భరతమాత ముద్దుబిడ్డ నరకాసురా! అందుకో నా నివాళి!!


భరతమాత ముద్దుబిడ్డడు నరకాసురునికి నా నివాళి. ఇక్కడి మట్టి మనుషుల రక్షణకోసం అడుగడుగునా తమను ఢీకొంటున్న నరకాసురుడిని నిలువునా చంపేసి ఆర్యులు జరుపుకున్న పండుగే దీపావళి. నరకాసురుడి తల్లి మట్టి. అంటే స్థానికురాలనే గదా. తొలుత బలవంతంగానూ, తర్వాత తర్వాత బాధితులతోనే దండుగ జరిపించే పాలకవర్గాల నీతికి పుట్టిందే దీపావళి. పుట్టెడు కరువు నుంచి తమనీ, తమ ఆవుల మందల్నీ కాపాడుకునేందుకు ఆర్యులు భరత భూమిలో అడుగుపెట్టారు. ఇక్కడి ప్రకృతిని ఆక్రమించుకునేందుకు నానా ఆగడాలకు పాల్పడ్డారు. ఆర్యుల ఆగడాలను అడ్డుకున్న పాపానికి, నరకాసురుడు క్రూరుడని ప్రచారం చేశారు. నానా తిప్పలు పెడుతున్నా తమ జాతిని రక్షించుకునేందుకు నరకుడు పడరాని పాట్లు పడి రాక్షసుడు (రక్షించువాడు) అయ్యాడు. దీంతో సురులు (సురాపానం అంటే సారా తాగువారు) అసురుడు (సురాపానం చేయనివాడు) నరకాసురుడిని చంపేందుకు పెద్ద కుట్రే పన్నారు. నరకాసురుడికి మహిళలంటే మహా గౌరవం. ఈ విషయం పుక్కిటి పురాణాల్లో స్పష్టంగా ఉంది. సురజాతిగా తమను తాము అభివర్ణించుకునే ఆర్యులూ (మత్తులో ఉండగా కాదు భయంతో ఒణికిపోతూ) ఒప్పుకున్నారు. తొలుతయుద్ధానికి దిగిన కృషుణ్ని మూడు చెరువుల నీళ్లు తాగించాడు నరకుడు. భార్య (సత్యభామ) ఎదుటే భర్తను చంపటానికి ఇష్టపడని నరకుడు కృష్ణుడికి దిమ్మతిరిగే దెబ్బలతో సరిపెట్టాడు. అయితే మహిళలను గౌరవించే నరకాసురుడి ముందు తన భార్య సత్యకు బాణమిచ్చి నిలబెట్టాడు కృష్ణుడు.దాంతో వినమ్రంగా నమస్కరించి ఆయుధాలను వదిలేసిన నరకాసురుడిపై ఆమె బాణాలు వేసి చంపేసింది. తమను అడుగడుగునా అడ్డగిస్తోన్న నరకుడిని మట్టుబెట్టి విజేతలయిన ఆర్యులు సంబరాలు జరుపుకున్నారు. నరకుడి ఆశ్రితులను కొందరితో బలవంతంగా సురాపానం చేయించి జై, జై కొట్టించుకున్నారు. ఆర్యుల ప్రచారం పుక్కిట పురాణ రూపం దాల్చి కాలక్రమంలో అనార్యులనూ ఆవరించింది. నరకాసుర రూపాన్ని భయం పుట్టించే విధంగా చిత్రించారు. నాలుగు చేతులు, తల మీద రెండు కొమ్ములు, పేద్ద నోరు, ఆయుధాలన్న తీరున పెరిగిన గోళ్లు, వీటన్నింటికీ తోడు మెడలో మనిషి పుర్రెలతోనూ, ఎముకలతోనూ రూపొందించిన దండనూ పుట్టించారు. నిజం గడపదాటే లోగా అబద్ధం ఆరవై ఆరు ఆమడ తిరిగొస్తుందన్న చందంగా వారి ప్రచారంతో నరకాసురుడంటే మహా క్రూరుడని ముద్ర వేయగలిగారు. విజేతలు చేసిన వక్ర ప్రచారం కాలక్రమంలో పరాజితుల బుర్రల్లో దూరి బాణాసంచా వ్యాపారానికి బాధితులను కూడా వెన్నూదన్నూగా నిలుపుతోంది. ఏటా కోట్లాది రూపాయల బాధితుల శ్రమశక్తిని దోమల నివారిణి పేరిట బాణాసంచా రూపాన దోచుకుంటోంది. దేనికయినా పర్యవసానం దోచుకోవటమే గదా. ఆనాడు తమ అస్థిత్వానికే ఇష్టపడని నరకాసురుడిని మట్టుబెట్టిన ఆర్యులు, ఆ సంఘటననే పెట్టుబడిగా చేసుకుని బాణాసంచా వ్యాపారాలతో నేటికీ సొమ్ముచేసుకుంటున్నారు.

ప్రకటనలు

10 వ్యాఖ్యలు

 1. నీలాంటి పనికిమాలిన గాడిదలు చెప్పే పురాణాలకి కాలం చెల్లిందిలే. Shameless insects like you arte being bashed everywhere because of this.

  స్పందించండి

 2. అయినా నిన్నుకాదు నీకు చరిత్ర నేర్పించిన దరిద్రుడిని అనాలి. రోడ్లమీద ముష్టెత్తుకోడానికి కూడ పనికి రాని నీలాంటి పందికొక్కులకి తగిన శాస్తే జరుగుతోంది.

  స్పందించండి

  • శాస్తి జరగాలన్న నీ దీవెనలు నిజంగా జరిగే పనయితే దొంగ పేర్లతో రగిలిపోయే నీకే జరగాలి అదేదో, అయినా మనుషులు నీకు పందుల్లాగాను, పంది కొక్కులుగానూ, గాడిదల్లాగానూ కనపడే రోగం యేదో సోకినట్లుంది, ఎటూ నువ్వు నమ్ముతావుగా ఆవు వుచ్చొ, పెంటొ తినరాదూ కాసింతయినా తగ్గుతుందేమో,

   స్పందించండి

 3. Posted by ముడ్డిగిల్లు on అక్టోబర్ 26, 2011 at 12:17 సా.

  మస్తు షెప్పినవన్నా. సుభా కాంచలు. నరకాసురుడి విగ్రహం బుద్దుడి భుజాల మీద పెట్టీ యాలె. తెలంగాణ గిట్ల వస్తే అదే మొదట పని చేసుడు.

  స్పందించండి

 4. evdra neeku chduvu cheppindi? a ayya gaadena?
  wholesale ga mimmlni verri vallni chestunnadu.

  స్పందించండి

 5. Posted by ఎవడో ఒకడు on అక్టోబర్ 26, 2011 at 4:51 సా.

  మీకోవిషయం తెలియదనుకుంటా, ఈ నరకసురుని కథ ధక్షిణాదిలోనే, ఉత్తరాదిలో దీపావళి రాముడు తిరిగి అయోద్య వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడని చేసుకుంటారు. దసరానేమో రావణాసురుని చంపినరోజని. మీరు చెప్పిన ఆర్యుల కథ నిజమైతే అది ఉత్తరాదినుంచే మొదలవ్వాలి కదా..

  స్పందించండి

 6. ఎవ్వరికైనా వారి ఏక చత్రాదిపత్యం మే ఎల్లప్పుడూ నడవాలని వారు చెప్పిందే వేదంగా ఉండాలని కోరుకొంటారు. అందుకే నిజం చెబితే వారికి ఒప్పుకోడానికి మన్సురాదు కదా ఎదురు దాడులు శాపనార్థాలు పెడుతుంటారు. అది తరతరాలుగా వారికి అలవాటయింది ఇంత త్వరగా పోతుందా. నేను చదువుకొని బయట దేశాలకు వచ్చినపుడు మాఊరి దొరలు అన్నారు “ఏమి చేద్దాం కలికాలం మాల్లోల్లు కూడా విమానం ఎక్కుతున్నారు”. వీరికి ఎప్పుడు వీరు చెప్పిందే మనం వినాలి మనకేదైన నిజం తెలిసి ఆ ప్రకారం చెబితే వెంటనే మనం, మన గురువులు పందికోక్కులుగ, గాడిదలుగా కనిపిస్తాము. మనం చరిత్రలో ఇలాంటివి ఎన్నో చదువుకున్నాం మొదట శాస్ర్తవేత్తలు కొత్త విషయాలును చెప్పినపుడు వారిని అతి క్రూరంగా కొట్టి చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మీకు వేరే చెప్పక్కర్లేదు వ్రాసే ముందే మీకు ఇలాంటి ఎదురుదాడులు, వెటకారాలు ఉంటాయని తెలిసి వాటిని ఎదుర్కోవాలనే ఇలా వ్రాసే ఉంటారు. అందుకు ప్రత్యేకంగా భినందిస్తున్నాను. ఇప్పుడిప్పుడే యునివర్ సిటీ లొ పీడిత దళిత, బహుజనుల విద్యార్థులు రవాణాసూరినికి నివాళులు అర్పిస్తున్నారు, ఇప్పుడున్న మీడియా మద్య ఉన్నా పోటీ కారణంగా ఇలాంటి నివాళులను ప్రచారం చేస్తున్నారు, ఇలా ఇంకొన్ని సం. తరువాత ఇది దేశం మొత్తం పాకుతుంది. అప్పుడు నిజాన్ని జీర్ణించుకోలేక కామెంట్ వ్రాసే మహానుభావులు ఏమిచేస్తారో చూద్దాం.

  స్పందించండి

 7. అప్పుడు నిజాన్ని జీర్ణించుకోలేక కామెంట్ వ్రాసే మహానుభావులు ఏమిచేస్తారో చూద్దాం.
  kootala dayaalayya : nee veMi koostunnaavO neekainaa arthamavutOndaa?

  స్పందించండి

 8. Posted by శ్యామలరావు on అక్టోబర్ 27, 2011 at 8:55 ఉద.

  ఆర్యులనబడే జాతి వాళ్ళు ఉత్తరధృవ ప్రాంతాలనుండి భరతఖండానికి వలస వచ్చారనీ, దండయాత్రలతో అనార్యులైన స్థానికులని క్రూరంగా అణిచేసి, వాళ్ళ నాగరికతనీ, అస్థిత్వాన్ని ధ్వసంచేసి భూఖండం మొత్తం ఆక్రమించుకున్నారనీ చెప్పే సిధ్ధాంతం యేనాడో పరాస్తం అయింది. కాని యింకా కొంతమంది దాన్ని పట్టుకుని వ్రేలాడుతూ వెఱ్ఱి మొఱ్ఱి కథలల్లి ప్రచారం చేయాలని చూస్తున్నారు. అప్రామాణికమైన ఆర్యుల దురాక్రమణ సిధ్ధాంతం వలన ప్రయోజనం పొందదలచినా శాస్త్రీయ దృక్పధం లోపించిన వాదాలవల్ల వారే అంతిమంగా నష్టపోయేది.

  స్పందించండి

 9. ఈ వివాదం లో నిజ నిజాలు నాకు తెలియదు. కానీ ఈ మధ్య కొన్ని దళిత సంఘాలు, ఉద్యమ కారులు నరకాసురుడిని ఆరాదిస్తూ న్నారు .. దీన్ని కొంతమంది తప్పు పడుతూ నీచంగా బూతులు తిడుతున్నారు. నరకాసురుడు గొప్పవాడు అని రాయడం భూతులుతిట్టల్సినంత నేరం ఐతే మరీ యి పని రెండు ముడు దశాభ్దాల క్రితం నందమూరి తారక రామారావు చేశాడు కదా . రావణుడు , నరకాసురుడు, దుర్యోధనుడు వంటి విలన్లను ఆయన హీరోలుగా చూపుతూ సినిమాలు తీశాడు కదా . ఆలాంటి వారిని తిట్టడం అటుంచి , దేవుడు అని చెబుతున్నారు . ఎందుకు అంటే విషయాన్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి స్పందిస్తారా ? రాసిన విషయం నచ్చక పొతే మర్యాద పూర్వకంగా నచ్చలేదని చెప్పవచ్చో, ఏం నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో చెప్పేంత తెలివి ఉండాలి. కానీ తిట్లతో బెదిరించి నోరుముయాలనే ప్రయత్నం మంచిది కాదు. మీఋ రాసిన విషయాలన్నితితో నేను ఎకిభావించక పోవచ్చు కానీ ఎదుటి వాడు అసభ్యంగా తిట్టినా మీరు సభ్యతతోనే సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా . చెబుతున్నందుకు అభినందిస్తున్నాను

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: