నా పేరు వెంకట సుబ్బారావు కావూరి… నేను పాత్రికేయుడిని
నేను గత 15 సంవత్సరాలుగా పత్రికారంగంలో పనిచేస్తున్నాను. నా ఆలోచనాసాలోచనలన్నింటికీ పత్రికలో చోటు దొరకదు కాబట్టి ఆ విషయంలో నాలో బోలెడంత నిరాశ ఏర్పడింది. ఆ నిరాశకు చోటులేకుండా చేద్దామనే తెలుగిల్లు పత్రికను ప్రారంభించి చేతులు కాల్చుకున్నాను. అప్పుడు తెలిసొచ్చిన బ్లాగోతంతో నా కోరిక తీర్చు కుందామనుకుంటే కంప్యూటరు వాడకంలో నాకు అంతగా పరిజ్ఞానం లేకపోవటం తంటాగా మారింది. నాకు అవసరమయిన మేరకే కంప్యూటరు వాడకం నేర్చుకుని నెట్టుకొస్తున్న వాడిని మరి. సరే చివరకు తెలుగిల్లు పేరిట బ్లాగును ప్రారంభించి నత్తనడకనయినా నడపాలని మీ ముందుకొచ్చాను. నా బ్లాగును చూస్తే నేను పడుతోన్న తంటా ఇట్టే తెలిసిపోవటంలా. సరే మధించి మధించి అప్పుడొక విషయాన్నీ ఇప్పుడొక సూత్రాన్నీ యురేకా అనేస్తున్నా. అన్నట్లు నా స్వవిషయాలు కొన్ని చెప్పాలను కుంటున్నాను. నేను కొన్నికథలు, కవితలు కూడా రాశానండోయ్. బలిపీఠం కథకు జాతీయ స్థాయిలో రెండో బహూమతి రాగా, ప్రఖ్యాత రచయిత కాలువ మల్లయ్య చేతులమీదుగా విజయవాడలో అందుకున్నాను. సీనియర్ జర్నలిస్టు బీసీ నారాయణరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డును 2009లో అందుకున్నాను. ఈనాడు (ఒంగోలు విలేకరి – 1995 నుంచి 2000 వరకూ – ఈ కాలంలో చాలమందిని నిద్రపోనీయలేదంటే నమ్మండి. అర్ధరాత్రి టెండర్లలో ఆంతరంగం అన్న ఒకే వార్తతో ఏడుగురు అధికారుల్ని సస్పెండు చేయించటం నిజ్జంగా నిజం. అంతేనా ప్రతిరోజూ వృత్తిగత సంతృప్తిని కలంతీరా అనుభవించాను.అందరూ రౌడీ నాయకుడని భయపడి వదిలేయగా నేను మాత్రం అతనిని ఉతికి ఆరేశాను. నా కాళ్లు తీయమని రెండుసార్లు రౌడీలను తోలగా నేను తప్పించుకున్నాను లెండి) ప్రజాశక్తి – 2001 నుంచి 2007 వరకూ, సబ్ ఎడిటర్ మొదలు అసిస్టెంటు ఎడిటర్ వరకూ ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదులో పనిచేసి అనేక విషయాలు నేర్చుకున్నాను. సహచరుల ఆదరణ పొందాను. ఆంధ్రజ్యోతి 2007 – సీనియర్ సబ్‌ఎడిటర్- రూరల్ డెస్క్, హైదరాబాదులో పనిచేసినా నేర్చుకుందీ లేదు, సంతృప్తీ లేదు. అనంతరం 2009 జూన్ వరకూ మా టీవీ – స్టేట్ న్యూస్ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తుండగానే వార్తల విభాగాన్ని మూసేసి మమ్మల్ని రోడ్డుమీదకు నెట్టేశారు. సరే కొన్నాళ్లు ఆ పత్రికనీ, ఈ పుస్తకమనీ, సేవా కార్యక్రమాలనీ తిరిగి ప్రస్తుతం అంటే ఏప్రిల్ 2010లో ప్రజాశక్తిలో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా వెలగబెడుతున్నాను. తెలుగిల్లు బ్లాగుకి నేనే రచయితని, నేనే సంపాదకుడ్ని. అదో సం-తృప్తి. సాంకేతిక విషయాల్ని కనీసం నేర్చుకుని పత్రికల్లో సృష్టించిన సంచలనాలను బ్లాగులోనూ బ్లాగరించాలన్న కోరికతో ముందుకు సాగుతున్నాను. మీ ఆశీర్వచనాలు కోరుతున్నాను. మాది ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం, ఈదుమూడి గ్రామం. మా తాతయ్య, మా నాన్న, మా తమ్ముడు ఉపాధ్యాయులు కాగా మా అమ్మ భారతీదేవి మంచి రైతు అని చెప్పుకోవటానికి ఒకింత గర్వపడుతున్నాను.
వెంకట సుబ్బారావు కావూరి.
జర్నలిస్టు
Posted by kvsv on జూన్ 30, 2010 at 7:36 ఉద.
చాలా చక్కగా వుందండీ మీ బ్లాగ్..చాలా నీట్ గా ప్రెసెంట్ చేశారు..శుభాబినందనలతో…
Posted by jayadev on జూలై 19, 2010 at 12:44 సా.
simle nd depthy expression rao jee
Posted by jayadev on జూలై 19, 2010 at 12:45 సా.
simple nd depthy xpression rao jee
Posted by farook on ఆగస్ట్ 21, 2010 at 7:38 సా.
All the best. Adirinidi sir mee profile………..
Posted by srinivas on ఆగస్ట్ 26, 2010 at 8:15 ఉద.
all the best.
Posted by Pramod Kumar Eleti on సెప్టెంబర్ 11, 2010 at 6:52 ఉద.
I feel that what you are doing is great. Many peopel shall raise to encouage you and support you in whatever way they can to stand with you continue this blog.
Posted by venkatrao.n on అక్టోబర్ 8, 2010 at 7:52 ఉద.
baagundi site.
Posted by karlapalem Hanumantha Rao on అక్టోబర్ 10, 2010 at 1:53 ఉద.
మీ బ్లాగ్ అద్భుతం. నేను సరిగ్గా ఎలాంటి బ్లాగ్ తయరుచేయలనుకున్నానో అలాంటిది విస్వరూపంతో ఇక్కడ కనిపించింది. విస్తు పోవటం తప్ప చెయ్య గలిగింది ఏముంది!. మీ గురించి మీరు రాసుకున్నది చదివాను.నాకు ఎందుకో చాల నచ్చింది.ముందు ముందు మీరు నాకు కూడా సలహాలు ఇవ్వమని మనవి.మీ నాగులుప్పలపాడు దగ్గరలోని అమ్మనబ్రోలు లో నేను 1976 లో బ్యాంకు గుమస్త గా ౩ ఏళ్లు పనిచేసాను సార్!
మీ బ్లాగ్ ని నా బ్లాగ్ కి లంకె వేసుకుంటాను సార్!మీరు చేసిన అభినందనలు నాకు కొత్త వుత్సాహాన్ని ఇస్తున్నాయి,తరచూ నా బ్లాగులు చూసి సలహాలు ఇవ్వండి సార్! ఇంకా మీ బ్లాగ్స్ లోని పోస్టింగులు చూడలేదు ,చూసి స్పందిస్తాను.
Posted by తెలుగిల్లు on అక్టోబర్ 10, 2010 at 3:29 ఉద.
మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. ఖూని కథలో మీరున్నారు చదవండి. అది ప్రజాశక్తి ఆదివారంలోనూ ప్రసురితమయింది సార్.
Posted by jaggampeta on అక్టోబర్ 13, 2010 at 9:57 ఉద.
మీ బ్లాగ్ చదివి మీ గురించి తెల్సుకున్నాను .మీ బ్లాగే కాదు మీ రచనలు ఎంతో అందంగా ఉంటాయని .ఏమైనా మీ బ్లాగ్ అందం చూసి ఈర్ష్య కల్గుతోంది .నాకు ఇప్పటకి పేజీలు పెట్టి ఎలా పోస్ట్ చేయాలో తెలేయడం లేదు. పోస్ట్ చేస్తే ప్రతీది హోం పేజీకి వస్తోంది .జోక్స్, సూక్తులు ,…..లా విభాగాలు చేయాలనీ ఉంది .విభాగాలు చేయడం తెలిసింది కాని సరిగ్గా అదే పేజీలోకి పోస్ట్ చేయడం తెలియడం లేదు .తెలపగలరు .నమస్కారములతో…..మల్లిశ్రి
Posted by జ్యోతి on అక్టోబర్ 13, 2010 at 10:40 ఉద.
Best of Luck.
Posted by కర్లపాలెం హనుమంత రావు on అక్టోబర్ 21, 2010 at 7:16 సా.
ఇప్పుడు తీరికగా మీ గురించి చదివాను.
మీ లాంటి పాత్రికేయునితో సంపర్కం ఏర్పడినందుకు ఇప్పుడు నిజంగా గర్వ పడుతున్నాను,నాకు నా రచనలు ప్రజాశక్తి లో చూసుకోవాలని ఆరాటం. ఇక్కడనుంచి ఎలా పంపాలో తెలియక వూరుకున్నాను. ఒకటి రెండు సార్లు నాకు తెలిసిన feedback email కి పంపించాను. వాటి గతి ఏమయిందో తెలియదు. ప్రస్తుతం నేను USA లో నవంబర్ వరకు వుంటాను. తిరగి వచ్చినప్పుడు హైదరాబాద్ లో కలవలను కుంటున్నాను. జస్ట్ పరిచయం కోసమే నండి! ఏ favour కోసం కాదు .మీరు వీ లయినప్పుడల్లా నా బ్లాగ్ చూసి స్పందిస్తే నాకు దానిని మరింత మెరుగులు దిద్దుకోవటానికి వుంటుంది. మీ స్పందన కోసం ఎదురుచూస్తుంటాను kvs గారూ!
Posted by తెలుగిల్లు on అక్టోబర్ 22, 2010 at 11:45 ఉద.
ప్రజదక్తికి మీరు రాస్తాననటమం గొప్పగా భావిస్తిన్నాను. మీరు ఇప్పుడు అమెరికాలే ఉన్నారు కనుక అక్కడి పర్యాటకంపై ఆదివారం సంచికకు రాయవచ్చు.
నా మెయిలు పంపుతున్నాను.
vsrkavuri@gmail.com
Posted by నాగరాజు గోల్కొండ on అక్టోబర్ 24, 2010 at 11:49 సా.
సుబ్బారావుగారు…మీ పరిశ్రమ అభినందనీయం. మీ అభిరుచులు బాగున్నాయి .మీరు పాత్రికేయులు సాహిత్యాభిరుచి బాగా కలిసొచ్చింది. మీ పోస్ట్ లు బాగున్నాయి.
Posted by tsprakash on నవంబర్ 2, 2010 at 2:46 సా.
మీ తెలుగిల్లు అలంకరణ, పోస్టులు చాలా బావున్నాయి. మీ గురించి చదివాక బ్లాగ్ లోకంలో ఓ పాత్రికేయ మిత్రుడు పరిచయం అయినందుకు అమితానందం కలిగింది. నేను ఉదయం లో సబ్ ఎడిటర్ గా చివరివరకూ పనిచేశాను. ఆ తర్వాత చిన్న చిన్న పత్రికల్లో కొనసాగి, ప్రస్తుతం మరో పాత్రికేయ మిత్రునితో కలసి పల్లెక్రాంతి పేరుతో దినపత్రికను ఈ డిసెంబరు నుంచి విజయవాడ కేంద్రంగా ప్రారంభిస్తున్నాము. ఈ ప్రయత్నం లోనే తెలుగు బ్లాగు లోకం పరిచయం అయింది. రోజూ ఓ గంట తెలుగు బ్లాగులను చూడడం అలవాటయింది. మీరు మంచి పోస్టులు ఇస్తున్నారు. అభినందనలు…. నా ఈ మెయిల్ చిరునామా కింద ఇస్తున్నాను. స్పందించగలరు….
prtamiri@journalist.com
Posted by prtamiri on నవంబర్ 2, 2010 at 2:49 సా.
మీ తెలుగిల్లు అలంకరణ, పోస్టులు చాలా బావున్నాయి. మీ గురించి చదివాక బ్లాగ్ లోకంలో ఓ పాత్రికేయ మిత్రుడు పరిచయం అయినందుకు అమితానందం కలిగింది. నేను ఉదయం లో సబ్ ఎడిటర్ గా చివరివరకూ పనిచేశాను. ఆ తర్వాత చిన్న చిన్న పత్రికల్లో కొనసాగి, ప్రస్తుతం మరో పాత్రికేయ మిత్రునితో కలసి పల్లెక్రాంతి పేరుతో దినపత్రికను ఈ డిసెంబరు నుంచి విజయవాడ కేంద్రంగా ప్రారంభిస్తున్నాము. ఈ ప్రయత్నం లోనే తెలుగు బ్లాగు లోకం పరిచయం అయింది. రోజూ ఓ గంట తెలుగు బ్లాగులను చూడడం అలవాటయింది. మీరు మంచి పోస్టులు ఇస్తున్నారు. అభినందనలు….
Posted by Ram Murthy on నవంబర్ 30, 2010 at 4:33 సా.
I tried to type in Telugu and gave up writing equivalent English words. You are doing great service to Telugu readers by providing information and opinions.
Sir: Please keep itup.
Posted by kvrn on జనవరి 25, 2011 at 5:03 ఉద.
you are doing great kaavuri subbarao garu, well done. plese keep it up. with regards.
Posted by తాడేపల్లి హరికృష్ణ on జనవరి 28, 2011 at 10:37 సా.
ప్రజాజీవితాని గురించిన మౌలికమైన విషయాలని ఇంత సూటిగా, నిర్భీతిగా రాస్తున్నందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. ఎప్పటికప్పుడు కొత్త సెన్సేషనల్ చెత్త రాసుకుంటూ, చూపించుకుంటూ సొమ్ముచేసుకునే మీడియ అనబడే వ్యాపార మాధ్యమాలకి ప్రజాజీవనంపట్ల, ప్రభుత్వాల గమనం మీదా వాటికున్న జ్ఞాపకశక్తి లిప్తమాత్రం కన్నా తక్కువ. మీరు యేళ్ళ క్రితం జరిగిన విషయాలని ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలతో పోల్చి నిష్టురమైన నిజాల్ని రాస్తున్నారు. మీ ప్రయత్నం కొనసాగించండి.
– తాడేపల్లి హరికృష్ణ
Posted by sateesh on ఏప్రిల్ 9, 2011 at 1:15 సా.
great work friend., live the life fullest.
hope u can visit iandsahachara.blogspot.com
Posted by srinu karasala on ఆగస్ట్ 28, 2011 at 4:01 సా.
సుబ్బారావు…మీ పరిశ్రమ అభినందనీయం. మీ అభిరుచులు బాగున్నాయి .మీరు పాత్రికేయులు సాహిత్యాభిరుచి బాగా కలిసొచ్చింది. మీ పోస్ట్ లు బాగున్నాయి.
Posted by palla kondala rao on డిసెంబర్ 11, 2011 at 5:15 సా.
సుబ్బారావు గారూ !
మీ బ్లాగు బాగుంది. కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోవడం మీకు పెద్ద కష్టం కాదు. ఇపుడున్న చాలా బ్లాగులతో పొలిస్తే మీ బ్లాగు మీ పోస్టులు బాగున్నాయి. ప్రజాశక్తి లో పని చేస్తున్నారు గా బూర్జువా పత్రిక కాదు గనక వేతనాలు ఎలా వున్నా సంతృప్తి గారంటీగా వుంటుంది. మీ గురించి వివరాలు చెప్పిన పద్దతి కూడా బాగుంది. గో ఏ హెడ్ . తెలుగు బ్లాగు ప్రపంచానికి మీ లాంటి రచయితల అవసరం చాలా వుంది.
Posted by చందుతులసి on ఆగస్ట్ 27, 2012 at 10:50 ఉద.
రావు గారు. మీ బ్లాగు చాలా చాలా బాగుంది.
Posted by singuraja on ఫిబ్రవరి 13, 2013 at 8:21 ఉద.
బాగుందండి,