గడాఫీ కిదే నా నివాళి
దేశభక్తియుత లిబియా అధ్యక్షుడు గడాఫీని 2011 అక్టోబరు 20న చమురు దొంగ అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక దళాలు దారుణంగా హత్యచేశాయి.
ప్రపంచస్థాయి మానవుడికి ఇదే నా నివాళి.
సొంత బుర్రలు లేని, ఉన్నా మెదడుకి మేకులు కొట్టుకుని బతికే తెలుగు వార్తా ఛానళ్లు యథావిధిగానే అమెరికా తైనాతీ సంస్థలు విడుదల చేసిన సమాచారాన్ని గుమ్మరించటం ఘోరం. నేరం. గడాఫీ పూర్వాపరాలను తెలుసుకోకుండానే నియంత హతుడయ్యాడంటూ వ్యాఖ్యానించటం ఏమీ బాగాలేదు. మిగతా విషయాలు ఎలాగున్నా లిబియా మనకు మిత్ర దేశం. అనేక పర్యాయాలు కష్టకాలంలో మనకు అండగా నిలబడింది. అదంతా గడాఫీ చలవే. ప్రధానంగా వైద్య సేవల రంగంలోనూ, చమురు అందజేసి మనకు సాయం అందించిన దేశమది.
చేయూత, సాయం, మిత్రత్వం తదితర వ్యవహారాలను పక్కనబెట్టి మరొక రకంగా ఈ విషయాన్ని పోల్చి పరిశీలిద్దాం. ఉదాహరణకు మీ ఇంట్లో ఏదో సమస్య వచ్చింది. దానికి కారణం మీరని నాకు తెలిసింది. మీ ఇంటి పొరుగునున్న నేను, మీ ఇంట్లోకి జొరబడి మిమ్మల్ని కొట్టాను.
మీ ఇంటి సమస్యలో నేను కలుగజేసుకోవటం సరయినదేనా?
మీ సమస్యను మీరే పరిష్కరించుకోలేరా?
కాకుంటే మీరు కోరితే సలహాలు – సూచనలు ఇచ్చి సమస్య పరిష్కారానికి సాయం చేయటంతో సరిపెడితే సరిపోదా?
ఈ ప్రకారం లిబియా వ్యవహారాన్ని చూద్దాం.
గడాఫీ నియంతే అయితే, లిబియన్లకు ఆయన పాలన నచ్చకపోతే ఎదురు తిరగాల్సింది ఆ దేశస్తులా? అమెరికా పాలకులా?
గడాఫీని చంపేందుకు నాటో సైన్యానికి ఏమి హక్కు ఉంది?
గడాఫీకి విదేశాల్లో వ్యాపారాలున్నాయనీ, సొంత విమానం ఉందనీ అమెరికా ప్రచారం చేసింది. అదే నిజమయితే… గడాఫీ తన సొంత విమానంలో ఎందుకు పారిపోలేదు? నెలల తరబడీ తన వ్యాపారాలను వదిలేసి తన సొంత ఊరిలో ఎందుకు ఉండిపోయాడు? వీటికి అమెరికా అనుంగు వార్తా సంస్థలు జవాబు చెప్పాలి.
20 అక్టో
Posted by jayadev on అక్టోబర్ 20, 2011 at 5:47 సా.
వాళ్ళు కేవలం చమురు దొంగలు మాత్రమేకాదు వ్యాపారం పేరిట పీతి పైని పైసాను కూడా ఏరుకునే రకాలు.మీ పోస్టుకి మంచి హేడ్డిన్గ్ పెట్టారు.
Posted by naveen on అక్టోబర్ 20, 2011 at 11:16 సా.
adhi inti problem kadhu sir!
he killed people brutally.
Posted by vanajavanamali on అక్టోబర్ 21, 2011 at 3:46 ఉద.
Good post. Think different.
Posted by gpvprasad on అక్టోబర్ 21, 2011 at 4:51 ఉద.
Lets think correctly
మీ అభిప్రాయం ప్రకారం అంబానీ కూడా మంచి వాడే
నా అభిప్రాయం ప్రకారం సామాన్యుడే మంచి వాడు.
Posted by durgeswara on అక్టోబర్ 21, 2011 at 7:07 ఉద.
మార్కెట్ దారుల మాయావ్యూహాలిలానే సాగుతునాయి