దేశీయ కంపెనీలను చిదిమేస్తున్నాయి

Image

 

బహుళ జాతి కంపెనీలు ప్రవేశించిన ప్రతి చోటా దేశీయ కంపెనీలను చిదిమేసినట్లుగానే భారత్‌లోనూ చిదిమేస్తున్నాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే వంటి కంపెనీలు ఈహవాలో ముఖ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఏరంగంలో వేలు పెడితే ఆరంగంలోని దేశీయ కంపెనీ కన్నా ఈ బహుళ జాతి కంపెనీలే అధికంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. ఎఫ్‌ఎంసిజి, ఔషధాలు, ఆటోమొబైల్‌ ఉపకరణాలు, కేపిటల్‌ గూడ్స్‌ తదితర రంగాల్లో బహుళ జాతి కంపెనీల జోరుతో దేశీయ కంపెనీల వ్యాపారాలు పడిపోయి డీలాపడుతున్నాయి. గడచిన మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అత్యంతాధునిక సాంకేతికత, ఉత్పత్తి, బ్రాండ్‌ ఈక్విటీలతో మార్కెట్‌ను అవి కబళిస్తున్నాయి. ఈ క్రమంలో హిందుస్తాన్‌ యూనిలీవర్‌, నెస్లే, కాల్గేట్‌-పామోలివ్‌లు వరుసగా 95శాతం, 110శాతం, 150శాతం లాభాలను నమోదు చేసుకున్నాయి. ఇదే సమయంలో డాబర్‌, గోద్రెజ్‌ లాంటి దేశీయ కంపెనీల లాభాలు కుదించుకుపోతున్నాయి. ఔషధ రంగంలో బాగా పేరున్న సిప్ల, సన్‌ఫార్మా లాంటి పెద్ద కంపెనీలను జిఎస్‌కె ఫార్మా, అబోట్‌ ఇండియాలాంటి బహుళ జాతి కంపెనీలు అధిగమించాయి. గత మూడేళ్ల పెట్టుబడులకుగాను దేశీయ కంపెనీలు 25శాతం లాభాలను చవి చూడగా బహుళజాతి కంపెనీల లాభదాయకత 41శాతంగా నమోదైంది.

బహుళ జాతి కంపెనీల పనితీరును అంచనా కట్టే సిఎన్‌ఎక్స్‌ ఎంఎన్‌సి నిఫ్టీ తన అంచనాల్లో భారతీయ కంపెనీలు 19శాతం ఆదాయాలను పొందగా అదే కాలంలో బహుళ జాతి కంపెనీలు 45శాతం లాభాలను ఆర్జించాయి. బ్రాండ్‌ ఈక్విటీ బలంగా ఉండటం, పోటీకి సాటిరాని సాంకేతికతతో తయారైన ఉత్పత్తులు, ఆదాయాలు నిలకడగా కొనసాగడం, ఆస్థి అప్పుల పట్టీల స్థిరత్వం బహుళజాతి కంపెనీలజోరుకు ముఖ్య కారణంగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ ఒకరు వెల్లడించారు. అనేక విభాగాల్లో స్పష్టమైన నాయకత్వ సామర్ధ్యంతో పోటీని అధిగమించి విదేశీ కంపెనీలు దూసుకుపోగలుగుతున్నాయని కెఆర్‌ చోస్కీ దళారీ సంస్థలో సీనియరు విశ్లేషకుడు హర్దీప్‌షా అన్నారు. ఎన్నో ఏళు ్లగా ప్రపంచ మంతటా పాతుకుపోయిన ఎంఎన్‌సిల బ్రాండ్‌ ఈక్విటి పోటీనీ ఎదుర్కోవడం భారతీయ కంపెనీలకు కష్ట సాధ్యమవుతోందన్నారు. జాకీ బలమైన బ్రాండ్‌ ఇమేజి పేజ్‌ ఇండిస్టీస్‌కు బాగా ఉపయోపడటమే ఇందుకు చక్కని ఉదాహరణ.

దేశీయ విఐపి బ్రాండ్‌ తయారీదారు మాక్స్‌వెల్‌ ఇండిస్టీస్‌ను అధిగమించి జాకీ విక్రయాలు 38శాతం పెరిగాయి. కేవలం వినియోగదారుని కేంద్రంగా చేసుకుని వ్యాపార వ్యూహాలు నడపడం వల్లనే ఎంఎన్‌సిలకు ఇది సాధ్యం కాలేదని చెప్పాలి. ఆటోమేటివ్‌ ఉపకరణాల సరఫరాదారు బోష్‌ దగ్గరున్న సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడే సత్తా ప్రపంచంలో మరే ఇతర కంపెనీకి లేదనే అభిప్రాయం ఒకటివుంది. దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలనబడే ఇన్ఫోసిస్‌, టిసిఎస్‌, విప్రోలతో పోల్చితే ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పది శాతం అదనంగా లాభాలను దండుకుంటోంది. కేపిటల్‌ గూడ్స్‌ రంగంలో దేశీయ దిగ్గజం గ్రీవ్స్‌కాటన్‌ను కమిన్స్‌ ఇండియా అధిగమించేసింది. ఆటోమొబైల్‌ రంగంలో భారత దిగ్గజాలు టాటా మోటార్‌, మహీంద్ర 0.9 శాతం ఈక్విటీ నిష్పత్తిలో రుణాలు వుండగా మారుతి సుజుకికి పైసా రుణ భారం లేకపోవడం గమనార్హం. పాదరక్షల రంగంలో బాటా ఇండియాకు అప్పులు లేవు. అదే ఇతర పాదరక్షల కంపెనీలు రిలాక్సో ఫుట్‌వేర్‌, లిబర్టీషూస్‌ సుమారు 0.9 శాతం నంచి 1.4 ఈక్విటీ నిష్పత్తిలో రుణాలున్నాయి. డివిడెండ్ల చెల్లింపుల్లోనూ కాస్ట్రోల్‌, కాల్గేట్‌, నెస్లే, బోష్‌లు అత్యధికంగా డివిడెండ్‌ చెల్లిస్తున్నాయి. ఇందులో కాస్ట్రోల్‌ గత సంవత్సరం తన ఆదాయంలో 88 శాతం మేర డివిడెండ్‌ వాటాదారులకు చెల్లించించడం విశేషం.

One response to this post.

  1. బహుళ జాతి కంపెనీలు ప్రవేశించిన ప్రతి చోటా దేశీయ కంపెనీలను చిదిమేసినట్లుగానే భారత్‌లోనూ చిదిమేస్తున్నాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే వంటి కంపెనీలు ఈహవాలో ముఖ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఏరంగంలో వేలు పెడితే ఆరంగంలోని దేశీయ కంపెనీ కన్నా ఈ బహుళ జాతి కంపెనీలే అధికంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. ఎఫ్‌ఎంసిజి, ఔషధాలు, ఆటోమొబైల్‌ ఉపకరణాలు, కేపిటల్‌ గూడ్స్‌ తదితర రంగాల్లో బహుళ జాతి కంపెనీల జోరుతో దేశీయ కంపెనీల వ్యాపారాలు పడిపోయి డీలాపడుతున్నాయి. గడచిన మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అత్యంతాధునిక సాంకేతికత, ఉత్పత్తి, బ్రాండ్‌ ఈక్విటీలతో మార్కెట్‌ను అవి కబళిస్తున్నాయి. ఈ క్రమంలో హిందుస్తాన్‌ యూనిలీవర్‌, నెస్లే, కాల్గేట్‌-పామోలివ్‌లు వరుసగా 95శాతం, 110శాతం, 150శాతం లాభాలను నమోదు చేసుకున్నాయి. ఇదే సమయంలో డాబర్‌, గోద్రెజ్‌ లాంటి దేశీయ కంపెనీల లాభాలు కుదించుకుపోతున్నాయి. ఔషధ రంగంలో బాగా పేరున్న సిప్ల, సన్‌ఫార్మా లాంటి పెద్ద కంపెనీలను జిఎస్‌కె ఫార్మా, అబోట్‌ ఇండియాలాంటి బహుళ జాతి కంపెనీలు అధిగమించాయి. గత మూడేళ్ల పెట్టుబడులకుగాను దేశీయ కంపెనీలు 25శాతం లాభాలను చవి చూడగా బహుళజాతి కంపెనీల లాభదాయకత 41శాతంగా నమోదైంది.

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: