పోచారం ఓ ప్రజాద్రోహి


బాన్సువాడ ఉప ఎన్నికల్లో తనకు నాలుగు ఓట్లు రాగానే పోచారం శ్రీనివాసరెడ్డి అనే ప్రజాద్రోహి ప్రజలకే హెచ్చరికలు జారీ చేశాడు. తనకు ఓటేయని సీమాంధ్రులంతా తెలంగాణ ద్రోహులని తిట్టిపోశాడు. వాళ్లంతా మారిపోవాలని ఆదేశాలు జారీ చేశాడు. మారకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు.
ప్రజల మనోభావాలంటూ తెదేపా గూటి నుంచి తెరాస కారెక్కిన ఇతగాడిని ఇప్పటిదాకా కాపాడిన చంద్రబాబు కూడా ప్రజలకు జవాబు చెప్పుకోవాలి. అయితే తెరాసకూ తెదేపాకు మూల సూత్రాల్లో తేడా లేదు కాబట్టి పోచారం ఎక్కడయినా బతికిపోతాడు. ఎవ్వరయినా కాపాడతారు. కాకపోతే ఏ గూటి మాటలు అక్కడ మాట్లాడటమే పోచారం పని. చేతలు మాత్రం ఒకటే. అదే ప్రజాద్రోహం.
ప్రజల మనోభావాలంటూ ఫోజులు కొడుతోన్న పోచారం తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా అవేమీ గుర్తుకు రాకపోవటం అతగాడి తప్పేమీ లేదు. కాకపోతే ఇలాంటి వారి తీరును మనం సదా గుర్తు చేసుకుంటుండాలి. స్టేషనరీ కొనుగోలుమాలుకు పాల్పడి ఇతగాడు తన మంత్రి పదవిని కోల్పోవలసి వచ్చిందని గుర్తుంది కదూ!
ఈనాటి ప్రజా ప్రతినిధుల్లో అవినీతి లేకపోతే చెప్పుకోవాలిగానీ, ఉందని చెప్పుకోవటం దండగమారి పని. ప్రజలు … ప్రజల మనోభావాలు అంటూ తెగ తెగ వాగేస్తున్నాడు కాబట్టి పోచారానికి సంబంధించి గుర్తుచేసుకోదగిన విషయం ఒకటుంది.
అది విద్యుత్తు ఉద్యమం జోరుగా సాగుతోన్న సమయం. ఆ సమయంలో రాష్ట్ర మంత్రిగా వెలగబెడుతోన్న పోచారం ఒంగోలుకు వచ్చాడు. అది కనిపెట్టిన వామపక్ష కార్యకర్తలు ఆయన వాహనానికి అడ్డంపడ్డారు. ఆ సాయం సమయంలో వేలాది మంది పౌరులు అక్కడ పోగుబడ్డారు. వారంతా చోద్యం చూస్తూ, ప్రభుత్వ తీరుపై శాపనార్ధాలు పెట్టారు. కొంతసేపు నినాదాలు, వాగ్వివాదాలు సాగిన తర్వాత పోచారం కారు దిగి పోలీసు వలయం మధ్య కాలి నడకన అతిథి గృహానికి వెళ్లిపోయాడు. దీంతో ప్రజలతోపాటు కార్యకర్తలు కూడా ఎవరిదోవన వారెళ్లారు. ఇక తర్వాత జరిగిందే అసలు సంగతి. అతిథి గృహానికి చేరుకున్న పిదప పోచారం లోపలి మనిషి నిద్రలేచాడు. క్రోధంతో ఉడికిపోయాడు. అంతే పోలీసు ఉన్నతాధికారులను ఆగమేఘాలమీద పిలుపించుకున్నాడు. వామపక్ష కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బొక్కలిరిగేదాకా విరగదీయమని ఆదేశాలు జారీచేశాడు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేముంటుంది. పోలీసు అధికారులు విజృంభించారు. కార్యకర్తల ఇళ్లమీద పడి ఎత్తుకొచ్చి కేసులు పెట్టారు. లాఠీలతో ఇష్టారీతిన ఆడుకున్నారు. తర్వాతెప్పుడో తీరిగ్గా ఇళ్లకు పంపారు. ఆ సమాచారాన్ని పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు పోచారం తెలుసుకుంటూ తెగ సంతోషపడిపోయాడట! ఇదీ ప్రజల మనోభావల పట్ల పోచారంగారికున్న నిబద్ధత. ఆ తర్వాత అల్లుడి అక్రమాల పుణ్యమాని మంత్రి పదవిని కూడా ఊడగొట్టుకోవటం వేరే సంగతనుకోండి. అయితే పోచారానికి ఇప్పటికీ తిక్క కుదిరినట్లు లేదు. తనకు ఓటేయకపోవటం నేరమంటూ తెగ తెగ హూంకరిస్తున్నాడు. ప్రజాస్వామ్యం పత్తి కట్టెలు. ప్రజా ప్రతినిధులు, ప్రజల మనోభావాలు పేరేదయితేనేం అన్నీ దోచుకునేందుకే తప్ప సమాజం కోసం కాదు. అందులోనూ ఆయనగారు ఇప్పుడు వల్లె వేస్తున్నట్లుగా తెలంగాణ ప్రజల కోసం అసలే కాదు. తెలంగాణ అంటే అంత ఇష్టమే అయితే తన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అదీ తెలంగాణవారిపైనే పోలీసుల కేసులు ఎందుకు పెట్టిస్తాడు? దటీజ్‌ ప్రజాద్రోహి పోచారం.

11 వ్యాఖ్యలు

  1. తెలంగాణాలో ఉంటూ తెలంగాణాకి వోట్ వెయ్యకపోవడం ద్రోహమే అవుతుంది. గుంటూరు జిల్లా నుంచి వచ్చి తెలంగాణా కోసం నిరాహార దీక్ష చేసిన కూనంనేని గురించి చదవండి http://telugu.stalin-mao.in/76251908

    స్పందించండి

  2. “తెలంగాణాలో ఉంటూ తెలంగాణాకి వోట్ వెయ్యకపోవడం ద్రోహమే అవుతుంది.”

    అదెలా అవుతుంది ప్రవీణూ? నువ్వు సమైక్యాంధ్రలో ఉంటూ సమైక్యాంధ్రకి ఓటు వేయటం లేదుగా? అంటే నువ్వు ద్రోహివా?

    స్పందించండి

  3. అక్కడ కాంగ్రెస్సుకు నుంచున్నది కూడా తెలంగానానే;
    ఇక్కడ విషయం తనకు వోటువెయ్యలేదని ఆక్రొశం. ప్రజాసామ్యం మీద గౌరవం లేకపోటం. ప్రజలను బెదిరించటం. వీళ్ళా రేపు తెలంగానాని ఉద్ధరించేది. వీళ్ళ వలన వచ్చేది దొరల తెలంగానానే. పైన ఫొటోలో ముఖాలను చూడండి సీమాంధ్ర దిక్కుమాలిని రాజకీయ నాయకుల ముఖాలకన్నా ఏమి తీసిపొయారు.

    స్పందించండి

  4. great setaire mama ee praveen gadiki buddiledu

    స్పందించండి

  5. Mentally challenged people are exempted, Marthanda has got such exemption certificate by birth.

    స్పందించండి

  6. Posted by Rajasekhar Dasari on అక్టోబర్ 20, 2011 at 1:56 సా.

    ప్రవీణ్, ఓటు అనేది ఎవరి ఇష్టం వచినట్లు వారు వేసుకుంటారు , దాన్నే ప్రజా స్వామ్యం అంటారు , మావో మోచేతి నీళ్ళు తాగే నీకు వాటి విలువలు ఏమి తెలుసు

    స్పందించండి

  7. Jaiandra annanduku cheye chesukunna Lagadapati prajabanduva? mr.Praveen

    స్పందించండి

  8. ఏంటి ప్రవీణూ పైన రెండో కామెంట్ కి ఇంకా సమాధానం లేదు? నువ్వెప్పుడూ ఇంతే అడిగిన వాటికి జవాబు చెప్పకుంటా ఏంటో తింగరి తింగరిగా సమాధానం లేని మాటలు మాట్లాడతావ్. నీ లెక్క ప్రకారం ఇంతకూ నువ్వు ద్రోహివా కాదా అది చెప్పు ముందు.

    స్పందించండి

  9. ఇంతకీ ఈ మెంటల్ పోచారం రాజీనామా ఎపుడు చేస్తున్నాడు ?

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: