13
డిసెం
పనోడేసిన పందిరిని పిచ్చుక కూల్చినట్లు
Posted డిసెంబర్ 13, 2012 by తెలుగిల్లు in Uncategorized. 2 వ్యాఖ్యలు
ధనిక దేశం – దరిద్ర ప్రజలు
ధనిక నాయకులు – దరిద్ర భావాలు
పనోడేసిన పందిరిని పిచ్చుక కూల్చినట్లు
గాంధి తెచ్చిన స్వా(హా)తంత్ర్యాన్ని అమెరికాకు అమ్ముకుంటున్నాడు సింగు
తాగుబోతు సంసారం పుటుక్కు
గుటకా తింటే ప్రాణమే గుటుక్కు
క్విడ్ ప్రో కో
ఇస్తినమ్మ వాయినం – పుచ్చుకుంటినమ్మ వాయినం
వెలుగున్న తెలుగు
తెగులు సోకి వెళ్లిపోయింది వెలుగు
పంట సాగు చేస్తే వ్యవసాయం
పరులను బాగు చేస్తే ఎగసాయం
భాగ్యనగరం బస్సెక్కాను
నరకం ఎరుకయ్యింది
ఎప్పటి మాదిరే చీకటి ఆవరించింది
తెల్లవారుతుంది కదా అని ఎదురుగాచాను
సూర్యుడయితే వేంచేశాడు
నీలమో – గాలమో తుపాను మబ్బులు అడ్డుపడ్డాయి
వెలుగు కోసం వెతుక్కుంటున్నాను మరి
చరిత్రకు మసి – నిజాలపై కసి
మానవత్వం మన్ను – ధనాధిపత్యం మిన్ను
అక్కడ మాటలు కోటలు కడతాయి
అక్కడ కోటలు కూటమి కడతాయి
అక్కడ వాణిజ్యం వర్ధిల్లుతోంది
అక్కడ వ్యాపారం సాగుతుంది
అక్కడ వ్యవహారాలూ నడుస్తాయి
అది వ్యవస్ధకు ఠీవి … అది టెలివిజన్ అను టీవీ
యేమిటీ విన్యాసాలు …. ఒకటే రొద
యేమిటీ విథ్యంసం …. మౌన ఫలితం
విద్యుత్తు కోత – గ్యాసుకు కోత – సంక్షేమానికే కోత
నిత్యావసరాల ధరలేమో మోత – విదేశీ చిల్లర కొట్లకు ఖాతా
పంటల గిట్టుబాటుకు వాత – నేతల జాతా
జనం జీతాలు, జీవితాలు రోత రోత
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
ఇలాంటివే
Posted by jayadev on డిసెంబర్ 14, 2012 at 3:23 ఉద.
very nice sir
Posted by తెలుగిల్లు on డిసెంబర్ 14, 2012 at 4:33 ఉద.
dhanyavaadaalu jayadeav gaaru