లొక్ సత్తా కాదు లొక్ చెత్త శీర్షికతో తొమ్మిదో తేదీన రాసిన అంశాన్నిసమయాభావం – విస్తృతి అవుతుందన్న జ్ఞానంతోపాటు ఆవలింతలు – కునికిపాట్లు మధ్య చెత్తన0తా ఎత్తి పారబోయలేకపోయాను. అందుకని ఈ రెండో సంచికను సమర్పించాల్సి వస్తోంది. కాసింత పెద్ద మనసు చేసుకుని అంగీకరించండేం!
గతం గత: అనుకున్నా లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఇటీవల చేసేసిన తీర్మానాలు ఆయన వ్యక్తిగత నిజాయితీ పట్ల కూడా అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.
అందులో ముఖ్యమైనది విదేశీ ప్రతక్ష్యపెట్టుబడులకు జెపి అనుకూలంగా గొంతెత్తటం. ఏ విషయంలోనయినా ఆయన తన సొంత గొంతుకను విన్పించే హక్కు ఉంది. కొందరు అపోహపడుతున్నట్లుగా సొంత అభిప్రాయం కలిగి ఉండే హక్కు విషయంలోనూ, అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడించే హక్కు విషయంలోనూ నేను అభ్యంతరం వ్యక్తం చేయటం లేదు సుమా! నా వ్యతిరేకతల్లా కేవలం ఆయన సూత్రీకరణలతోనే అని విజ్ఞులు గమనిస్తారని ఆశిస్తాను. సరే, అసలు విషయానికి వద్దాం. అయనంటారూ, (పదాలు ఆయనవి కాదు, విషయం మాత్రమే) ”దుకాణం ఎవడు తెరిస్తే నాకెందుకండీ! నా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది కాబట్టి నేను వాల్‌మార్ట్‌కు స్వాగతం పలుకుతాను.”
సరే, ఎఫ్‌డిఐ రాకతో ఐదు కోట్ల మంది చిన్నాచితక దుకాణదారులు వీధుల పాలయ్యే ప్రమాదాన్ని పక్కనబెట్టి రైతుల సంగతే చూద్దాం. (నేనూ రెండెకరాల రైతునే నండోయ్!) ఆయన చెప్పినట్లుగా ఎక్కడయినా వాల్‌మార్ట్‌గానీ, అలాంటి బహుళజాతి కిరాణా గొలుసు దుకాణంగానీ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ తరహా దగుల్బాజీ కొడుకులు తమ లాభాలను వదులుకుని రైతుకు ఏ దేశంలో సాయపడ్డారో జేపీ కాసింత చెబుతారా? చూపిస్తారా? వాల్‌మార్ట్‌గానీ, ఇంకోకడుగానీ ఇతర దేశాల నుంచి తక్కువ ధరకు వచ్చే సరుకుల్ని కాకుండా మన రైతన్నకు ఎక్కువ ధర ఇచ్చి కొంటాడా? ఎందుకు కొంటాడో జేపీ చెప్పగలరా? వాళ్లంతా తెలివితక్కువ కొడుకులా? అమాయకులా? లేదా మన రైతుల పట్ల వారికి అపారమైన ప్రేమ ఏమయినా కారిపోతుందా?? వాళ్లనూ, వాళ్లకు తాన తందాన పాడే మీ లాంటి వాళ్లనూ మేము నమ్మితే పుట్టి మునగటం ఖాయం. అమెరికాకే చెందిన వాల్‌మార్ట్‌కు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజల భావాలను సమీకరిస్తున్న వేడ్ రాధ్కె ఏమంటున్నారో చూడండి – ”చవకగా దొరికే సరుకుల్ని చైనాలో కొని భారతదేశానికి తరలించే అవకాశం ఉంది. అ పనిలోనే చైనాలో వాల్‌మార్ట్ ఇప్పటికే 1200 కోట్ల డాలర్ల విలువయిన సరుకుల్ని సేకరించింది. అదే భారతదేశంలో కేవలం 200 కోట్ల డాలర్ల విలువయిన సరుకుల్ని మాత్రమే కొనుగోలు చేసింది.” ఇప్పుడయినా నమ్ముతారా? వాల్‌మార్ట్ వచ్చినా వాడెమ్మ విదేశీ మొగుడు ఎవడొచ్చినా మన బొచ్చెలో పడేది విదేశీ సరుకేనని. అంతెందుకు – వాల్‌మార్ట్‌గాడు ఏమి చేస్తున్నాడంటే అమెరికాలో తగినంత సరుకు రాసులు పోసి ఉన్నా ఫిలిప్సీన్స్‌లో తక్కువ ధరకు దొరుకుతున్నాయని యాపిల్ పండ్లనూ, మెక్సికో నుంచి బత్తాయిలనూ తీసుకువచ్చి అక్కడి రైతులను నట్టేట ముంచుతుంది. పాశ్యాత్య దేశాల పాలకులు ఓట్ల కోసం ధనిక రైతులకు నూరు శాతం రాయితీలు కూడా కల్పిస్తోన్న నేపథ్యంలో ఆయా దేశాల కన్నా మన ధరలు అధికంగా ఉండటం సహజం. అసలే అరకొర రాయితీలు అవీ సక్రమంగా అందని సమస్య ఉన్న మన దేశంలో ధరల వ్యత్యాసం కారణంగా మన రైతుల నుంచి ఏ ఒక్కటీ కొనేందుకు వాల్‌మార్ట్ ఒప్పుకోదుకాక ఒప్పుకోదు.
ఇక చిన్న దుకాణదారుల పరిస్థితి కూడా దారుణం అవుతుంది. కిరాణా వ్యాపారంలో విదేశీ ప్రతక్ష పెట్టుబడుల కారణంగా థాయ్‌ల్యాండ్‌లో 60 వేల చిన్న దుకాణదారులు దివాలా తీశారని ఆ దేశ ప్రభుత్వం స్వయంగా ప్రకటించటం పరిశీలనార్హం. దానికి భిన్నంగా భారతదేశంలో బడుగులకు వాల్‌మార్ట్ స్నేహ హస్తం అందజేస్తుందంటూ మనల్ని కూడా నమ్మమంటున్నారు జెపి.
10 డిసెం