప తెలంగాణ వాదమే తప్పని చెప్పటం నా పని కాదు. అయితే ఈ వాదనల్లో నేను ఉన్నాయనుకుంటున్న డొల్లతన్నాన్ని మాత్రం చెప్పే ప్రయత్నం చేశాను. ఇక ముందూ చేస్తాను. అవే తప్పులు సమైక్యవాదంలో చోటు చేసుకున్నా చెప్పకుండా ఊరుకోను. పైగా నేను కూడా సమైక్యవాదినే కాబట్టి దానిలో తప్పులు దొర్లితే మరింత ఘాటుగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను.

12 వ్యాఖ్యలు

  1. కార్మిక వర్గంతో సంబంధం లేని సమైక్యవాద ఉద్యమాన్ని జస్టిఫై చేసుకోవడానికి రంగనాయకమ్మ గారు వ్రాసిన పుస్తకాన్ని నువ్వు ఉదహరించావు. రంగనాయకమ్మ గారు ఎన్నడూ సమైక్యవాదాన్ని సమర్థించలేదు. సమైక్యవాదులకి కావలసినవి హైదరాబాద్ హైటెక్ సిటీ & మెట్రో ప్రోజెక్ట్ లాంటివే కానీ తెలంగాణాలో ఉంటున్న కోట్లాది మంది మనుషులు మాత్రం కాదు. కార్ల్ మార్క్స్ కాపిటల్ గ్రంథం రచించినది సమాజం కోసం. కార్ల్ మార్క్స్ ఎన్నడూ ఆర్థిక అంశాలని సమాజం నుంచి వేరు చేసి చూడలేదు. మీరు కేవలం మీ కన్వీనియన్స్ కోసం డబ్బు ఒక్కటే సమాజాన్ని శాసిస్తుంది అనే మార్క్సిస్ట్ సూత్రాన్ని పట్టుకుని మీ వాదాన్ని జస్టిఫై చేసుకున్నారు. సమాజాన్ని డబ్బు ఎక్కువగా ప్రభావితం చేస్తుందనేది నిజమే కానీ మనుషుల గురించి ఆలోచించకుండా కేవలం డబ్బు గురించి మాట్లాడితే అది మార్క్సిజానికి వ్యతిరేకమే అవుతుంది.

    స్పందించండి

  2. అక్కడ మీకూ, వీణ గారికీ మధ్య జరిగిన కన్వర్సేషన్ ఇది
    >>>>>>>>>>
    Posted by veena on అక్టోబర్ 17, 2011 at 1:30 సాయంత్రము

    Ante jobs.. properties kosame meeru samaikyandhra antunnara..?

    Telugu talli…
    telugu jaathi… antha vottidena..?

    జవాబు

    *

    Posted by తెలుగిల్లు on అక్టోబర్ 17, 2011 at 3:30 సాయంత్రము

    అన్నింటీ నిర్ణయించేదీ డబ్బు ఒక్కటే కదా. ఈ విషయo బాగా అర్ఠం కావాలంటే పిల్లల కోసం రంగనాయకమ్మ రాసిన మార్క్స్ పెట్టుబడి చదవండి
    >>>>>>>>>>
    ఇక్కడ మీరు కావాలని అర్థాలు మార్చడానికి ప్రయత్నించలేదా?

    స్పందించండి

  3. నీవు మూర్ఖిస్టుని కూడా కాదు. అన్ని నీవే రాసుకున్నవు మార్క్సిజం నీవు పూర్తి స్థాయిలో లేవు అనే అర్ధం నీవు మార్క్సిష్టువని లేక మార్క్సిజం మార్చి మాట్లీడుతావా తెలుసుకో
    నీవు పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు

    స్పందించండి

  4. సుబ్బారావు గారు, ఇవన్నీ పాత స్టైల్ కామెంట్లే. http://zurancinema.wordpress.com ఓపెన్ చేసి పాత కామెంట్లు చదవండి. వీళ్ళు మారుపేర్లతో వ్రాసిన కామెంట్లకీ అక్కడి కామెంట్లకీ తేడా కనిపించదు.

    స్పందించండి

  5. Praveen I am serious. Don’t neglect, you may develop brain cancer my friend.

    స్పందించండి

  6. మీరు పెట్టిన http://onlyforpraveen.wordpress.com ఎందుకు మూతపడింది? చెపితే నేనే మీ మెంటల్ ట్రీట్మెంట్‌కి డబ్బులు ఇస్తాను.

    స్పందించండి

  7. Posted by శివాజీ చెన్నమనేని on అక్టోబర్ 21, 2011 at 5:41 సా.

    కమ్యూనిజం మీద మీ అభిప్రాయమేంటి? మార్కిజాన్ని సమర్ధిస్తారా?

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: