నాకొక మిత్రుడు(?) ఉండేవాడు. అతగాడి పేరులో నరుడూ, సింహమూ కలిసుంది. ఆ! పేరులో ఏముంది … వాడు మనిషేననుకున్నాను. వాడి మాటలు నమ్మి మానవత్వం పుష్కలంగా ఉందనుకున్నాను. అయినదానికీ కానిదానికీ వాడికి అండదండలు ఇచ్చాను. వెంట నడిచాను. మద్దతిచ్చాను. జైకొట్టాను. ఇదంతా ఒక కోణం. మరో కోణం మరోలా ఉండటం వలనే ఈ రాతకు పూనిక అయింది మరి. నాకు ఓ పనిబడింది. పెద్దోళ్ల మాట సాయం అవసరం వచ్చింది. సరే, మిత్రుడు గుర్తుకొచ్చాడు. మాట సాయం చేయమని విన్నవించాను. అదెంత పని అన్నాడు. అంటే అతగాడు మాట సాయం చేస్తాడని గట్టిగా నమ్మాను. మానవుడి సహజ లక్షణమయిన మాట మాట్లాడుతాడనుకున్నాను. తీరా తన పేరులోని రెండో సగానికి అతగాడు పనిబెట్టాడు. సింహం వలె గాండ్రించాడు. గర్జించాడు. నాతో ఏమీ చెప్పకుండానే ఏదో చేయమని చెప్పినట్లు ఓ పెద్ద అబద్ధం చెప్పి ఎంచక్కా తప్పుకున్నాడు. వాస్తవానికి అర్హుడనే అయినా నా పని కాలేదు. సొంత శక్తినే నమ్ముకుని ఉంటే ఎలా? ఉండేదో!
ఔరా! సింహమా … బుద్ధి చూపించుకున్నావులే! నీ తప్పు ఏముంది? నా లాంటి వాళ్లంతా విడివిడిగా ఉన్నంత కాలం నీలాంటి వాళ్లకు తిరుగే ఉండదని మేము ఎప్పుడు గ్రహిస్తామో?కదా!
28 నవం
Posted by Snkr on నవంబర్ 28, 2012 at 11:48 ఉద.
జూ పార్క్ వాళ్ళకి ఫోన్ చేయండి, అంతరించి పోతున్న జాతిని జూలో పెట్టి కాపాడండి. :))
Posted by Sudhakar on డిసెంబర్ 1, 2012 at 11:19 ఉద.
అంచె లంచెలు గా ప్రపంచ మంతా పెరిగి పోతున్న ” ఈ జాతి ” అంతరించి పోవడం ఏమిటండీ ! మీరు పోరపాటు పడుతున్నారు !
Posted by saarvabouma on నవంబర్ 28, 2012 at 1:35 సా.
పోలిక అసలు కుదర్లేదు బ్రథర్! నరుడి కంటే “సింహమే” గొప్పది.”సింహం” లా హుందాగా ప్రవర్తిస్తాడు అనుకుంటే నరుడిలా మనిషి నైజం చూపాడు” అంటే సరిపోతుందేమో?.విషయాన్ని పూర్తిగా చెపితే, ఒక వేళ ఆ “నరుడు” పబ్లిక్ వ్యక్తి అయితే అతను చేసిందేమిటొ చెపితే జాగర్త పడతాము కదా! “సగం చెప్పి ఊహించుకోమంటే, ఎలా?
Posted by తెలుగిల్లు on నవంబర్ 28, 2012 at 4:55 సా.
నరుడు కాని సిం హము ఎవ్వడంటే
ఏమని చెబుదును … ఎవ్వడని చెబుదును
ఓ పొగాకు వ్యాపారంలా … మరో సినిమా వాణిజ్యంలా
వాడిది స్నేహ వ్యాపారం
విరిగిన వేలి మీద ఉచ్చ పోయ నిరాకరించు వాడు
మైకు వదలని వాడు పుల్ల విరవని వాడు
నీతులు ఎదుటివారికని గట్టిగా నమ్మిన వాడు
కుందేళ్ళను కరకర నమలు వాడు
ఎంచి చూడ అక్కదక్కడ కానరాడె
వాడె మానవత్వం కోల్పోయిన నర సిమ్హుడు