కొంతమంది నోరు పెట్టుకుని బతుకుతారు. ప్రశ్నంటే వాళ్లు ఆమడ దూరం పారిపోతారు. నిజం చెబితే నిష్టూరమాడతారు. సత్యం వాళ్లకు పరమ శత్రువు. చరిత్ర అంటే గిట్టనే గిట్టదు. బావిలో కప్ప వారికి గురువు. ఎదుటివాడు నోరు తెరుస్తుంటే చూస్తూనే బూతుబూతంటారు. నోరు తెరిస్తే వాళ్లకు ‘అమ్మ, అక్క’ తప్ప వేరే ఏదీ రాదు. ప్రపంచంలో అందరికీ సొంత పేరంటే మక్కువని పరిశోధనలో తేలింది. కానీ అదేంటోగానీ వీళ్లకు మారు పేర్లంటేనే మరీ మక్కువ పాపం. ఓ అరడజనో, డజనో పేర్లతో మెయిళ్లు తెరిచి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దాంతో అభాండాలను వదులుతుంటారు. అన్నట్లు పిరికితనం వీళ్లను అంటి పెట్టుకునే ఉంటుంది. అందుకనే ఎవడన్నా ఎవడ్రా నువ్వు? అన్నాడో వీళ్లు తమ దుకాణానికి తాళం పెట్టి అరవై ఆమళ్ల దూరం పారిపోతారు. తమ అస్తిత్వానికి ఎసరు వచ్చిందని వీళ్లకు అన్పిస్తే చాలు ఆదినారాయణ కాస్తా అబ్దుల్లా అయిపోతాడు. రాముడేమో రౌడీనంటాడు. ఘనశ్వాముడు శామ్యూలు అవతారమెత్తుతాడు. అప్పటిదాకా పరమతమతాలపై ఊరకూరకే ఉమ్ముతూ తిరిగే ఈ పెద్దమనుషులకు తాము దాక్కోవాలంటే సిగ్గూశరం లేకుండా పరమత సహనం హఠాత్తుగా గుర్తుకొస్తుంది. అంతే దాంట్లో దూరిపోతారు. తమ ముఖం కనపడకుండా ఎదుటివారిపై రాళ్లేస్తారు. అంతా ఛండాలం చేసేస్తారు. తమకు తెలియనిదానిని ఎవ్వరూ తెలుసుకోగూడదంటారు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటూనే తాము ఒప్పుకున్నదానినే అందరూ వల్లెవేయాలంటారు. ప్రజల మనోభావాలంటూ తమ కోరికల్ని అందరికీ అంటగడతారు. భక్తుల మనోభావాలంటూ ఊరకూరకే అందరినీ బెదిరిస్తుంటారు. ఏమిటీ మనోభావాలని ప్రశ్నిస్తే వీళ్లెప్పుడూ నోరు తెరిచి చెప్పలేదుగానీ, ఓ హేతువాది అంటారూ … ”అదో బ్రహ్మ పదార్ధం” . ఇదీ సంగతి. ఇప్పటికింతే. సెలవు.
26 అక్టో
Posted by Edicaav on అక్టోబర్ 26, 2011 at 10:51 సా.
EDicaav
Why such idiotic and useless posts?
Posted by rathnamsjcc on నవంబర్ 25, 2011 at 7:56 ఉద.
మనుషులు మరచిపోయిన విషయం ఒకటి ఉంది. ఇతరులపట్ల జాలి చూపించే తాము తమపట్ల జాలి చూపించాలన్న విషయం వాళ్ళు గుర్తించరు. వజ్రాల్ని మించిన సత్య సంపదని, దైవభాండగారం తమలో ఉందని వాళ్ళు గుర్తించారు. గురువులని, గుళ్ళని బయట తిరుగుతూ మనసులోకి చూడలేని వాళ్ళకు సత్యమంటే ఏమిటో, దైవమంటే ఏమిటో ఎప్పటికీ తెలీదు.-