‘దేగుడు” మా ప్రాంతపు ఆడవాళ్ల తిట్టు


ఈ తెనుగు పదం ఇంకెక్కడయినా విన్పిస్తుందో? లేదో? నాకు తెలియదు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మా ఈదుమూడి గ్రామంలో మాత్రం నేను చిన్నప్పటి నుంచీ విన్న, వింటున్న పదం ఇది. ఈ పదం ఆడవాళ్ల ప్రత్యేకం. వాస్తవానికి ఇది తిట్టు పదం. గ్రామ్యం. ఎవరయినా మగవాళ్లు కానిపనిచేసినా, నోరు జారినా ఆడవాళ్లు కసిగా, కోపంగా, తొలిగా ”దేగుడా” అంటూ తిడతారు. ఒక్కోసారి, కొందరు ”దొంగ నా దేగుడా” అని కూడా కలిపి మరీ తిడతారు.
మా ఊళ్లో ఏ ఏ తిట్లు తిడతారో ఇక్కడ చెప్పబోవటం లేదు సుమా. ఆడవారి తిట్ల భాషనో, మగవారు ఏ పదాలతో తిడతారో అసలే చెప్పబోవటం లేదు. కేవలం దేగుడు పదంపై నా అభిప్రాయాన్ని బ్లాగ్మిత్రులతో పంచుకుందామనే దీన్ని రాస్తున్నాను.
సరే, అసలు విషయానికొస్తే…. దేగుడు – ఈ పదం ”దేవుడు” పదానికి వికృతి. దైవం – దేవుడు అన్న సంస్కృత పదాల నుంచి పుట్టిన తెనుగు పదమే ఈ దేగుడు. ఇంత వరకూ పెద్దగా ఆశ్చర్య పడాల్సిన పనిలేదుగానీ, ఈ పద ప్రయోగమే కాస్త విచిత్రం. దేవుడు అంటే మంచివాడు అని కదా మరి దాన్నించి పుట్టిన దేగుడును తిట్టుగా ఎందుకు వినియోగిస్తున్నట్లు? తమ అనుభవాన్నుంచి ఈ పద ప్రయోగం ప్రారంభం అయి ఉండవచ్చు. అయితే ఈ పదం ఎప్పటి నుంచీ వినియోగంలో ఉందో తేలితేగానీ తిట్టుగా ఎలా మారిందన్న విషయాన్ని కచ్చితంగా తేల్చలేమని నా అభిప్రాయం. అయితే రెండు అంశాలు నేపథ్యంగా ఈ పదం వినియోగంలోకి వచ్చి ఉండవచ్చని నా అంచనా. అందులో ఒకటి – ఈ పదం గనుకు స్వాతంత్య్రోద్యమ కాలంలోనో, స్వాతంత్య్రం ఆగమించిన కాలం నుంచో గనుక ప్రారంభమయి ఉంటే మాత్రం అది త్రిపురనేని రామస్వామి చౌదరి నేతృత్వంలో మా ప్రాంతంలోనూ ప్రభావం చూపిన హేతువాద ఉద్యమ ఫలితం అయి ఉండాలి. ఎలాగంటే త్రిపురనేని, ఆయన శిష్యులు మా ప్రాంతంలో పురాణాల గుట్టును విప్పి చెప్పారు.రామాయణం – రాముడు – రావణాసురుడు, శంభూక వధ – సురులు – అసురులు ఇలా దేవుళ్ల బండారాన్ని ప్రచారం చేశారు. రచ్చబండలమీద చేరి రాక్షసుల గురించీ వివరించేవాళ్లు. దీనివలన కొంతమంది ఆలోచనాపరులు రాక్షసుల అభిమానులయ్యారు. సురాపానం చేసే సురులంటే అసహ్యం పెంచుకున్నారు. అంటే దేవుళ్లను తమ శత్రువులుగా గుర్తించారు. అలా దేవుడు అన్న పదాన్ని తప్పుడు పనిచేసిన వారికి, తమకు అన్యాయం చేసిన వారికి, తమపై నోరు పారేసుకున్న వారికీ ఆపాదించి ఛీదరించుకోవటం ప్రారంభం అయి ఉండాలి. కాలగమనంలో పలు పదాలు నోటికి తిరిగినట్లుగా మారిపోయినట్లుగానే దేవుడు పదం కూడా దేగుడుగా మారింది. అన్నట్లు మా ప్రాంతంలో ఈ పదాన్ని చేయిచేసుకునే భర్తలను తిట్టేందుకు కూడా స్త్రీలు విరివిగా వాడతారు.
ఈ పదం ఇంకా ప్రాచీనమయినదయితే మాత్రం దానికి మరో కోణం ఉంది. ఆర్యులు – ద్రావిడుల మధ్య చెలరేగిన తగాదాల్లోనే ఈ పదం పుట్టి ఉండాలి. ఆర్యులు సహజంగానే తమను ఇక్కడ ప్రతిష్టించుకునే పనిలో ఇంద్రుడు, రాముడు, కృష్ణుడిని దేవుళ్లను చేసి ద్రవిడులతో ఆటాడుకున్నారుగదా! అది గిట్టని ద్రవిడులు దేవుళ్లను తిట్టటం సహజం. రాక్షసులను (అసురులు) తమవాళ్లుగా భావించటమూ కద్దు. ఇక్కడ పాగా వేసేందుకు ఆర్యులు – తమ అస్థిత్వాన్ని కాపాడుకుని ఆర్యుల అరాచకాలను తిప్పికొట్టే పనిలో ద్రవిడులు మునిగిపోయిన క్రమంలో ఈ పదం పుట్టి ఉండాలి. తమ శత్రువులకు సంబంధించిన వాడయిన దేవుడుని, తాము చెడ్డవాడని భావించే వారికి ఆపాదించటం ప్రారంభమయి ఉండాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే దేవుడు అన్న ప్రకృతి మన గ్రామీణుల నోటపడి అది దేగుడుగా మారి ఉండాలి. ఏదేమయినా మా ప్రాంతంలో వినియోగించే తిట్టు పదం వెనుక  కొంత చరిత్ర – వాస్తవం – తమ శత్రువులను కచ్చితంగా గుర్తించిన వైనం – ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ పదం అంటే నాకెంతో ఇష్టం. అది మా గ్రామ్యం. అది మా వికృతి. అది మా అనుభవం నుంచి పుట్టిన పదం.

6 వ్యాఖ్యలు

 1. Posted by తాడిగడప శ్యామలరావు on డిసెంబర్ 14, 2011 at 6:07 ఉద.

  ఆర్యలనే వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి పడ్డారని చెప్పే సిధ్ధాంతం ఎన్నడో పరాస్తం అయింది.
  ఇంకా ఆ కాలం చెల్లిన సిధ్ధాంతం మీద పడి వాదనలు చేస్తున్నారా?

  స్పందించండి

 2. Arctic-The home of vedas అనే గ్రంధంలో , ఆర్యులు ఉత్తర ధృవం నుండి వలస వచ్చారని బాలగంగాధర తిలక్ వివరించాడు. ప్రఖ్యాత హిస్టారియన్ మాక్స్ ముల్లర్ అభిప్రాయం ప్రకారం ఆర్యులు ఐరోపా నుండి భారతదేశానికి మరియు జర్మనీకి వలస వెల్లారు. (నాజీల గుర్తు స్వస్తిక్) , ఆర్యులు బారతదేశంలోనే పుట్టారని వాదించిన ప్రముఖ చరిత్రకారులు ఎవరూ లేరు. ఉన్నారని ఎవరైనా భావిస్తే- దానికి తగ్గ రెఫరెన్స్ లతో వ్రాయగలరని మనవి.

  స్పందించండి

 3. sai,

  meeru oka 100 years venaka unnaru…please wake up

  స్పందించండి

 4. The page you are trying to access does not exist.Please select a page from the main menu.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: